Health Benefits : ప్రతి ఒక్కరికి రోగనిరోధక శక్తి అనేది చాలా అవసరం. రోగ నిరోధక శక్తి అనేది శరీరంలో బలహీనంగా ఉంటే అనేక రోగాల బారిన పడుతాం. ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల వలన మన శరీరం అస్వస్థతకు గురి అవుతుంటుంది. శరీరంలో ఎటువంటి బ్యాక్టీరియాను, వైరస్లను పోనీయకుండా ఉండడానికి రోగనిరోధక శక్తి శరీరంలో సరిపడా ఉండాలి. వాతావరణంలో మార్పుల వలన అనేక రకాల ఇన్ఫెక్షన్లు ఆరోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయి. తక్కువ రోగనిరోధక శక్తి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కానీ ఈ తక్కువ రోగనిరోధక వ్యవస్థ నుండి మనల్ని మనం రక్షించుకోవాలి. సీజనల్ గా వచ్చే రోగాల బారి నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి మన రోగనిరోధక శక్తి పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి.
శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గడం అంటే ఏ కారణం చేతనైన శరీరం అనేక విషయాలను తట్టుకోలేక పోతుంది. కానీ దీని వలన కొన్ని వ్యాధులు కూడా మన శరీరంలో ఉండిపోతాయి. దగ్గు, జలుబు, జ్వరం ఈ సీజన్ లో బాగా వస్తాయి. వీటన్నింటిని వదిలించుకోవడానికి, ఆరోగ్యంగా ఉండేందుకు మనకు రోగనిరోధక శక్తి అవసరం. కావున రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఇంట్లో సులువుగా తయారు చేసుకునే ఈ జ్యూస్ ను త్రాగాలి. ఆపిల్ నారింజ, క్యారెట్ ఈ మూడింటిని ఒక్కొక్కటిగా లేదా కలిపి తింటే మంచిది. ఈ పండు తింటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నారింజలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్ చర్యతో పోరాడటానికి సహాయపడుతుంది. క్యారెట్ లో విటమిన్ ఏ మరియు బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఆపిల్ లో విటమిన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
ఈ పండ్లతో జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక క్యారెట్, ఒక ఆపిల్, ఒక నారింజ, ఒక నిమ్మకాయ రసం, అర టీ స్పూన్ పసుపు, మిరియాలు కొద్దిగా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా తయారైన జ్యూస్ ను వారానికి ఒకసారి త్రాగితే మంచి ఫలితం ఉంటుంది. పసుపు మరియు నల్ల మిరియాల లో ఉండే ఆంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు జలుబు, దగ్గు మరియు జ్వరాలతో పోరాడి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే ఈ జ్యూస్ ను ఊబకాయం సమస్యతో బాధపడేవారు త్రాగడం వలన శరీరంలో కొవ్వు పూర్తిగా తగ్గుతుంది. ప్రతిరోజు అర గ్లాసు ఈ జ్యూస్ ను త్రాగితే పొట్టలోని కొవ్వు తగ్గి ఆరోగ్యంగా ఉంటారు.
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.