Health Benefits : ఇవి తింటే 90 ఏళ్ల వరకు ఆ రోగాలు రమ్మన్నా రావు.. ఇదిగో ప్రూఫ్
Health Benefits : బిర్యానీ ఆకులు… మనలో చాలా మందికి ఇవి తెలుసు. కానీ వీటిని మనం కేవలం బిర్యానీలు చేసేటపుడు మాత్రమే ఉపయోగిస్తూ ఉంటాం. కానీ వీటి వలన కలిగే ప్రయోజనాలు మనకు తెలిస్తే ఆశ్చర్యపోతాం. అన్ని ప్రయోజనాలు ఉన్నాయి.. వీటి వల్ల. రెండు బిర్యానీ ఆకులు వేసుకుని మరగబెట్టిన నీటిని ఉదయాన్నే తాగడం వలన 90 సంవత్సరాల వరకు మనలో కీళ్ల నొప్పులు, కిడ్నీ లో రాళ్లు, ఒళ్లు నొప్పులు, ఒబేసిటీ, కొలెస్ట్రాల్, హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. చాలా మంది నమ్మలేకుండా ఉన్నా కానీ ఇది నిజం. ఈ విషయాన్ని ఆల్రెడీ వైద్యులు ప్రూవ్ చేశారు. కాబట్టి మనం బిర్యానీలో వాడే బిర్యానీ ఆకుని మరగబెట్టుకుని ఆ నీటిని తాగడం వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బిర్యానీ ఆకులను ఆంగ్లంలో బే లీఫ్ అని అంటారు.
Health Benefits : ఈ ఆకుతో ఆరోగ్య చింత తీరినట్లే..
ఇలా బిర్యానీ ఆకులను వేడినీటిలో వేసుకుని ఆ నీటిని తాగడం వలన అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయి. అవేంటంటే..
- ఈ ఆకుల్లో విటమిన్ ఏ, సీ, ఐరన్, పొటాషియం, కాల్షియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. కావున వీటిని తీసుకోవడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది.
- మైగ్రేన్ చికిత్సలో ఇవి ఉపయోగపడతాయని ఇప్పటికే రుజువు చేయబడింది.
- వీటిల్లో ఉండే ఎంజైమ్స్ ప్రొటీన్స్ ను విచ్ఛిన్నం చేసేందుకు ఉపయోగపడతాయి.
- మల విసర్జన సమస్య ఉంటే ఇది తగ్గిస్తుంది. ఆ సమస్యకు మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది.
- గుండె నాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా చూసుకుంటుంది.
- బిర్యానీ ఆకు టీ చాలా మంచిది. దీనిలో అనేక రకాల యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి.
- బాలింతల్లో పాలిచ్చే సామర్థ్యాన్ని ఇది పెంచుతుంది.
కొవ్వును కరిగించి అధిక బరువు సమస్యను ఇది తగ్గిస్తుంది.