Hair care tips : జుట్టు బాగా ఊడిపోతుందా .. అయితే ఎప్పుడూ చూడని ఈ ఆకు నూనెను ఒకసారి ట్రై చేయండి ..!
Hair care tips ప్రస్తుతం మారిన జీవన శైలి కారణంగా చాలామంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. జుట్టు రాలిపోవడం, తెల్ల వెంట్రుకలు రావడం, చుండ్రు రావడం ఇలా ఎన్నో సమస్యలు చాలా మందిని వేధిస్తున్నాయి. ఈ సమస్యలన్నింటినీ తగ్గించుకోవడానికి ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. మన చుట్టూ ఎన్నో రకాల మొక్కలు పెరుగుతూ ఉంటాయి. కానీ అవన్నీ పిచ్చి మొక్కలు అనుకుంటాం. కానీ వాటి వలన కలిగే ప్రయోజనాలు తెలిస్తే నోరెళ్ల పెట్టాల్సిందే. చాలామంది మన ఇంటి చుట్టుపక్కల ఉండే గుంటగలగర ఆకు మొక్కను చూసే ఉంటారు.
చాలామంది దీనిని పిచ్చి మొక్క అనుకుంటారు. కానీ దీనితో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆకు గురించి పల్లెటూర్లలో ఉండే వారికి బాగా తెలుస్తుంది. మార్కెట్లో దొరికే ఖరీదైన నూనెలు వాడే బదులు ప్రకృతిలో దొరికే ఈ ఆకుతో నూనె తయారు చేసుకుని జుట్టుకు రాసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఈ గుంటగలగర ఆకులను తీసుకొని శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి రసం తీయాలి. ఈ ఆకు రసం ఒక కప్పు తీసుకుంటే మరొక కప్పు కొబ్బరి నూనె తీసుకొని రెండింటిని కలిపి ఒక గిన్నెలో పోసి పొయ్యి మీద పెట్టి రసం అంత విరిగిపోయి నూనె మిగిలే వరకు మరిగించాలి.
ఇలా మరిగిన నూనెను వడకట్టి సీసాలో నిల్వ ఉంచుకోవాలి. ఈ నూనెను ప్రతిరోజు జుట్టుకు పట్టిస్తే చుండ్రు సమస్యలు తొలగిపోతాయి. అలాగే జుట్టు పెరిగి బలంగా తయారవుతుంది. గుంటగలగర ఆకు దొరకని వారు మార్కెట్లో దీని పొడి దొరుకుతుంది. ఆ పొడితో నూనెను తయారు చేసుకోవచ్చు. ఈ ఆకును ఒకసారి తయారు చేసుకుంటే నెలరోజుల వరకు వాడవచ్చు. ఈ నూనె వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి అన్ని వయసులో వారు ప్రయత్నించవచ్చు. ఈ నూనె రాసిన తర్వాత నెల రోజులకి రిజల్ట్ తెలుస్తుంది. ఈ నూనె రాసుకోవడం వలన జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి.