Amla Juice : ప్రతిరోజు ఉసిరి రసం తాగటం వలన కలిగే లాభాలు అన్ని ఇన్ని కావు...!
Amla Juice : ప్రస్తుత కాలంలో ఎన్నో రకాల సమస్యలతో మనం ఇబ్బంది పడుతున్నాం. అలాగే శరీరంలో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటే ఎన్నో సమస్యలు వస్తాయి. అందుకే ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఉసిరి జ్యూస్ తాగితే ఈ సమస్య నుండి బయట పడవచ్చు అని నిపుణులు అంటున్నారు. అయితే ఈ ఉసిరిలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వలన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఈ ఉసిరిలో యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణం అనేది శరీరంలోని వాపులను కూడా నియంత్రిస్తుంది. అలాగే కీళ్ల నొప్పులను కూడా నయం చేస్తుంది. అలాగే ఇది గ్యాస్ట్రిక్ లాంటి రసాయనాలను కూడా ప్రేరేపిస్తుంది. అంతేకాక పోషకాల శోషణను ప్రేరేపిస్తుంది మరియు జీర్ణ సమస్యలను కూడా నియంత్రిస్తుంది. ఈ ఉసిరిలో విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉండడం వలన జీవక్రియను ఎంతో మెరుగుపరుస్తుంది. అలాగే బరువును నియంత్రణలో ఉంచడంలో కూడా హెల్ప్ చేస్తుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను సమతుల్యం చేయటంలో కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. అలాగే ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది…
ఈ ఉసిరి అనేది ఒక నిర్వీషీ కరణ ఏజెంట్ గా కూడా పనిచేస్తుంది. అలాగే మెరుగైన ఆరోగ్యానికి టాక్సిన్స్ ను బయటకు పంపిస్తుంది. అంతే కాక ఇది కొల్లజెన్ ఉత్పత్తిని కూడా ప్రోత్సహిస్తుంది. అలాగే UV నష్టం నుండి కూడా కాపాడుతుంది. ఇది చర్మా ఆరోగ్యం కూడా ఎంతో మెరుగుపరుస్తుంది. ఈ ఉసిరిలో ఉండే పోషక గుణాలు వెంట్రుకల కుదుళ్లను ఎంతో బలంగా చేస్తుంది. అలాగే జుట్టు రాలడానికి కూడా తగ్గిస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా ఎంతగానో మేలు చేస్తుంది. అంతేకాక కొలెస్ట్రాల్ ను తగ్గించడం వలన గుండె ఆరోగ్యం బాగుంటుంది. అలాగే అధిక రక్త పోటు రాకుండా కూడా రక్షిస్తుంది. అంతేకాక రక్త ప్రసరణ కూడా ఎంతో మెరుగుపడుతుంది. దీనిలోయాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది గుండెపోటు మరియు స్ట్రోక్ లాంటి సమస్యలు రాకుండా కూడా చూస్తుంది…
Amla Juice : ప్రతిరోజు ఉసిరి రసం తాగటం వలన కలిగే లాభాలు అన్ని ఇన్ని కావు…!
ఉసిరి రసం తయారీ కోసం మీరు ముందుగా ఉసిరికాయలను గింజలు లేకుండా తీసుకోండి. తర్వాత వాటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలలో నీరు పోసి జ్యూస్ లా చేసుకోవాలి. తర్వాత దానిని వడకట్టుకోవాలి. లేదంటే డైరెక్ట్ గా అలాగైనా తాగొచ్చు. తర్వాత దీనిలో కొద్దిగా తేనె మరియు అల్లం, మిరియాల పొడి లేకుంటే ఉప్పు వేసి కలుపుకొని తాగాలి. ఇలా గనక మీరు రోజు తాగితే మంచి రిజల్ట్ వస్తుంది. అలాగే ఈ ఉసిరిని రోజు మితంగా తీసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ కొంతమందిలో మాత్రం జీర్ణ అసౌకర్యం మరియు అతిసారం లేక అలర్జీ లాంటి సమస్యలు కూడా వస్తాయి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కావున రోజువారి ఆహారంలో ఉసిరికాయను చేర్చుకోవాలి అని అనుకునేవారు వైద్యులను సంప్రదించిన తర్వాతే ఉసిరికాయను తీసుకోవటం మొదలుపెట్టండి…
RK Roja : ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్‌లా డైలాగులు చెప్పాడని, ఇప్పుడు మాత్రం రబ్బర్ లా…
Telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్యా రంగం పట్ల…
Wife : జోగుళాంబ గద్వాల జిల్లాలో నవ వరుడి హత్య ఘటన తెలంగాణలో సంచనలం సృష్టిస్తోంది. మృతుడి భార్య ఐశ్వర్య,…
Ration Cards : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పథకం అమలులో మరింత కట్టుదిట్టమైన చర్యలుచేపడుతుంది. ఇటీవల పౌరసరఫరాల శాఖ…
Guntur Sp : వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనలో.. సింగయ్య అనే వ్యక్తి…
Today Gold Price : బంగారం ధరలు దిగొస్తున్నాయి. ఈరోజు జూన్ 23న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర…
Black Alkaline : ఇక బ్లాక్ వాటర్ గురించి చెప్పాలంటే అంతా కాదు. దీని ప్రయోజనాలు అమోఘం. ఇటీవల కాలంలో…
Hemoglobin : శరీరానికి సరైన హిమోగ్లోబిన్ లేకపోతే ఆరోగ్యంగా ఉండలేరు. శరీరానికి గుండె ఎంత ముఖ్యమో శరీరంలో ప్రవహించే రక్తం…
This website uses cookies.