Hair Tips : రాత్రి పడుకునే ముందు నూనెలో ఈ 1 కలిపి పెట్టుకుంటే వద్దన్నా మీ జుట్టు భయంకరంగా పెరుగుతుంది | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hair Tips : రాత్రి పడుకునే ముందు నూనెలో ఈ 1 కలిపి పెట్టుకుంటే వద్దన్నా మీ జుట్టు భయంకరంగా పెరుగుతుంది

 Authored By aruna | The Telugu News | Updated on :5 September 2023,2:00 pm

Hair Tips : ఒకే ఒక ఆయిల్ తో మీ జుట్టు పొడవుగా పెంచుకోవాలని ఉందా.. మీరు ఇప్పటివరకు ఎంత హేరైతే లాస్ అయ్యారో అంత హెయిర్ కి డబల్ పెరుగుతుంది. ఈ ఒక్క ఆయిల్ తయారు చేసుకొని ఇంట్లో స్టోర్ చేసుకుంటే మీకు చాలా రోజుల వరకు వస్తుంది. కాబట్టి మీరు ఎటువంటి మందులు వాడాల్సిన అవసరం ఉండకుండా బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగాల్సిన పని లేకుండా మీ జుట్టు చాలా ఈజీగా పెరుగుతుంది. ఎందుకంటే ఇందులో వాడే ఇంగ్రిడియంట్స్ అన్ని కూడా చాలా పవర్ఫుల్ ఇంగ్రిడియంట్స్. అది కూడా మీకు అందుబాటులో ఉండే ఇంగ్రిడియంట్స్ కాబట్టి. అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా హెయిర్ ఫాల్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా ఎన్ని రకాలుగా మన జుట్టూ ఊడిపోతూ ఉంటుంది. కాబట్టి మీకు జుట్టు ఎందుకు రాలుతుంది అనేది ముందుగా గమనించాలి. కోల్పోయిన జుట్టు తిరిగి పొందుకోవడమే కాకుండా దృఢంగా బలంగా ఆరోగ్యంగా మీ జుట్టు పెరిగితేరుతుంది.

మరి ఈ పవర్ ఫుల్ రెమిడి ఎలా తయారు చేసుకోవాలో వాటికి ఏమి కావాలో చూసేద్దాం.. ముందుగా మూడు తమలపాకులు తీసుకోండి. తమలపాకులు చాలా ఈజీగానే దొరుకుతాయి కదా.. మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలకు చికిత్స చేయడానికి తమలపాకులు లేదా పాన్ ఆకులను ఆయుర్వేదంలో వాడుతారు. ఈ జుట్టు ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేస్తుంది.. ఇప్పుడు మీరు మూడు తమలపాకులను తీసుకున్నారు కదా వాటిని శుభ్రంగా కడిగేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్ లో ఉంచుకోండి. ఇప్పుడు మనం ఒక గుప్పెడు వరకు తీసుకుని కరివేపాకును ఈ ప్లేట్లో వేయండి.

hair Tips With Oil

Hair Tips : రాత్రి పడుకునే ముందు నూనెలో ఈ 1 కలిపి పెట్టుకుంటే వద్దన్నా మీ జుట్టు భయంకరంగా పెరుగుతుంది

కరివేపాకు కొలెస్ట్రాన్ని తగ్గించడానికి జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి చక్కగా పనిచేస్తుంది. అలాగే ఒక ఏడు లేదా ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలను పోట్టు ఒలిచేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ ప్లేట్లో వేసుకోండి. అలాగే ఒక స్పూన్ మెంతులు తీసుకోవాలి. స్టవ్ పై ఒక స్టీల్ గిన్నెను పెట్టి దానిలో ప్యూర్ కొబ్బరినూనె ఒక పావు లీటరు పోసుకోవాలి. దానిలో ముందుగా మెంతులు వేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న ఇంగ్రిడియంట్స్ ఒక్కొక్కటి తమలపాకులు వెల్లుల్లి, అలాగే కరివేపాకు కూడా వేసేయండి. ఇవి బాగా మాడిపోకూడదు. నలుపు రంగు రానివ్వకండి. గోల్డ్ కలర్ లోకి వస్తుంది.

ఆ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించుకోవచ్చు. ఇలా బాగా చల్లారిన తర్వాత స్ట్రైనర్ సహాయంతో ఒక గాజు సీసాలోకి వడగట్టుకుని స్టోర్ చేసుకోండి. ఈ ఆయిల్ ని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. రోజు కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా ఈ ఆయిల్ ని వాడినట్లయితే మీ జుట్టు వద్దన్నా భయంకరంగా పెరుగుతుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది