Health Benefits : పారిజాతం చాలా విరివిగా కనిపించే మొక్క. చాలా మంది ఇళ్లలో పారిజాత మొక్క ఉంటుంది. రాత్రుళ్లు విరబూసే ఈ పూలను శివునికి, లక్ష్మీ దేవికి పెట్టి పూజిస్తారు. వారికి ఈ పారిజాత పూలు ఎంతో ప్రీతికరమైనవని భావిస్తారు. పారిజాత వృక్షం ఆయుర్వేదంలో దివ్య ఔషధంగా పరిగణిస్తారు. పారిజాత మొక్కతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి… పారిజాత మొక్క ఆకులను ఆరు తీసుకుని శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ నీటిలో వేసి మరిగించి ఉదయం, సాయంత్రం 50 మిల్లీ లీటర్ల చొప్పున తీసుకుంటే కండరాల నొప్పి, నడుము నొప్పి, పిక్కలు పట్టుకోవడం లాంటి సమస్యలు తగ్గుతాయి.ఎండిన పారిజాత ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని ఉదయం, సాయంత్రం తాగడం వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేదంలో ఉంది…
ఈ నీటిని తీసుకోవడం వల్ల గాస్త్రిక్, అల్సర్ వంటి సమస్యలు తగ్గుతాయి. నాలుగు నుంచి ఐదు తిప్పతీగ ఆకులను, ఆరు పారిజాత ఆకులను గ్లాస్ నీటిలో వేసి పది నిమిషాల పాటు మరిగించి ఆ నీటిని తీసుకోవడం వలన అన్ని రకాల క్యాన్సర్ నుంచి కాపాడుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ఇలా మూడు నుంచి ఆరు నెలల పాటు తీసుకుంటే క్యాన్సర్ నుండి కాపాడుతుంది. పారిజాత గోళీలు మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయి… తిప్పతీగ, పారిజాత మొక్క ఆకుల మిశ్రమాన్ని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తీసుకోవడం వల్ల ఇన్సులిన్ తీసుకునే స్టేజ్‌లో ఉన్న షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. పారి జాత ఆకుల రసం తీసుకోవడం వలన షుగర్, బీపీ కంట్రోల్‌లోకి వస్తాయి. దీంతో పాటు ఆహార నియమాలు కూడా పాటించినట్లయితే మూడు నెలల్లో షుగర్ తగ్గుతుంది.
పారిజాత పువ్వులను దంచి రసం తీసి రసం చెవిలో ఒక చుక్క చొప్పున వేసుకోవడం వల్ల వినికిడి సమస్యలు తొలగిపోతాయి. చెవి పోటు వంటి ఇబ్బందులు దరికి చేరవు. పారిజాతం ఆకుల కషాయాన్ని చేసుకొని తాగడం వల్ల కాళ్ళు పట్టుకోవడం, కాళ్ల నొప్పి, నడుము నొప్పి, ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి… తరచూ జ్వరం వచ్చే వాళ్ళు ఈ కషాయాన్ని తీసుకుంటే జ్వరం ఇట్టే తగ్గి పోతుంది. పారి జాత ఆకుల కషాయం అజీర్తి, గ్యాస్ట్రిక్ సమస్యలను కూడా తగ్గిస్తుంది. మల బద్ధకం సమస్య ఉన్న వారు పారిజాత ఆకుల కషాయాన్ని తీసుకోవడం వల్ల సమస్య తీరుతుంది. అందుకే పారిజాత ఆకులను ఆయుర్వేదంలో దివ్యౌషధంగా పిలుస్తారు. ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. మీరు కూడా పారిజాతం వృక్షం ప్రయోజనాలు తెలుసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
Legs Arms : సూర్యకాంతి విటమిన్ డీ కి ముఖ్య మూలం అని చెప్పొచ్చు. అయితే విటమిన్ డీ లోపం ఉన్నవారు…
Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే మనకు ఠక్కున గుర్తిచ్చే పేరు ప్రభాస్. మనోడు పెళ్లి విషయాన్ని…
Tea : మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. అలాగే కేవలం టీ మాత్రమే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం…
NIRDPR Notification 2024 : నేషన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి రంగంలో…
Utthana Ekadashi : హిందూమతంలో కార్తీక మాసానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ నెల మొత్తం కూడా ఏకాదశి…
Telangana Cabinet : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తుంది. అయితే ఇంత వరకూ ఖాళీగా ఉన్న ఆరు…
Telangana : తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే…
This website uses cookies.