Leaf Tea : బిర్యానీ ఆకు టీ తాగితే… శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Leaf Tea : బిర్యానీ ఆకు టీ తాగితే… శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా…!!

Leaf Tea : ప్రతి ఒక్కరి వంట గదులలో తప్పనిసరిగా ఉండే వాటిలలో బిర్యాని ఆకు కూడా ఒకటి. అయితే ఈ బిర్యానీ ఆకును రుచి కోసం వంటల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే ఈ బిర్యానీ ఆకు కేవలం వంటలలో రుచికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ బిర్యానీ ఆకులతో టీ తయారు చేసుకొని తాగటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని అంటున్నారు నిపుణులు. […]

 Authored By ramu | The Telugu News | Updated on :15 September 2024,6:00 am

ప్రధానాంశాలు:

  •  Leaf Tea : బిర్యానీ ఆకు టీ తాగితే... శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా...!!

Leaf Tea : ప్రతి ఒక్కరి వంట గదులలో తప్పనిసరిగా ఉండే వాటిలలో బిర్యాని ఆకు కూడా ఒకటి. అయితే ఈ బిర్యానీ ఆకును రుచి కోసం వంటల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే ఈ బిర్యానీ ఆకు కేవలం వంటలలో రుచికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ బిర్యానీ ఆకులతో టీ తయారు చేసుకొని తాగటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని అంటున్నారు నిపుణులు. అయితే బిర్యానీ ఆకుతో తయారు చేసిన టీ లో ఎన్నో పోషకాలు ఉన్నాయి అని అంటున్నారు. అయితే సాధారణ టీ ని వదిలేసి బిర్యానీ ఆకుతో చేసిన టీని తాగటం వలన శరీరంలో వెంటనే మార్పులు మొదలవుతాయి అని అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ మార్పులు ఏమిటి.? బిర్యానీ ఆకుతో టీ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

బిర్యానీ ఆకుల టీ తయారు చేసుకునేందుకు ముందుగా నాలుగు బిర్యానీ ఆకులను తీసుకోవాలి. తర్వాత స్టౌ వెలిగించి గిన్నె పెట్టుకుని దాని లో గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. ఆ నీళ్లనేవి కొద్దిగా మరిగిన తర్వాత దాని లో బిర్యానీ ఆకులు వేసి బాగా మరిగించాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసుకొని టీని వడకట్టుకొని తాగాలి. ఆ టీ అనేది కాస్త ఘాటుగా ఉంది అనుకుంటే దాని లో కొద్దిగా నిమ్మ రసం మరియు తేనె కలుపుకొని కూడా తాగొచ్చు. ఇలా ఈ టీ ని ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి గనుక తీసుకున్నట్లయితే మీ శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. అయితే నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారికి కూడా ఈ బిర్యానీ ఆకులనేవి ఎంతో మేలు చేస్తాయి. ఇటువంటి వారు రోజుకు ఒక్కసారైనా బిర్యానీ ఆకుల టీ ని తీసుకోవాలి. ముఖ్యంగా రాత్రి పడుకునే ఒక గంట ముందు ఈ టీ ని గనక తాగితే మీ శరీరం అనేది ఎంతో రిలాక్స్ అవుతుంది. దీంతో ఒత్తిడి అనేది తగ్గి మెదడు ప్రశాంతంగా మారి హాయిగా నిద్ర అనేది పడుతుంది. అయితే ఈ బిర్యానీ ఆకుల టీలో యాంటీ ఇన్ ఫ్లమెంటరీ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలోని వాపులను కూడా నయం చేస్తుంది. ఇకపోతే ఆర్థరేటిస్ మరియు కీళ్ల నొప్పుల సమస్య ఉన్నవారు కూడా బిర్యానీ ఆకుల టీ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

Leaf Tea బిర్యానీ ఆకు టీ తాగితే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా

Leaf Tea : బిర్యానీ ఆకు టీ తాగితే… శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా…!!

బిర్యానీ ఆకులతో తయారు చేసిన టీలో రుతిన్ మరియు కెఫీన్ యాసిడ్ అనే సమ్మేళనాలు కూడా ఉంటాయి. ఇవి గుండె యొక్క గోడలను బలంగా చేయడంలో మరియు చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. అయితే బిర్యానీ ఆకుల టీ తాగడం వలన ఫ్రీ రాడికల్స్ కణజాలాలు దెబ్బ తినడం తగ్గుతుంది. అలాగే షుగర్ పేషెంట్స్ కూడా ఈటీ ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇది ఇన్సూలిన్ స్థాయిలను తగ్గిస్తుంది. దీని వలన రక్తంలోని చక్కెర స్థాయిలు కంట్రోల్ లో ఉంటాయి…

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది