Health Benefits : ఈ మధ్య అనారోగ్య సమస్యలు సర్వ సాధారణం అయిపోయాయి. చిన్న వారి నుంచి పెద్దవాళ్ల వరకు ఏదో ఒక సమస్య వేధిస్తోంది. జీవన శైలి మార్పులు, ఆహార మార్పులతో అనారోగ్య సమస్యలు దరిచేరుతున్నాయి. మధుమేహం-డయాబెటిస్, ఊబకాయం, థైరాయిడ్, గుండె సంబంధిత సమస్యలు వంటివి చాలా మందిని వేధిస్తున్నాయి. వీటికి ప్రధాన కారణం.. జీవన శైలి మార్పులు, ఆహార మార్పులేనని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి అనారోగ్య సమస్యల నుండి బయట పడేందుకు డాక్టర్లు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఆహార పదార్థాల్లో మార్పుల వల్ల చాలా వరకు ఆరోగ్య సమస్యలు దరి చేరవని అంటున్నారు. ఆహారంలో చేసే చిన్న చిన్న మార్పులే పెద్ద పెద్ద సమస్యలకు పరిష్కారాన్ని చూపుతాయి. కలోంజీ విత్తనాలు, వాము.. ఈ రెండు పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపించి కిడ్నీలను శుభ్రం చేసుకుంటూ అనేక రకాల వ్యాధుల నుండి మనల్ని మనం రక్షించుకోగలం. కలోంజి విత్తనాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
ముడి ఫైబర్స్, అమైనో ఆమ్లాలు, ఇనుము, సోడియం, కాల్షియం మరియు పొటాషియం యొక్క పవర్ హౌస్. విటమిన్-ఎ, విటమిన్-బి, విటమిన్-బి12, నియాసిన్ మరియు విటమిన్-సి వంటి విటమిన్లు కూడా కలోంజిలో ఎక్కువగా ఉన్నాయి. కలోంజి ఆయిల్ ఇతర నూనెల కంటే ఆరోగ్యంపై మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. కలోంజి విత్తనాల్లో శరీరానికి అవసరమైన కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు మరియు ఖనిజాలు ఉంటాయి. ఇది సుమారు 17% ప్రొటీన్, 26% కార్బోహైడ్రేట్లు మరియు 57% మొక్కల కొవ్వులు మరియు నూనెలను కలిగి ఉంటాయి.కలోంజి విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కలోంజి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఈ విత్తనాల్లో ఉండే పోషకాలు, ఇతర విటమిన్లు క్యాన్సర్ కణాలపై సమర్థవంతంగా పోరాడతాయి. బాక్టీరియాను నాశనం చేయడంలో ఇవి ఎంతగానో సాయపడతాయి. కడుపులో వచ్చే మంటను కలోంజి విత్తనాలు తగ్గిస్తాయి. కాలేయాన్ని రక్షించడంలోనూ ఇవి ఎంతో ఉపకరిస్తాయి.
రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంచడానికి కలోంజి సమర్థంగా పని చేస్తాయి. గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గడానికి కూడా కలోంజి ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తుంది. శరీరంలో వచ్చే ఇన్ఫెక్షన్లతో వాము చాలా బాగా పోరాడుతుంది. వృద్ధాప్యానికి కారణమయ్యే మరియు వ్యాధులకు దారి తీసే ఫ్రీ రాడికల్స్ ను వాము తొలగిస్తుంది. వాములో అతి తక్కువ స్థాయిలో కొలెస్ట్రాల్ ఉంటుంది. వాము తరచూ తీసుకోవడం వల్ల నొప్పి తగ్గుతుంది. రక్తపోటును తగ్గించడంలోనూ వాము ఎంతో ఉపయోగపడుతుంది. వాము వల్ల జీర్ణ క్రియ మెరుగ్గా పనిచేస్తుంది. రోజు వారీ ఆహారంలో వాము, కలోంజి కలిపి తీసుకోవచ్చు. లేదా నీటిలో కలుపుకొని తాగొచ్చు. ఇలా తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు దరి చేరవు. ప్రతి రోజూ రాత్రి ఒక గ్లాసు నీటిలో కలోంజి విత్తనాలు, వాము వేసి నాన బెట్టి మరుసటి రోజు ఉదయాన్నే ఈ నీటిని తాగాలి. లేదా చపాతీ పిండిలో ఇలా వేసుకుని కలుపుకుని తినడం ద్వారా వీటి యొక్క ఫలితాలను పొందవచ్చు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.