Health Benefits : బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ డ్రింక్ తో 10 రోజుల్లో అద్భుతమైన ఫలితం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ డ్రింక్ తో 10 రోజుల్లో అద్భుతమైన ఫలితం

Health Benefits : చాలా మంది అధిక బరువుతో సతమతం అవుతారు. బరువు తగ్గేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వివిధ రకాల హెల్త్ డ్రింక్స్ తీసుకుంటారు. వాటితో ఒక్కో సారి శరీరంలో వేడి చేస్తూ ఉండొచ్చు. కానీ శరీరానికి చలవ చేస్తూ కొవ్వును కరిగించే ఒక మంచి హెల్త్ డ్రింక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దాని కోసం మనకి కావలసిన పదార్థం నిమ్మకాయ. జస్ట్ నిమ్మ కాయతో మంచి హెల్త్ డ్రింక్ ను తయారు చేసుకోవచ్చు.మూడు నిమ్మకాయలు […]

 Authored By pavan | The Telugu News | Updated on :16 April 2022,9:30 pm

Health Benefits : చాలా మంది అధిక బరువుతో సతమతం అవుతారు. బరువు తగ్గేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వివిధ రకాల హెల్త్ డ్రింక్స్ తీసుకుంటారు. వాటితో ఒక్కో సారి శరీరంలో వేడి చేస్తూ ఉండొచ్చు. కానీ శరీరానికి చలవ చేస్తూ కొవ్వును కరిగించే ఒక మంచి హెల్త్ డ్రింక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దాని కోసం మనకి కావలసిన పదార్థం నిమ్మకాయ. జస్ట్ నిమ్మ కాయతో మంచి హెల్త్ డ్రింక్ ను తయారు చేసుకోవచ్చు.మూడు నిమ్మకాయలు తీసుకుని రెండు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. వాటిలో ఉండే విత్తనాలను తీసి పడేయాలి. తొక్కలతో సహా నిమ్మకాయను వీలైనంత మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. తరువాత దానిని 15 రోజుల వరకూ ఫ్రిజ్లో నిల్వ చేసుకోవచ్చు.

రోజూ ఉదయాన్నే ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో ఒక స్పూన్ నిమ్మ కాయ పేస్ట్ కలిపి తాగడం వలన శరీరంలో కొవ్వు కరిగించుకోవచ్చు. పరగడుపున ఈ డ్రింక్ తాగడం వలన శరీరంలో మెటబాలిజం రేటును పెంచుతుంది.నిమ్మకాయ నీరు శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూస్తుంది. డీహైడ్రేషన్ కు గురికాకుండా చూస్తుంది. జీర్ణక్రియ మెరుగు పర్చడంలో తోడ్పడుతుంది. అలాగే బరువు తగ్గడాన్ని పెంచుతుంది. అయితే, కొవ్వు తగ్గే విషయంలో నిమ్మ కాయ నీరు సాధారణ నీటికి సహాయం చేస్తుంది. ఈ నిమ్మ కాయ నీటిని తయారు చేయడం చాలా ఈజీ. అలాగే అధిక కేలరీల పానీయాల కోసం తక్కువ కేలరీల ప్రత్యామ్నాయంగా ఈ నీటిని ఉపయోగించవచ్చు.

Health Benefits and lose weight super fast fat cutter drink

Health Benefits and lose weight super fast fat cutter drink

దీనికి తేనె కలిపి తీసుకోవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తాగడం మంచిది.ఈ డ్రింక్ లో పూర్తిగా నిమ్మ కాయ మాత్రమే వాడడం వలన ఇది కొంచెం చేదుగా, పుల్లగా ఉంటుంది. నిమ్మ తొక్కలు బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తాయి. ఎందుకంటే అవి పెక్టిన్ అనే ఫైబర్ కలిగి ఉంటాయి, ఇది మీకు ఎక్కువ కాలం కడుపు నిండినట్లు అనిపించడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అదనంగా, నిమ్మ తొక్కలలో పాలీఫెనాల్స్ కూడా ఉంటాయి. ఇవి శరీర కొవ్వును దూరంగా ఉంచుతాయి. అందుకే రోజూ ఈ డ్రింక్ తాగుతూ బరువు తగ్గడాన్ని సులభం చేసుకోవచ్చు.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది