Sai Pallavi Gargi Review : లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి తాజాగా నటించిన మూవీ గార్గి. ఈ సినిమా తమిళం మూవీ. కానీ.. తమిళంతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేశారు. తన తండ్రి కోసం ఒక కుమార్తె ఎలాంటి న్యాయ పోరాటం చేసిందే చెప్పేదే ఈ సినిమా. ఈ సినిమాను తెలుగులో రానా దగ్గుబాటి సమర్పించగా.. తమిళంలో సూర్య, జ్యోతిక సమర్పించారు. నిజానికి.. ఈ సినిమాకు పెద్దగా ప్రమోషన్స్ కూడా చేయలేదు. అసలు.. సాయి పల్లవి విరాట పర్వం తర్వాత గార్గి అనే సినిమాలో నటిస్తోందని చాలామందికి తెలియదు. ఎలాంటి హడావుడి లేకుండా.. ఈ సినిమాను చాలా సింపుల్ గా మూడు భాషల్లో విడుదల చేశారు. అసలు ఈ గార్గి సినిమా కథ ఏంటి? సాయి పల్లవి ఎలా నటించింది. విరాట పర్వం తర్వాత మళ్లీ ప్రధాన పాత్రలో నటించిన సాయి పల్లవి తన పాత్రకు న్యాయం చేసిందా లేదా? తెలియాలంటే సినిమా కథలోకి వెళ్లాల్సిందే.
సినిమా కథ ఏంటంటే.. సాయి పల్లవి(గార్గి) ఒక సాధారణ స్కూల్ టీచర్. తన తండ్రి బ్రహ్మానందం(ఆర్ఎస్ శివాజీ) ఒక అపార్ట్ మెంట్ లో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తుంటాడు. ప్రతి రోజు రాత్రి కాగానే ఇంటికి వచ్చే తన తండ్రి ఒక రోజు ఇంటికి రాకపోవడంతో అపార్ట్ మెంట్ కు వెళ్తుంది గార్గి. కానీ.. అక్కడ పరిస్థితులు వేరుగా ఉంటాయి. బాలికపై అత్యాచారం చేశాడనే నెపంతో తన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఈ విషయం తెలిసి గార్గి షాక్ అవుతుంది. నిజానికి ఎవరో కొందరు వ్యక్తులు తొమ్మిదేళ్ల బాలికపై అపార్ట్ మెంట్ లో అత్యాచారం చేస్తారు. కానీ.. బ్రహ్మానందం మీద అనుమానంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. దీంతో తన తండ్రిని విడిపించుకునేందుకు న్యాయ పోరాటానికి దిగుతుంది గార్గి. తనకు లాయర్ గిరీషం(కాళి వెంకట్ ) సాయం చేస్తాడు. తన తండ్రి నిర్దోషిగా విడుదల అవుతాడా? అసలు తన తండ్రి నిజంగా తప్పు చేయలేదా? చివర్లో వచ్చే ట్విస్ట్ ఏంటో తెలియాలంటే సినిమాను వెండి తెర మీద చూడాల్సిందే.
ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య మహిళలపై వేధింపులు. దాన్నే ప్రధాన అంశంగా తీసుకొని డైరెక్టర్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇప్పటికే విరాట పర్వంతో తనేంటో నిరుపించుకుంది సాయి పల్లవి. తను ప్రధాన పాత్రలో సినిమా వస్తుందంటే.. ఆ సినిమాను మొత్తం సాయి పల్లవే మోయాల్సి ఉంటుంది. ఈ సినిమాలోనూ అదే జరిగింది. తన తండ్రిని కాపాడుకునేందుకు సాయి పల్లవి పడిన పాట్లు, న్యాయం కోసం తను పోరాడిన తీరును దర్శకుడు బాగా మలిచాడు. చాలా చిన్న కథే కానీ.. కథను అర్థం చేసుకుంటే దానిలోని సందేశం చాలా పెద్దది. గార్గి పాత్రలో సాయి పల్లవి ఒదిగిపోయింది. ఆ తర్వాత లాయర్ పాత్రలో కాళి వెంకట్.. సాయి పల్లవి తండ్రిగా నటించిన శివాజీ, జడ్జి పాత్రలో ట్రాన్స్ జెండర్, ఇతర పాత్రలు కూడా బాగా నటించారు.
Sai Pallavi Gargi Review : సినిమా పేరు : గార్గి
నటీనటులు : సాయి పల్లవి, ఆర్ ఎస్ శివాజీ, కాళి వెంకట్, ఐశ్వర్యలక్ష్మి తదితరులు
డైరెక్టర్ : గౌతమ్ రామచంద్రన్
సంగీతం : గోవింద్ వసంత్
సినిమాటోగ్రఫీ : ప్రేమ్ కృష్ణ
సమర్పణ(తెలుగు) : రానా దగ్గుబాటి
నిర్మాతలు : రవిచంద్రన్, రామచంద్రన్, థామస్ జార్జ్, గౌతమ్ రామచంద్రన్, ఐశ్వర్య లక్ష్మి
రన్నింగ్ టైమ్ : 2 గంటల 17 నిమిషాలు
చివరగా ఈ సినిమా ఒక ఎమోషనల్ డ్రామా అనుకోవచ్చు. రొడ్డు కొట్టుడు సినిమాలు కాకుండా.. కొత్త కంటెంట్ కావాలనుకునే వాళ్లు.. సింపుల్ గా .. నాచురల్ గా సినిమాను ఎంజాయ్ చేయాలనుకునే వాళ్లు ఈ సినిమాను ఏంచక్కా ఎంజాయ్ చేయొచ్చు.
ది తెలుగు న్యూస్ రేటింగ్ : 3.25/5
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.