Banana Leaf : అరటి ఆకు వెయ్యగానే నీరు చల్లుతారు… తిన్న తర్వాత లోపలికి మడుస్తారు… ఎందుకో కారణం తెలుసా…?
ప్రధానాంశాలు:
Banana Leaf : అరటి ఆకు వెయ్యగానే నీరు చల్లుతారు... తిన్న తర్వాత లోపలికి మడుస్తారు... ఎందుకో కారణం తెలుసా...?
Banana Leaf : అనాదిగా వస్తున్న సాంప్రదాయాలు మంట కలిసి పోతున్నాయి. ఆ రోజుల్లో అరటి ఆకు భోజనం ఎంతో ఇష్టంగా తినేవారు. ఇస్తరి భోజనాలు తినేవారు. ఇప్పుడు మారుతున్న కాలం కారణంగా ప్లాస్టిక్ కవర్ తో తయారు చేసిన ఇస్తరాకులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఆకులకు బదులు ఈ ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా పెరిగిపోయింది. ఇలాంటి సాంప్రదాయం నేటికీ పాటించేవారు ఉన్నారు. పండుగలు, ఫంక్షన్ల సమయంలో అరటి ఆకుల్లో భోజనం చేసేవారు. తిన్న తర్వాత అరటి ఆకుని ఎలా మడవాలో తెలుసా… తెలుగువారి జీవనశైలిలో అరటి చెప్పుకో విశిష్ట స్థానం ఉంది. అరటి పండ్లు, కాండం, ఆకులు ఇలా ప్రతి భాగం పండగలు, పర్వదినాల సమయంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. క్లారిటీ ఆకులు పురాతన కాలం నుంచి వివిధ ఆచారాలు, వేడుకలు, రోజువారి ఆహారపు అలవాటులో ఉపయోగించబడుతున్నాయి. అరటి ఆకుల ఆహారం తినడం కేవలం మనకి అనాదిగా వస్తున్న ఆచారం మాత్రమే కాదు. మన సాంస్కృతిక,ఆరోగ్యకరమైన జీవనశైలి చిహ్నం. అరటి ఆకుల్లో అన్నం తిన్న తర్వాత ఎంగిలి ఆకుల్ని లోపలికి మడత పెట్టడం వంటి ఆచారాలు ఇవ్వవుగాలుగా పాటిస్తున్నారు. చేయడం వెనుక గల కారణాలు ఏమిటో తెలుసుకుందాం..

Banana Leaf : అరటి ఆకు వెయ్యగానే నీరు చల్లుతారు… తిన్న తర్వాత లోపలికి మడుస్తారు… ఎందుకో కారణం తెలుసా…?
Banana Leaf నీరు చల్లడానికి గల కారణాలు
అరటి ఆకులో అన్నం వడ్డించే ముందు మొదట అరటి ఆకుపై నీటిని చల్లడం శతాబ్దాలుగా అనుసరిస్తూ వస్తున్న ఆచారం. దీనికి వివిధ కారణాలు చెప్పబడుతున్నాయి. అరటి ఆకులపై సహజంగా కీటకాలు, సూక్ష్మజీవులు ఉంటాయి. నీటిని చల్లి శుభ్రం చేయడం వలన ఆకు మీద ఉన్న కీటకాలు, సూక్ష్మజీవులు తొలగించబడతాయి. అప్పుడు ఆకులో ఆహారాన్ని వడ్డించుకుని తినడం వలన భద్రత ఉంటుందని నమ్మకం. ఆకుపై ఉన్న దుమ్ము, ధూళి తొలగించి ఆకును శుభ్రంగా ఉంచడానికి కూడా ఇలా చేస్తారు. నీటిని చల్లడం వల్ల ఆకు గట్టిగా ఉంటుంది. ఇలా చేయడం వలన తినేటప్పుడు ఆకులు చినిగిపోకుండా ఉంటాయి. ఆకుపై నీటిని చల్లడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇలాంటి ఆకులలో ఆహారం తింటే దైవిక శక్తి ఆశీర్వదిస్తుందని కూడా భావిస్తారు.
తిన్న తర్వాత ఆ కులం లోపలికి మడవడానికి గల కారణాలు
ఆకులలో భోజనం తిన్న తర్వాత, దానిని లోపలికి మడత పెడతారు. ఇలా చేయడం ఆహారాన్ని తయారు చేసి వడ్డించిన వారికి గౌరవం చూపించే మార్గంగా పరిగణించబడుతుంది. కొన్నిసార్లు ఆహార అవశేషాలు ఆకు లోపల భాగంలో ఉంటాయి. అందువల్ల, బయట నుంచి ఆకును లోపలికి మడత పెట్టడం సులభం. అలాగే ఆకును లోపలికి మడత పెట్టడం వల్ల సూర్య రష్మీ దానిలోనికి ప్రవేశించదు. అందులోని ఆహారం దెబ్బ తినకుండా నిరోధిస్తుంది. అరటి ఆకులను ఉపయోగించడం మన పూర్వీకుల నుంచి మనకు లభించిన బహుమతి. ఇది మన సంస్కృతిలో భాగం. నేటి ఆధునిక ప్రపంచంలో ప్లాస్టిక్ కాగితం వంటి వాటితో చేసిన వస్తువులు వాడకం ఎక్కువగా జరుగుతుంది. అరటి ఆకుల వంటి సహజ వస్తువులను ఉపయోగించడం ద్వారా మనం పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు.