Hair Fall | మీకు జుట్టు రాలుతుందా.. అసలు విషయం తెలిస్తే అవాక్కవుతారు..!
Hair Fall | ఎక్కువ సేపు ఒత్తిడికి గురికావడం మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా చర్మం, జుట్టుపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మంచి మానసిక స్థితి, కాంతివంతమైన చర్మం, ఆరోగ్యకరమైన జుట్టు కోసం ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం తప్పనిసరి అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
#image_title
నిపుణులు సూచిస్తున్న పద్ధతులు:
1. ధ్యానం, శ్వాస వ్యాయామాలు
రోజుకు 10-15 నిమిషాలు ధ్యానం చేయడం లేదా శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారుతుంది.
2. జర్నలింగ్, సమస్యలు పంచుకోవడం
మనసులోని ఆలోచనలు, బాధించే విషయాలను డైరీలో రాయడం లేదా స్నేహితులు, సన్నిహితులతో పంచుకోవడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది.
3. వ్యాయామం
రోజూ 20-30 నిమిషాలు వ్యాయామం చేయడం లేదా నడక అలవాటు చేసుకోవడం ద్వారా ‘ఎండార్ఫిన్’ అనే సంతోష హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
4. సమతుల్య ఆహారం, నిద్ర
రోజుకు కనీసం 7-8 గంటలు నిద్రపోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇవి ఒత్తిడిని నియంత్రించడమే కాకుండా జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
జీవనశైలిలో ఈ చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఒత్తిడిని నియంత్రించుకోవచ్చు. దీంతో మనసు ప్రశాంతంగా ఉండటమే కాకుండా, చర్మం మెరిసిపోవడం, జుట్టు ఆరోగ్యంగా ఉండడంలోనూ ఉపకరిస్తాయి.