Anjeer : ప్రతిరోజు పరిగడుపున అంజీర పండ్లను ఇలా తీసుకుంటే... ఎన్ని ప్రయోజనాలో...!!
Anjeer : ప్రస్తుత కాలంలో డయాబెటిస్ అనేది ఎంతో మందిని వేధిస్తుంది. ఈ సమస్య ఒక్కసారి వచ్చిందంటే జీవితాంతం బాధపడాల్సిందే. అందుకే దీనిని తగ్గించేందుకు రోజు అంజీర పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి అని నిపుణులు అంటున్నారు. అయితే రోజు రెండు అంజీర పండ్లను తినడం వలన బ్లడ్ షుగర్ అనేది అదుపులో ఉంటుంది అని అంటున్నారు. దీనితో పాటుగా క్యాన్సర్ మరియు గుండె సమస్యలు లాంటివి రాకుండా రక్షిస్తాయి అని పోషకాహార నిపుణులు అంటున్నారు. అయితే డయాబెటిస్ తో బాధపడేవారు ఈ అంజీర పండ్ల ను తినడం వలన ఎంతో మేలు జరుగుతుంది అని అంటున్నారు. అలాగే ఈ అంజీర పండ్లలో పొటాషియం పోషకాలు అధికంగా ఉన్నాయి. దీనిలో ఉండే క్లోరోజైనిక్ ఆమ్లం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో హెల్ప్ చేస్తాయి…
అంజీరా పండ్ల లో ఉండే యాంటీ యాక్సిడెంట్లు రక్తపోటు స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. అలాగే అత్తి పండ్లను తీసుకోవడం వలన శరీరంలో పెరిగినటువంటి ట్రైగ్లిజరైడ్ స్థాయిలో కూడా తగ్గుతాయి అని అంటున్నారు. అలాగే కరోనరీ ధమనులలో అడ్డంకులను కూడా నియంత్రిస్తుంది. దీంతో గుండె అనేది ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది అని అంటున్నారు. అలాగే వీటిని ప్రతిరోజు నిత్యం తీసుకోవడం వలన హార్మోన్ల అసమతుల్యత సమస్య అనేది తొలగిపోతుంది అని అంటున్నారు. ముఖ్యంగా మోనోపాజ్ టైంలో ఉన్న మహిళలు మరియు రుతుక్రమ సమస్యతో బాధపడే అమ్మాయిలు హార్మోన్ల అసమతుల్యత సమస్యల బారిన ఎక్కువగా పడుతూ ఉంటారు. కాబట్టి వీరంతా రోజు అంజీర పండ్లను తీసుకుంటే మంచిది అని అంటున్నారు…
Anjeer : ప్రతిరోజు పరిగడుపున అంజీర పండ్లను ఇలా తీసుకుంటే… ఎన్ని ప్రయోజనాలో…!!
రోజు రాత్రి పడుకునే ముందు రెండు అంజీర పండ్లను నాడబెట్టుకోవాలి. వీలైతే వాటిలో బాదం మరియు వాల్ నట్స్ కూడా వేసి నానబెట్టుకోవచ్చు. వీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వలన అద్భుతమైన ప్రయోజనాల పొందవచ్చు అని అంటున్నారు. అలాగే ఈ అంజీర పండ్లతో మలబద్దక సమస్యకు కూడా చెక్ పెట్టొచ్చు అని అంటున్నారు. అయితే మలబద్ధక సమస్యతో బాధపడే వారు రోజు రెండు నానబెట్టిన అంజీర పండ్లను ఖాళీ పరిగడుపున తీసుకోవాలి అని వైద్యులు సూచిస్తున్నారు. ఇది పేగు కదలికలను సరిచేసి మలబద్ధకం నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది అని అంటున్నారు. అలాగే పొట్ట ఆరోగ్యాన్ని కూడా రక్షిస్తుంది అని అంటున్నారు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
This website uses cookies.