Health Benefits : ప్రస్తుతం మన ఉన్న ఈ వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే వ్యాధులు జలుబులు, దగ్గులు జ్వరాలు, వైరల్ ఫీవర్స్ ఇలాంటి వ్యాధులు ఎన్నో వస్తుంటాయి, ఈ వర్షాల వల్ల ఎన్నో బ్యాక్టీరియాలు అభివృద్ధి చెందుతాయి. వీటి వల్ల ఈ వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. ఈ బ్యాక్టీరియాలు నీటిలో ఎక్కువగా నివసిస్తూ ఉంటాయి. వర్షపు నీరు ఎక్కడపడితే అక్కడ ఆగుతుంటాయి. ఇండ్లలో పూలకుండీలో, ప్లాస్టిక్ డబ్బాలలో, సైకిల్ ,బండ్లు టైర్లలో ,కొబ్బరి బోండాలు ,ఇలాంటి వాటిలో ఎక్కువగా నీరు ఆగుతూ ఉంటుంది. అయితే వీటిలో ఎన్నో రకాల దోమలు, క్రిములు తయారవుతూ ఉంటాయి. ఈ దోమలు కుట్టడం. వల్ల ఎన్నో రకాల రోగాల బారిన పడుతుంటారు. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా ,టైఫాయిడ్ ఇలాంటివన్నీ వస్తుంటాయి. టైఫాయిడ్ ఈ టైఫాయిడ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది.
దీని లక్షణాలు నీళ్ల విరోచనాలు వాంతులు, వికారం లక్షణాలు ఉంటాయి. మలేరియా జ్వరం ఈ జ్వరం దోమ కుట్టడం వలన ఈ మలేరియా జ్వరం వస్తుంది. దీని లక్షణాలు చలి జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఈ మలేరియా జ్వరం ఎక్కువైతే బ్రెయిన్ దెబ్బతింటుంది. ఊపిరి తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. డెంగ్యూ జ్వరం ఈ జ్వరం కూడా దోమ కొట్టడం వలన వస్తుంది. దీని లక్షణాలు జ్వరం తీవ్రత 102 డిగ్రీలు ఉంటుంది. అలాగే ఒళ్ళు నొప్పులు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, చాతి వెనక భాగంలో నొప్పి అలాగే పిడ్స్ కూడా వస్తాయి. ఈ డెంగ్యూ జ్వరంలో పలు రకాలు ఉంటాయి దీనివలన శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. అలాగే రక్త కణాలు కూడా తగ్గిపోతాయి. ఇది ఎక్కువైతే ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశాలు ఉంటాయి. అయితే ఇది వస్తే ముందుగానే చికిత్స తీసుకోవాలి.
చికెన్ గునియా ఇది దోమ కొట్టడం ద్వారానే వస్తుంది. జ్వరం రోజు మొత్తం ఉండదు. జ్వరం వస్తూ పోతూ ఉంటుంది. అలాగే ఒళ్ళు నొప్పులు కూడా ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. తప్పకుండా వైద్యుల దగ్గరికి వెళ్లి చికిత్స పొందాలి. లేకపోతే ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే ఈ వర్షాలు వచ్చినప్పుడు వర్షమునుకు తడవడం, అలాగే బయట ఫుడ్ ను తీసుకోవడం, లాంటివి అస్సలు చేయవద్దు. అలాగే వర్షపు నీరు ఇంట్లో ఆగకుండా చూసుకోవాలి. అలాగే పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. వర్షాకాలంలో మనం త్రాగే నీరు కాచి చల్లార్చి తీసుకుంటూ ఉండాలి. అలాగే మాంసాహారాలు ఎక్కువగా తీసుకోవద్దు. అలాగే ఆకుకూరలు కూడా ఎక్కువగా తీసుకోవద్దు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోండి .అని వైద్యరంగం చెబుతున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.