Amla Juice : ప్రతిరోజు ఉసిరి రసం తాగటం వలన కలిగే లాభాలు అన్ని ఇన్ని కావు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Amla Juice : ప్రతిరోజు ఉసిరి రసం తాగటం వలన కలిగే లాభాలు అన్ని ఇన్ని కావు…!

Amla Juice : ప్రస్తుత కాలంలో ఎన్నో రకాల సమస్యలతో మనం ఇబ్బంది పడుతున్నాం. అలాగే శరీరంలో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటే ఎన్నో సమస్యలు వస్తాయి. అందుకే ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఉసిరి జ్యూస్ తాగితే ఈ సమస్య నుండి బయట పడవచ్చు అని నిపుణులు అంటున్నారు. అయితే ఈ ఉసిరిలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వలన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఈ ఉసిరిలో యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణం అనేది శరీరంలోని […]

 Authored By ramu | The Telugu News | Updated on :24 September 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Amla Juice : ప్రతిరోజు ఉసిరి రసం తాగటం వలన కలిగే లాభాలు అన్ని ఇన్ని కావు...!

Amla Juice : ప్రస్తుత కాలంలో ఎన్నో రకాల సమస్యలతో మనం ఇబ్బంది పడుతున్నాం. అలాగే శరీరంలో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటే ఎన్నో సమస్యలు వస్తాయి. అందుకే ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఉసిరి జ్యూస్ తాగితే ఈ సమస్య నుండి బయట పడవచ్చు అని నిపుణులు అంటున్నారు. అయితే ఈ ఉసిరిలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వలన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఈ ఉసిరిలో యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణం అనేది శరీరంలోని వాపులను కూడా నియంత్రిస్తుంది. అలాగే కీళ్ల నొప్పులను కూడా నయం చేస్తుంది. అలాగే ఇది గ్యాస్ట్రిక్ లాంటి రసాయనాలను కూడా ప్రేరేపిస్తుంది. అంతేకాక పోషకాల శోషణను ప్రేరేపిస్తుంది మరియు జీర్ణ సమస్యలను కూడా నియంత్రిస్తుంది. ఈ ఉసిరిలో విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉండడం వలన జీవక్రియను ఎంతో మెరుగుపరుస్తుంది. అలాగే బరువును నియంత్రణలో ఉంచడంలో కూడా హెల్ప్ చేస్తుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను సమతుల్యం చేయటంలో కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. అలాగే ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది…

ఈ ఉసిరి అనేది ఒక నిర్వీషీ కరణ ఏజెంట్ గా కూడా పనిచేస్తుంది. అలాగే మెరుగైన ఆరోగ్యానికి టాక్సిన్స్ ను బయటకు పంపిస్తుంది. అంతే కాక ఇది కొల్లజెన్ ఉత్పత్తిని కూడా ప్రోత్సహిస్తుంది. అలాగే UV నష్టం నుండి కూడా కాపాడుతుంది. ఇది చర్మా ఆరోగ్యం కూడా ఎంతో మెరుగుపరుస్తుంది. ఈ ఉసిరిలో ఉండే పోషక గుణాలు వెంట్రుకల కుదుళ్లను ఎంతో బలంగా చేస్తుంది. అలాగే జుట్టు రాలడానికి కూడా తగ్గిస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా ఎంతగానో మేలు చేస్తుంది. అంతేకాక కొలెస్ట్రాల్ ను తగ్గించడం వలన గుండె ఆరోగ్యం బాగుంటుంది. అలాగే అధిక రక్త పోటు రాకుండా కూడా రక్షిస్తుంది. అంతేకాక రక్త ప్రసరణ కూడా ఎంతో మెరుగుపడుతుంది. దీనిలోయాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది గుండెపోటు మరియు స్ట్రోక్ లాంటి సమస్యలు రాకుండా కూడా చూస్తుంది…

Amla Juice ప్రతిరోజు ఉసిరి రసం తాగటం వలన కలిగే లాభాలు అన్ని ఇన్ని కావు

Amla Juice : ప్రతిరోజు ఉసిరి రసం తాగటం వలన కలిగే లాభాలు అన్ని ఇన్ని కావు…!

ఉసిరి రసం తయారీ కోసం మీరు ముందుగా ఉసిరికాయలను గింజలు లేకుండా తీసుకోండి. తర్వాత వాటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలలో నీరు పోసి జ్యూస్ లా చేసుకోవాలి. తర్వాత దానిని వడకట్టుకోవాలి. లేదంటే డైరెక్ట్ గా అలాగైనా తాగొచ్చు. తర్వాత దీనిలో కొద్దిగా తేనె మరియు అల్లం, మిరియాల పొడి లేకుంటే ఉప్పు వేసి కలుపుకొని తాగాలి. ఇలా గనక మీరు రోజు తాగితే మంచి రిజల్ట్ వస్తుంది. అలాగే ఈ ఉసిరిని రోజు మితంగా తీసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ కొంతమందిలో మాత్రం జీర్ణ అసౌకర్యం మరియు అతిసారం లేక అలర్జీ లాంటి సమస్యలు కూడా వస్తాయి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కావున రోజువారి ఆహారంలో ఉసిరికాయను చేర్చుకోవాలి అని అనుకునేవారు వైద్యులను సంప్రదించిన తర్వాతే ఉసిరికాయను తీసుకోవటం మొదలుపెట్టండి…

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది