Health Benefits : రోగ నిరోధక శక్తి పెరగాలంటే… ఈ జ్యూస్ ను త్రాగాలి… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : రోగ నిరోధక శక్తి పెరగాలంటే… ఈ జ్యూస్ ను త్రాగాలి…

Health Benefits : ప్రతి ఒక్కరికి రోగనిరోధక శక్తి అనేది చాలా అవసరం. రోగ నిరోధక శక్తి అనేది శరీరంలో బలహీనంగా ఉంటే అనేక రోగాల బారిన పడుతాం. ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల వలన మన శరీరం అస్వస్థతకు గురి అవుతుంటుంది. శరీరంలో ఎటువంటి బ్యాక్టీరియాను, వైరస్లను పోనీయకుండా ఉండడానికి రోగనిరోధక శక్తి శరీరంలో సరిపడా ఉండాలి. వాతావరణంలో మార్పుల వలన అనేక రకాల ఇన్ఫెక్షన్లు ఆరోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయి. తక్కువ రోగనిరోధక శక్తి […]

 Authored By prabhas | The Telugu News | Updated on :23 July 2022,7:00 am

Health Benefits : ప్రతి ఒక్కరికి రోగనిరోధక శక్తి అనేది చాలా అవసరం. రోగ నిరోధక శక్తి అనేది శరీరంలో బలహీనంగా ఉంటే అనేక రోగాల బారిన పడుతాం. ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల వలన మన శరీరం అస్వస్థతకు గురి అవుతుంటుంది. శరీరంలో ఎటువంటి బ్యాక్టీరియాను, వైరస్లను పోనీయకుండా ఉండడానికి రోగనిరోధక శక్తి శరీరంలో సరిపడా ఉండాలి. వాతావరణంలో మార్పుల వలన అనేక రకాల ఇన్ఫెక్షన్లు ఆరోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయి. తక్కువ రోగనిరోధక శక్తి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కానీ ఈ తక్కువ రోగనిరోధక వ్యవస్థ నుండి మనల్ని మనం రక్షించుకోవాలి. సీజనల్ గా వచ్చే రోగాల బారి నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి మన రోగనిరోధక శక్తి పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి.

శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గడం అంటే ఏ కారణం చేతనైన శరీరం అనేక విషయాలను తట్టుకోలేక పోతుంది. కానీ దీని వలన కొన్ని వ్యాధులు కూడా మన శరీరంలో ఉండిపోతాయి. దగ్గు, జలుబు, జ్వరం ఈ సీజన్ లో బాగా వస్తాయి. వీటన్నింటిని వదిలించుకోవడానికి, ఆరోగ్యంగా ఉండేందుకు మనకు రోగనిరోధక శక్తి అవసరం. కావున రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఇంట్లో సులువుగా తయారు చేసుకునే ఈ జ్యూస్ ను త్రాగాలి. ఆపిల్ నారింజ, క్యారెట్ ఈ మూడింటిని ఒక్కొక్కటిగా లేదా కలిపి తింటే మంచిది. ఈ పండు తింటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నారింజలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్ చర్యతో పోరాడటానికి సహాయపడుతుంది. క్యారెట్ లో విటమిన్ ఏ మరియు బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఆపిల్ లో విటమిన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

Health Benefits of apple carrot orange to grow immunity power in our body

Health Benefits of apple carrot orange to grow immunity power in our body

ఈ పండ్లతో జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక క్యారెట్, ఒక ఆపిల్, ఒక నారింజ, ఒక నిమ్మకాయ రసం, అర టీ స్పూన్ పసుపు, మిరియాలు కొద్దిగా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా తయారైన జ్యూస్ ను వారానికి ఒకసారి త్రాగితే మంచి ఫలితం ఉంటుంది. పసుపు మరియు నల్ల మిరియాల లో ఉండే ఆంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు జలుబు, దగ్గు మరియు జ్వరాలతో పోరాడి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే ఈ జ్యూస్ ను ఊబకాయం సమస్యతో బాధపడేవారు త్రాగడం వలన శరీరంలో కొవ్వు పూర్తిగా తగ్గుతుంది. ప్రతిరోజు అర గ్లాసు ఈ జ్యూస్ ను త్రాగితే పొట్టలోని కొవ్వు తగ్గి ఆరోగ్యంగా ఉంటారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది