Health Benefits : ఆ రెండు తింటే చాలు.. రాత్రికి రాత్రే మోకాళ్ల నొప్పులు మాయం! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Benefits : ఆ రెండు తింటే చాలు.. రాత్రికి రాత్రే మోకాళ్ల నొప్పులు మాయం!

 Authored By pavan | The Telugu News | Updated on :5 March 2022,3:30 pm

Health Benefits : ఈ మధ్య అనారోగ్య సమస్యలు సర్వ సాధారణం అయిపోయాయి. చిన్న వారి నుంచి పెద్దవాళ్ల వరకు ఏదో ఒక సమస్య వేధిస్తోంది. జీవన శైలి మార్పులు, ఆహార మార్పులతో అనారోగ్య సమస్యలు దరిచేరుతున్నాయి. మధుమేహం-డయాబెటిస్‌, ఊబకాయం, థైరాయిడ్, గుండె సంబంధిత సమస్యలు వంటివి చాలా మందిని వేధిస్తున్నాయి. వీటికి ప్రధాన కారణం.. జీవన శైలి మార్పులు, ఆహార మార్పులేనని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి అనారోగ్య సమస్యల నుండి బయట పడేందుకు డాక్టర్లు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఆహార పదార్థాల్లో మార్పుల వల్ల చాలా వరకు ఆరోగ్య సమస్యలు దరి చేరవని అంటున్నారు. ఆహారంలో చేసే చిన్న చిన్న మార్పులే పెద్ద పెద్ద సమస్యలకు పరిష్కారాన్ని చూపుతాయి. కలోంజీ విత్తనాలు, వాము.. ఈ రెండు పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపించి కిడ్నీలను శుభ్రం చేసుకుంటూ అనేక రకాల వ్యాధుల నుండి మనల్ని మనం రక్షించుకోగలం. కలోంజి విత్తనాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

ముడి ఫైబర్స్, అమైనో ఆమ్లాలు, ఇనుము, సోడియం, కాల్షియం మరియు పొటాషియం యొక్క పవర్ హౌస్. విటమిన్-ఎ, విటమిన్-బి, విటమిన్-బి12, నియాసిన్ మరియు విటమిన్-సి వంటి విటమిన్లు కూడా కలోంజిలో ఎక్కువగా ఉన్నాయి. కలోంజి ఆయిల్ ఇతర నూనెల కంటే ఆరోగ్యంపై మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. కలోంజి విత్తనాల్లో శరీరానికి అవసరమైన కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు మరియు ఖనిజాలు ఉంటాయి. ఇది సుమారు 17% ప్రొటీన్, 26% కార్బోహైడ్రేట్లు మరియు 57% మొక్కల కొవ్వులు మరియు నూనెలను కలిగి ఉంటాయి.కలోంజి విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కలోంజి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఈ విత్తనాల్లో ఉండే పోషకాలు, ఇతర విటమిన్లు క్యాన్సర్‌ కణాలపై సమర్థవంతంగా పోరాడతాయి. బాక్టీరియాను నాశనం చేయడంలో ఇవి ఎంతగానో సాయపడతాయి. కడుపులో వచ్చే మంటను కలోంజి విత్తనాలు తగ్గిస్తాయి. కాలేయాన్ని రక్షించడంలోనూ ఇవి ఎంతో ఉపకరిస్తాయి.

how to reduce body pains naturally

how to reduce body pains naturally

రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంచడానికి కలోంజి సమర్థంగా పని చేస్తాయి. గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గడానికి కూడా కలోంజి ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తుంది. శరీరంలో వచ్చే ఇన్ఫెక్షన్లతో వాము చాలా బాగా పోరాడుతుంది. వృద్ధాప్యానికి కారణమయ్యే మరియు వ్యాధులకు దారి తీసే ఫ్రీ రాడికల్స్‌ ను వాము తొలగిస్తుంది. వాములో అతి తక్కువ స్థాయిలో కొలెస్ట్రాల్‌ ఉంటుంది. వాము తరచూ తీసుకోవడం వల్ల నొప్పి తగ్గుతుంది. రక్తపోటును తగ్గించడంలోనూ వాము ఎంతో ఉపయోగపడుతుంది. వాము వల్ల జీర్ణ క్రియ మెరుగ్గా పనిచేస్తుంది. రోజు వారీ ఆహారంలో వాము, కలోంజి కలిపి తీసుకోవచ్చు. లేదా నీటిలో కలుపుకొని తాగొచ్చు. ఇలా తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు దరి చేరవు. ప్రతి రోజూ రాత్రి ఒక గ్లాసు నీటిలో కలోంజి విత్తనాలు, వాము వేసి నాన బెట్టి మరుసటి రోజు ఉదయాన్నే ఈ నీటిని తాగాలి. లేదా చపాతీ పిండిలో ఇలా వేసుకుని కలుపుకుని తినడం ద్వారా వీటి యొక్క ఫలితాలను పొందవచ్చు.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది