Categories: Jobs EducationNews

Jobs : ఆవిష్క‌ర‌ణ ప‌రిశోధ‌న గ‌మ్య‌స్థానంగా తెలంగాణ‌.. జీసీసీ కేంద్రాల‌తో హైద‌రాబాద్‌లో ఉద్యోగావ‌కాశాలు..!

Advertisement
Advertisement

Jobs : గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల (GCCలు) గమ్యస్థానంగా భారతదేశం మారింది. వీటిని ఆకర్షించడానికి తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ ఇతోధికంగా రాయితీలు ప్రకటిస్తున్నాయి. భారత్‌లో 2010 సంవత్సరంలో 700 జీసీసీలు ఉండగా వాటిలో 4 లక్షల మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు పని చేశారు. అది 2023 నాటికి 1,600 జీసీసీలు ఏర్పాటవగా ఉద్యోగుల సంఖ్య 16.59 లక్షలకు చేరింది. ఇక 2028 నాటికి వీటి సంఖ్య 2,100కి చేరి 34 లక్షల మందికి ఉద్యోగాలు క‌ల్పించ‌నున్న‌ట్లు అంచనా. సాంప్ర‌దాయ ఐటీ సంస్థ‌ల్లో ఎంట్రీ లెవల్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు వార్షిక సగటు వేతనం రూ.5.7 లక్షలు అంద‌నుంది. మూడేండ్ల అనుభవముంటే రూ.11.7 లక్షలు. జీసీసీల్లో ఎంట్రీ లెవెల్‌లో ఏఐ, ఎంల్‌ ఇంజినీర్లకు రూ.8.20 లక్షల వరకు, మూడేళ్ల అనుభవముంటే రూ.21.8 లక్షలు అందుతుంది.

Advertisement

Jobs జీసీసీలు అంటే ?

అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలకు చెందిన అంతర్జాతీయ కార్పొరేట్‌ సంస్థలు తమ ప్రధాన కార్యాలయాలకు పొరుగు, ప్రాసెస్‌ సేవలను అందించేందుకు నైపుణ్యంతో పాటు, చవకగా మానవ వనరులు లభించే ఇతర దేశాల్లో ఏర్పాటు చేసుకునే ఉప కార్యాలయాలనే గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు(జీసీసీ)లుగా పేర్కొంటారు. ఆయా సంస్థలు ఇటీవల వీటిని ఐటీ, ఆర్‌అండ్‌డీ, ఫైనాన్స్, టెలికాం, బ్యాంకింగ్, వినియోగదారుల మద్దతు వంటి బహుళ సేవలను అందించే సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నాయి.వీటిలో నూతన టెక్నాలజీ అభివృద్ధితోపాటు స్థానిక స్టార్టప్‌లు, ఐటీ కంపెనీల భాగస్వామ్యంతో కొత్త ఉత్పత్తులను సిద్ధం చేస్తున్నాయి. ఇందుకు భారీస్థాయిలో ఏఐ, ఎంఎల్, జెన్‌ ఏఐ, బ్లాక్‌చైన్, ఐవోటీ, క్లౌడ్, ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ, వర్చువల్‌ రియాలిటీ వినియోగాన్ని పెంచుతున్నాయి.

Advertisement

Jobs : ఆవిష్క‌ర‌ణ ప‌రిశోధ‌న గ‌మ్య‌స్థానంగా తెలంగాణ‌.. జీసీసీ కేంద్రాల‌తో హైద‌రాబాద్‌లో ఉద్యోగావ‌కాశాలు..!

నిపుణులైన మానవ వనరుల లభ్యత, దేశ జనాభాలో 20-34 ఏళ్లలోపు యువత 24% ఉండటం, పైగా ఆంగ్ల భాషలో ప్రావీణ్యం కలిగి ఉండటం, మొత్తం పట్టభద్రుల్లో 24% సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మేథమెటిక్స్‌ (స్టెమ్‌) పట్టభద్రులే ఉండటంతో తమ జీసీసీ ఏర్పాటుకు కార్పొరేట్‌ సంస్థలు భారత్‌నే ఎంచుకుంటున్నాయి.వీటిలో 57% బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు చెందినవి. మరో 29% టెక్నాలజీ, మీడియా, టెలికం రంగాలకు సంబంధించినవి. ఇవి ప్రధానంగా బెంగళూరు, హైదరాబాద్, పుణె, చెన్నై, దిల్లీల్లో కొలువుదీరాయి. వీటికి సంబంధించిన పెట్టుబడుల ఆకర్షణలో నాలుగేళ్లుగా హైదరాబాద్‌ నగరం దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ విభాగంలో బెంగళూరును దాటేసింది.ఏఐ/ఎంఎల్, డేటా ఎనలిటిక్స్, సైబర్‌ సెక్యూరిటీ, క్లౌడ్‌ కంప్యూటింగ్, రోబోటిక్స్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్‌లలో నిపుణులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. హైదరాబాద్‌ జీసీసీల్లో టెక్నాలజీ, లైఫ్‌ సైన్సెస్, కన్సల్టింగ్‌ రంగాల వాటా ఎక్కువ ఉంది.

Advertisement

Recent Posts

New Liquor Policy : ఏపీలోని కొత్త లిక్క‌ర్ పాల‌సీ విధి విధానాలు ఇవే..!

New Liquor Policy : కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక స‌మూలమైన మార్పులు తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు చేస్తుంది. కొత్త‌గా మ‌ద్యం…

42 mins ago

Chandrababu : జ‌గ‌న్ తెచ్చింది దిక్కుమాలిన జీవో.. దానిని జ‌గ‌న్ ముఖాన క‌ట్టి రాష్ట్ర‌మంతా తిప్పుతానన్న చంద్ర‌బాబు..!

Chandrababu : గ‌త కొన్ని రోజులుగా ఏపీలో మెడిక‌ల్ సీట్ల వ్య‌వ‌హారం పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. త‌న హ‌యాంలో…

3 hours ago

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌజ్‌లో పుట్టుకొస్తున్న కొత్త ప్రేమాయ‌ణాలు.. కంటెంట్ మాములుగా ఇవ్వ‌డం లేదుగా..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకి ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. కంటెస్టెంట్స్…

4 hours ago

Electric Tractor : రైతులకు శుభవార్త… ఎలక్ట్రిక్ ట్రాక్టర్ వ‌చ్చేస్తున్నాయి..!

Electric Tractor : రైతులకు శుభవార్త... వ్యవసాయంలో రైతులకు వెన్నుద‌న్నుగా నిలిచే సరికొత్త ట్రాక్టర్‌ను మహారాష్ట్రకు చెందిన యువకుడు అభివృద్ధి…

5 hours ago

Blood : రక్తాన్ని శుద్ధి చేసే ఆహార పదార్థాలు ఇవే…వీటిని తీసుకుంటే చాలు… రోగాలన్నీ పరార్…!!

Blood : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మన శరీరంలో అన్ని అవయవాలు కూడా సక్రమంగా పని చేయాలి. అయితే…

6 hours ago

Job : నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. ఏపీఎస్ఎస్‌డీసీ ఆధ్వ‌ర్యంలో ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు

Job  : యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా APSSDC ఆధ్వర్యంలో ఏపీ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు…

7 hours ago

Tongue : మీ నాలుకను బట్టి మీ ఆరోగ్యం ఎలా ఉందో ఈజీగా చెప్పొచ్చు తెలుసా…!

Tongue : మన కళ్ళు పసుపు రంగులో మారిన లేక చర్మం పసుపు రంగులోకి మారిన కామెర్ల వ్యాధికి సంకేతం గా…

8 hours ago

Pitru Paksha : రేపటి నుంచి 15 రోజులపాటు పొరపాటున ఈ పనులు అస్సలు చేయకండి… నష్టపోతారు…!

Pitru Paksha : సనాతన ధర్మం ప్రకారం పూర్వీకులకు అంకితం చేయబడిన నిర్దిష్ట కాలాన్ని పితృపక్షం అని పిలుస్తారు. ఇక…

9 hours ago

This website uses cookies.