
Health Benefits best body pain killer Poppy Seeds
Health Benefits : గసగసాలు ప్రతి వంటింట్లో ఉంటాయి. భారతీయుల వంటల్లో ఉపయోగించే దినుసుల్లో గసగసాలు కూడా ఒకటి. ఇవి ఆవాలు కంటే చిన్నగా తిన్నపుడు కాస్త తీపి, కాస్త వగరు కలిసిన రుచితో ఉంటాయి. వీటికి చలువ చేసే గుణం ఎక్కువ. పాయసాలు, ఇతర తీపి వంటకాలలోనే కాకుండా, మసాలా కూరల్లో కూడా గసాగసాలను రుచి కోసం ఉపయోగిస్తారు. స్వీట్లు, సంప్రదాయ వంటల్లోనే కాకుండా, ఖరీదైన వంటల్లో వీటి వాడకం ఎక్కువ. గసాగసాలను మిక్సీ వేసి పేస్ట్ లా చేసి దాన్ని పిండి పాలు తీసి ఉపయోగించవచ్చు. ఇవి చూడటానికి గోధుమ పాలలా ఉంటాయి. తీపి రుచిని కలిగి ఉంటాయి. గసాలను పాయసంలా వండుకుని తీసుకోవచ్చు.
శరీరంలో అధిక వేడి ఉంటే చలువ చేయడానికి గసగసాలు బాగా పనిచేస్తాయి. ఎలాగంటే 10 గ్రాముల గసగసాలు కొన్ని నీళ్లు పోసి మెత్తగా నూరి ఇందులోకి పటిక బెల్లం కలిపి రోజు తింటుంటే ఉష్ణము తగ్గిపోతుంది. తలలో చుండ్రు పోయి వెంట్రుకలు ఆరోగ్యంగా పెరగాలంటే గసగసాలను నీళ్ళల్లో నానబెట్టి మెత్తగా రుబ్బి తలకు బాగా పట్టించి ఆరిన తర్వాత కుంకుడు కాయ రసం తో స్నానం చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల చుట్టూ తగ్గిపోయి వెంట్రుకలు ఆరోగ్యంగా పెరుగుతాయి.అంగ స్తంభనకు కూడా గసగసాలు బాగా పనిచేస్తాయి. 10 గ్రాముల గసగసాలను తీసుకుని కొన్ని నీళ్లు పోసి మెత్తగా నూరి అందులోకి అర కప్పు పాలు కలపాలి. ఇందులోకి 20 గ్రాముల పటిక బెల్లం పొడి కలిపి రోజుకు రెండు పూటలా తాగుతూ ఉంటే అంగ స్తంభన కలుగుతుంది.
Health Benefits best body pain killer Poppy Seeds
గర్భిణీలకు వచ్చే రక్త జిగట విరేచనాలు తగ్గిపోవడానికి గసగసాలు వాడొచ్చు. 10 గ్రాములు గసగసాలు, 20 గ్రాముల పటిక బెల్లం పొడి కలిపి మెత్తగా నూరి నిల్వ ఉంచుకోవాలి. ఈ మిశ్రమాన్ని 5 గ్రాముల మోతాదులో 20 గ్రాములు వెన్న కలుపుకొని రోజుకు రెండు పూటల తింటుంటే రక్త జిగట విరేచనాలు తగ్గిపోతాయి. నిద్ర లేమి సమస్యకు కూడా గసగసాల వాసన చూస్తే మంచిగా నిద్రపడుతుంది.గసాలు పాలు పోసి కూర వండుకుని తినచ్చు. పచ్చివి నోట్లో వేసుకుని నమలచ్చు. దోరగా వేయించి డ్రై ఫ్రూట్స్ లడ్డు, డ్రై ఫ్రూట్స్ బార్ లాంటి వాటితో జతచేయవచ్చు.
కూరలకు వేసే మసాలా పేస్ట్ లో వేసి గ్రైండ్ చేసి కూర వండితే ఆ కూర రుచి కమ్మగా ఉంటుంది. కొందరిలో దెబ్బ తగలగానే రక్తం ఆగకుండా ప్రవహిస్తూనే ఉంటుంది. అలాంటపుడు వాళ్ళు చాలా రక్తం కోల్పోతారు. గసగసాలు తీసుకుంటే ఇలా గాయాలు తగిలినపుడు రక్తం గడ్డకట్టే ప్రక్రియను అక్టీవ్ చేస్తుంది.గసగసాలలో ఉండే ప్రోటీన్ శరీరంలో కణాలు, మరియు కనజాలాలను నిర్మించడానికి మరియు దెబ్బ తిన్న కణజాలాన్ని మరమ్మత్తు చేయడానికి సహాయపడుతుంది. శరీరంలో ద్రవాలు సమతాస్థితిలో ఉండేందుకు గసాలు తోడ్పడతాయి. దీనివల్ల శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. కణాలు కణజాలాల ఉత్పత్తిలో ప్రముఖ పాత్ర వహించడం వల్ల ఇవి రోగనిరోధక శక్తికి శరీరం బాగా స్పందించేలా చేస్తాయి. దీనివల్ల జబ్బులకు శరీరం దెబ్బ తినకుండా ఉంటుంది.
గసగసాలలో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్. కాబట్టి వీటిని తీసుకుంటే కంటి చూపు మెరుగవుతుంది. గసగసాలలో బోలెడు ప్రోటీన్లు, మరియు విటమిన్ సి ఉండటం వల్ల హార్మోన్ల పనితీరు మెరుగుపడుతుంది. ఇందులోని విటమిన్ సి రోగనిరోధక శక్తి ఎంజైమ్ లను ఉత్పత్తి చేస్తుంది. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని తగ్గిస్తుంది. జీర్ణాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఈ ఫైబర్ సహాయపడుతుంది.ఇది రక్తంలో గ్లూకోజ్ లేదా చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా ముఖ్యం. గసగసాలలో కాల్షియం అధికంగా ఉంటుంది, ఇది శరీరంలో ఎముకలు మరియు దంతాలను బలంగా మార్చడానికి సహాయపడుతుంది. మెదడు నుండి శరీరంలోని ఇతర భాగాలకు నరాల ద్వారా సందేశాలను తీసుకెళ్లడంలో సహాయపడుతుంది.
NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
This website uses cookies.