Coriander Juice : కొత్తిమీర ప్రతి వంటకాలలో ఎక్కువగా వాడుతున్నాము. అయితే ఈ కొత్తిమీరలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ప్రతి నిత్యం ఈ కొత్తిమీర రసాన్ని తీసుకోవడం వలన ఆరోగ్యానికి ఎన్నో పోషకాలు అందుతాయి. ఈ కొత్తిమీర ను ఎన్నో రకాల వంటలలో వాడే ముఖ్యమైన ఆకుకూర అని చెప్పొచ్చు. ఈ కొత్తిమీర ఆకు,కాండం, వేరు తో సహా దీనిలో ఔషధ గుణాలు ఉన్నాయి. అయితే ఈ కొత్తిమీర రసం తీసుకోవటం వలన ఎన్నో వ్యాధులను నియంత్రించవచ్చు.ఈ కొత్తిమీర ఆకులలో విటమిన్ సి, విటమిన్ ఇ అధికంగా ఉన్నాయి. వీటితో పాటు విటమిన్ ఏ మరియు విటమిన్ కే కూడా ఉన్నది. అయితే ఈ పోషకాలు అనేవి మీ రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటుగా శరీర అభివృద్ధికి కూడా ఎంతో దోహదపడుతుంది. దీంతోపాటు ఎన్నో రకాల సమస్యలు కూడా దూరం అవుతాయి. ఈ కొత్తిమీర అనేది మీ బ్లడ్ షుగర్ ను నియంత్రించడంలో మరియు ఇన్ఫెక్షన్లతో పోరాడడానికి గుండె, మెదడు, చర్మం, కాలేయం,ఎముకలు,రక్తం గడ్డ కట్టడం,జీర్ణ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుకే ఈ కొత్తిమీర రసాన్ని ప్రతిరోజు పరిగడుపున తీసుకోవాలి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే ఈ కొత్తిమీర ఆకులను ప్రతిరోజూ పరిగడుపున తీసుకోవడం వలన పొట్ట అనేది శుభ్రంగా ఉండి గ్యాస్ సమస్యలు అనేవి కూడా తగ్గుతాయి…
కొత్తిమీరలో విటమిన్ సి అనేది అధికంగా ఉంటుంది. ఇది శరీరం యొక్క రోగనిరోధక శక్తిని బలంగా చేయడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది అని అంటున్నారు.అయితే ఈ కొత్తిమీర రసాన్ని ఖాళీ కడుపుతో తాగటం వలన రక్తపోటు అనేది అదుపులో ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. దీనిలో యాంటీ ఇన్ ఫ్లమెంటరీ గుణాలు అనేవి అధికంగా ఉన్నాయి. అందుకే ఈ కొత్తిమీర రసాన్ని పరిగడుపున తీసుకోవడం వలన కీళ్ల వాపులు, నొప్పులు కూడా తొందరగా తగ్గుతాయి. ఈ కొత్తిమీర రసాన్ని ప్రతినిత్యం ఖచ్చితంగా తీసుకోవడం వలన మూత్రపిండాలతో సహా అన్ని ఆరోగ్య సమస్యల నుండి వెంటనే ఉపశమనాన్ని కలిగిస్తుంది…
కొత్తిమీర రసాన్ని తయారు చేసే విధానం : ఈ కొత్తిమీర రసాన్ని తయారు చేసుకునే ముందు ఈ ఆకులను శుభ్రంగా కడుక్కోవాలి. మళ్లీ ఈ ఆకులను మంచి నీటితో కడగాలి.ఆ తర్వాత కట్ చేసుకుని దానిని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. దానిలో కొన్ని నీళ్లు పోసుకుని మళ్లీ రుబ్బుకోవాలి. తర్వాత ఈ రసాన్ని తీసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. తరువాత ఈ రసంలో కొద్దిగా నిమ్మరసాన్ని కలుపుకోవాలి.ఆ తర్వాత మీరు తాగొచ్చు…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
This website uses cookies.