
Health Benefits how to stop leg cramps Sorakaya Massage
Health Benefits : సాధారణంగా తిమ్మిర్లు వస్తే కదలలేం. నరాలు పట్టేసినట్లు ఉండి జివ్వుమంటాయి. అయితే ఎక్కువసేపు కదలకుండా కూర్చుంటే కాళ్లు, చేతులు తిమ్మిర్లు వస్తాయి. నాలుగడుగులు అటూ ఇటూ నడిస్తే గానీ తిమ్మిరి పట్టిన కాళ్లు మామూలు స్థితిలోకి రావు. అరికాళ్లు, అరచేతుల్లో తిమ్మిర్లు సర్వసాధారణం. కానీ అవే తిమ్మిర్లు వారాల తరబడి వేధిస్తే మాత్రం నిర్లక్ష్యం చేయోద్దు. తిమ్మిర్లను శరీరంలోని పలు వ్యాధులకు సంకేతాలుగా భావించాలి. తిమ్మిర్లే కదా అని నిర్లక్ష్యం చేస్తే తిరిగి కోలుకోలేనంతగా నరాలు దెబ్బతింటాయని నిపుణులు చెబుతున్నారు.నరాలు ఎక్కువగా ఒత్తిడికి గురయినప్పుడు బహిర్గతమయ్యే లక్షణమే తిమ్మిర్లు.
దీన్ని మొద్దుబారటం అని కూడా కొందరు అంటారు. ఒకే యాంగిల్‌లో ఎక్కువసేపు కూర్చున్నప్పుడు కాళ్లలో తిమ్మిర్లు రావటం సహజం. సూదులతో గుచ్చినట్టుండే ఇలాంటి తిమ్మిర్లు, మంటలు పాజిటివ్ రకానికి చెందినవి. ఇవి వెంటనే తగ్గిపోతాయి. నెగిటివ్ తిమ్మిర్లలో క్రమంగా స్పర్శ తగ్గిపోవటం, నొప్పి ఉండటం, అవయవాలు బలహీనపడటం వంటివి జరుగుతాయి. ఇలాంటివి ఎక్కువగా జరిగితే న్యూరోలాజికల్ సమస్యగా గుర్తించాలి.డయాబెటీస్ రోగుల్లో ఎక్కువగా తిమ్మిర్లు ఏర్పడుతుంటాయి. నిత్యం వీరు అరికాళ్ల మంటలతో బాధపడతారు. సూదులతో గుచ్చుతున్నట్లు అనిపిస్తుంది.
Health Benefits how to stop leg cramps Sorakaya Massage
అలాగే థైరాయిడ్, క్షయ వ్యాధితో బాధపడుతున్నావారిలో ఎక్కువగా తిమ్మిర్లు వస్తాయి. సాధారణంగా తిమ్మిర్లు వాటంతట అవే తగ్గిపోతుంటాయి. రెగ్యూలర్ గా వ్యాయామం, తగినంత విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. అలాగే సహజ పద్దతుల్లో అరికాళ్లు, చేతుల మంటను తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం…సోరకాయను సర్కిల్ లాగా కట్ చేసుకుని చిన్న చిన్న గాట్లు పెట్టాలి. ఈ ముక్కలను అరికాళ్లు, అరిచేతులపై మసాజ్ చేసుకోవాలి. దీంతో నొప్పితగ్గి హాయిగా నిద్రపడుతుంది. అలాగే దనియాలు పటిక బెల్లం పొడి చేసుకోవాలి. ఈ పొడిని పరిగడుపున ఓ స్పూన్ తీసుకున బాగానమిలి మింగాలి. అరగంట వరకు వాటర్ తాగకూడదు. ఇలా రెగ్యూలర్ గా చేస్తే ఫలితం ఉంటుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.