
mumaith khan re entry into bigg boss house
Mumaith Khan : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగులో ఐదు సీజన్లు సూపర్ డూపర్ హిట్ అవడంతో బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌పై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఇది ఆరంభం నుంచే ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. మరీ ముఖ్యంగా డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు, బోల్డు బ్యూటీల రచ్చతో సందడిగా నడుస్తోంది. ఫలితంగా ఈ సీజన్ రోజురోజుకూ రసవత్తరంగా మారుతూ సాగిపోతోంది. నాన్ స్టాప్ సీజన్‌లోకి అషు రెడ్డి, మహేశ్ విట్టా, ముమైత్ ఖాన్, అజయ్ కుమార్, స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతూ, ఆరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, శ్రీ రాపాక, అనిల్ రాథోడ్, మిశ్రా శర్మ, తేజస్వీ మదివాడ, యాంకర్ శివ, సరయు రాయ్, బిందు మాధవి, హమీదా ఖతూన్, అఖిల్ సార్థక్‌లు ఎంట్రీ ఇచ్చారు.
వీరిలో నుంచి ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతూ, సరయులు ఎలిమినేట్ అయిపోయారు.బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి ఫలానా సెలెబ్రిటీ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగానే చాలా మంది ప్రముఖుల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. మరీ ముఖ్యంగా గత సీజన్లలో పాల్గొన్న కంటెస్టెంట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీంతో అందరిలోనూ ఆసక్తి పెరుగుతూనే ఉంది. ముమైత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సర్‌ప్రైజ్ అంటూ ఓ పోస్ట్ చేయడంతో అందరు ఆమె రీఎంట్రీ ఇస్తుందని అనుకున్నారు.
mumaith khan re entry into bigg boss house
అన్నట్టుగానే ముమైత్ రీఎంట్రీ ఇచ్చి షాకిచ్చింది.స్టైలిష్ ఎంట్రీ ఇచ్చిన ముమైత్ కోర్టు టాస్క్‌లో భాగంగా జడ్జీగా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది. అఖిల్-బిందు మాధవిల మధ్య విడాకులు ఇష్యూ అంటూ ఏదో డ్రామా క్రియేట్ చేసి ఇద్దరి మధ్య ఫిటింగ్ పెట్టింది ముమైత్. ఈ డ్రామాలో యాంకర్ శివని వకీల్‌గా మార్చేశారు బిగ్ బాస్. మొత్తానికి ముమైత్ ఎంట్రీ ఆసక్తికరంగా మారింది. ఇక హౌజ్ మళ్లీ రణరంగంగా మారడం ఖాయం అని అంటున్నారు. అయితే ముమైత్‌కి బిగ్ బాస్ హౌజ్ అత్తారిల్లు అయిపోయిందిగా అంటూ కొందరు కామెంట్స్ పెడుతున్నారు.
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
This website uses cookies.