Castor Tree Leaves : ఆముదం చెట్టు గురించి దాని ఉపయోగాలు గురించి తెలుసా మీకు..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Castor Tree Leaves : ఆముదం చెట్టు గురించి దాని ఉపయోగాలు గురించి తెలుసా మీకు..?

 Authored By jyothi | The Telugu News | Updated on :26 November 2023,11:00 am

ప్రధానాంశాలు:

  •  Castor Tree Leaves : ఆముదం చెట్టు గురించి దాని ఉపయోగాలు గురించి తెలుసా మీకు..?

  •  Health Benefits Of Castor Tree Leaves In Telugu

Castor Tree Leaves  : ఆముదం చెట్టు గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇది చాలా విరివిగా కనిపించేటటువంటి చెట్టే అక్కడక్కడ పొదల్లోనూ లేదంటే పల్లె ప్రాంతాల్లోనూ వీధి చివర్లలోను ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆముదం చెట్టు గురించిన విశేషాలు చాలా మందికి తెలియదు. సాధారణంగా ఆముదం జిడ్డుగా ఉంటుందని దీన్ని ఎవరు ఉపయోగించరు.. కానీ ఈ ఆముదం చెట్టులో బోలెడన్ని ఔషధ గుణాలు ఉంటాయి. ఈ చెట్టు ఆకులకి ఆయుర్వేద వైద్యంలో ఎంతో ప్రత్యేకత ఉంటుంది. అనేక అనారోగ్య సమస్యలకు ఈ ఆముదం చెట్టు ఆకులు గింజలు సరైన పరిష్కార మార్గాలను చూపిస్తాయి. ఎన్నో రకాలు ఉపయోగాలు ఉంటాయి. ఈ ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి చెట్టు ప్రతి జీవి ఎంతో గొప్పగా ఉపయోగపడుతుంది. కానీ వాటిని తెలుసుకోగలగటమే మన యొక్క గొప్పతనం తెలుసుకుని ప్రపంచానికి తెలియపరచడం తర్వాతి తరాలకు దానిని కొనసాగించడం అనేది మన అందరి మీద ఉన్నటువంటి గొప్ప బాధ్యత. అందులో భాగంగానే ఈరోజు ఆముదం చెట్టు గురించి అందరూ తెలుసుకోవాల్సిన అటువంటి ప్రత్యేకతల గురించి మీకు తెలియచేయడం జరుగుతుంది. వారిని అని చెప్పొచ్చు.. ఆయుర్వేదంలో కూడా దీని ఎంతో విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు.

ఒక రకంగా చెప్పాలంటే అందరికీ ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి చెట్టుని దీని సంస్కృతంలో పంచాంగముల వర్ధమానాన్ని పిలుస్తూ ఉంటారు. మూడు రకాలు ఉంటాయి. ముఖ్యంగా ఎర్రముదాల చెట్టు, తెల్లాముదాల చెట్టు, పెద్ద ఆముదాల చెట్టు అనేటువంటి మూడు రకాలు ఉంటాయి. తెల్లాముదం చెట్లలో పెద్ద గింజలు కాచేదొకటి.. చిన్న గింజలు కాచేది అంటే చిట్టాము రకం ఒకటి ఉంటాయి. తెళ్లా ఆముదం చెట్టు కన్నా ఎర్రముదం తో అధిక గుణగణాలు ఉంటాయి. ఇది పక్షవాతంలాంటి వ్యాధులను కూడా నయం చేస్తుంది. సమస్త వాతలకి అజీర్ణ రోగాలకి శరీరంలో ఉన్నటువంటి సమస్త అవయవాలు వచ్చేటువంటి వ్యాధులను పోగొట్టేటువంటి శక్తి ఈ ఆముదం లో ఉంటుంది.

పక్షవాతానికి మలబద్దానికి ఈ ఆముదం చెట్టు అద్భుతంగా ఉపయోగపడుతుంది.దీని ఆకులు ముక్కలుగా చేసి బిడ్డల కడుపు స్థానం మీద రెండు మూడు సార్లు కనుక ఆకులతో రుద్దితే కడుపులో పురుగులన్నీ మలద్వారం గుండా బయటకు వచ్చేస్తాయి. అలాగే మూలవ్యాధిని నిర్మూలించడానికి లేత ఆముదపాకుని ఉపయోగిస్తారు. లేదా ఆముదపాకులు ఒక ముద్ద కర్పూరం బిళ్ళని కలిపి మెత్తగా నూరి కట్టు కడితే మూల వ్యాధి తొలగిపోతుంది. అలాగే రుతు చక్రవాగిపోయినటువంటి స్త్రీలకి ఆముదపాకుని కొంచెం నలగ కొట్టి వేడిచేసి గోరువెచ్చగా పొత్తికడుపు పైన పెడితే హరించుకుపోయి బహిష్టు వస్తుంది. అంతేకాదు నూనె ఆముదంతో తయారు చేసినటువంటి ఔషధాలు విరివిగా లభ్యమవుతున్నాయి.

ఆయుర్వేదంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఈ ఆముదపు చెట్టు గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవడం మనకు వచ్చేటువంటి అనేక రకాల సమస్యలకి ఇది ఒక గొప్ప పరిష్కారం మార్గం అవుతుంది. అని తెలుసుకోవడం ఎంతో అవసరమైనటువంటి విషయం అనేక రోగాలని అనేక వ్యాధులను నయం చేసేటువంటి ఆముదపు చెట్టు కేవలం ఒక పిచ్చి మొక్కగా ఒక మూలన పడి ఉండటం అనేది చాలా ప్రమాదం. ప్రతి ఒక్కరి పెరట్లో కచ్చితంగా పెంచుకోదగ్గ చెట్టు. దీని యొక్క ప్రతి ఒక్క ఉపయోగాన్ని అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

Advertisement
WhatsApp Group Join Now

Also read

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది