Health Benefits : న‌ల‌బై ఏళ్లు దాటాయా.. అయితే మ‌హిళ‌లు ఇవి పాటించాల్సిందే.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : న‌ల‌బై ఏళ్లు దాటాయా.. అయితే మ‌హిళ‌లు ఇవి పాటించాల్సిందే..

Health Benefits : 40 ఏళ్ల తర్వాత స్త్రీల శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. కండరాలు పటుత్వం కోల్పోతాయి. హార్మోన్లు అసమతుల్యతగా ఉంటాయి. కొంతమంది మహిళలు విపరీతంగా బరువు పెరుగుతారు. అనేక వ్యాధులు చుట్టుముడుతాయి. వీటిలో అధిక రక్తపోటు, థైరాయిడ్, మధుమేహం, ఊబకాయం, మానసిక సమస్యలు మొదలైనవి. మహిళలు ఆరోగ్యంగా ఉండటానికి అన్ని పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. మంచి ఆహారం, నిద్ర, ఒత్తిడి లేని జీవితంతో పాటు, రోజూ కొన్ని వ్యాయామాలు చేయాలి. కొన్ని ఆహార చిట్కాలు […]

 Authored By mallesh | The Telugu News | Updated on :1 April 2022,7:00 am

Health Benefits : 40 ఏళ్ల తర్వాత స్త్రీల శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. కండరాలు పటుత్వం కోల్పోతాయి. హార్మోన్లు అసమతుల్యతగా ఉంటాయి. కొంతమంది మహిళలు విపరీతంగా బరువు పెరుగుతారు. అనేక వ్యాధులు చుట్టుముడుతాయి. వీటిలో అధిక రక్తపోటు, థైరాయిడ్, మధుమేహం, ఊబకాయం, మానసిక సమస్యలు మొదలైనవి. మహిళలు ఆరోగ్యంగా ఉండటానికి అన్ని పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. మంచి ఆహారం, నిద్ర, ఒత్తిడి లేని జీవితంతో పాటు, రోజూ కొన్ని వ్యాయామాలు చేయాలి. కొన్ని ఆహార చిట్కాలు ఇప్పుడు చూద్దాం..యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు కలిగి ఉన్న వెల్లుల్లిని తీసుకోవడం వల్ల 40 ఏళ్ల తర్వాత మహిళల్లో బోలు ఎముకల వ్యాధి సమస్య పెరుగుతుంది. దీని బారి నుంచి వెల్లుల్లి కాపాడుతుంది.

అంతేకాకుండా వెల్లుల్లిలో అల్లిసిన్ అనే మూలకం ఉంటుంది. ఇది బ్రెస్ట్ క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడుతుంది. అలాగే ఐరన్, జింక్, విటమిన్ కె, లుటిన్, ఫోలేట్, కాల్షియం, బీటా కెరోటిన్ వంటి అవసరమైన పోషకాలను గ్రీన్ వెజిటేబుల్స్ అందిస్తాయి. ఇవి మీ శరీరంలో రక్తాన్ని పెంచుతాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. కంటి చూపును మెరుగుపరుస్తాయి. ఎముకలను బలోపేతం చేస్తాయి.మహిళలకు డార్క్ చాక్లెట్లు తిన‌డం వ‌ల్ల ఇందులోని ఫ్లేవనాయిడ్స్ గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు నుంచి రక్షిస్తాయి. గుడ్లలో విటమిన్ డి ఉంటుంది కాబట్టి మహిళలు గుడ్లు తప్పనిసరిగా తినాలి. ఇది కాకుండా గుడ్డు మంచి కొవ్వు, ప్రోటీన్లకు మూలం.

Health Benefits in women at 40 after Healthy Foods

Health Benefits in women at 40 after Healthy Foods

Health Benefits : రోగ‌నిరోధ‌క శ‌క్తి పెంచుకోవాలె..

రోజువారీ ఆహారంలో కనీసం 1 నుంచి 2 గుడ్లు చేర్చుకుంటే మంచిది. అలాగే అన్ని రకాల సిట్రస్ పండ్లను తీసుకోవడం వల్ల శరీరానికి విటమిన్ సి లభిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అద్భుతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది గుండె జబ్బులు, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.శరీరానికి అత్యంత ముఖ్యమైన ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు చియా సీడ్స్ లో పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా మెగ్నీషియం, కాల్షియం సమృద్ధిగా ఉండడం వల్ల వీటిని తీసుకుంటే ఎముకలు బలంగా తయారవుతాయి. చియా గింజలను రాత్రి నానబెట్టి, ఉదయం స్మూతీల రూపంలో అల్పాహారంగా తీసుకుంటే చాలా ప్రయోజనాలు క‌లుగుతాయి. అల్పాహారంగా కాల్షియం అధికంగా ఉండే పెరుగును కూడా ఆహారంలో భాగంగా చేసుకోవాలి.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది