Ginger Juice : ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం రసం తాగితే… శరీరంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలుసా…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ginger Juice : ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం రసం తాగితే… శరీరంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలుసా…!

 Authored By ramu | The Telugu News | Updated on :19 September 2024,6:00 am

ప్రధానాంశాలు:

  •  Ginger Juice : ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం రసం తాగితే... శరీరంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలుసా...!

Ginger Juice : అల్లం లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ అల్లం జీర్ణక్రియను మెరుగుపరచడంలో మరియు జీవక్రియను పెంచడంలో కూడా హెల్ప్ చేస్తుంది. ఇది బరువు ను తగ్గించడానికి కూడా చక్కగా పనిచేస్తుంది. అయితే రోజు అల్లం రసం తాగడం వలన కొవ్వు కణాల విచ్చన్న ప్రక్రియను కూడా ప్రోత్సహిస్తుంది. ఈ అల్లం లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ వలన కలిగే నష్టాల నుండి కూడా కాపాడుతుంది. ఈ అల్లం రసం అనేది ఆయుర్వేద పానీయంగా కూడా చెబుతారు. ఇది కొన్ని శతాబ్దాలుగా దాని ఔషధ గుణాలకు ఎంతో ప్రసిద్ధి చెందింది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమెంటరీ జీర్ణ క్రియను మెరుగుపరిచే లక్షణాలతో సహా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే ఈ అల్లం లో జింజోరేల్ అనే సమ్మేళనం కూడా ఉంటుంది. ఇవి ఆహారం సులభంగా విచ్ఛిన్నం అయ్యేందుకు శరీరం పోషకాలను గ్రహించేందుకు కూడా హెల్ప్ చేస్తుంది…

అల్లం లో యాంటీ హీస్టామైన్ లక్షణాలు అనేవి వికారం కలిగించే హీస్టామైన్ కూడా అడ్డుకుంటుంది. అయితే ఈ అల్లం జ్యూస్ అనేది ఎంతో శక్తివంతమైన శోథ నివారణ మరియు నొప్పి నివారణ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. అలాగే ఇవి కీళ్ల నొప్పులు మరియు కండరాల నొప్పులు లాంటి సమస్యలను కూడా దూరం చేస్తుంది. అంతేకాక వాంతులు మరియు వికారం లాంటి సమస్యలకు కూడా చికిత్సగా పని చేస్తుంది. అలాగే ఈ అల్లం లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటుగా అంటూ వ్యాధులను కూడా దూరం చేస్తుంది. అలాగే అల్లం రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే టైప్ టు మధుమేహం ఉన్నవారికి ఎంతో ప్రయోజనకరంగా కూడా ఉంటుంది. అలాగే అల్లం రక్తపోటును తగ్గించడంతో పాటుగా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది…

Ginger Juice ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం రసం తాగితే శరీరంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలుసా

Ginger Juice : ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం రసం తాగితే… శరీరంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలుసా…!

అల్లం జ్యూస్ తయారీ కోసం ముందుగా అల్లం యొక్క తొక్కను తీసేసి, వాటిని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటిలో కసిన్ని నీళ్లు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దాని తర్వాత దానిని వడకట్టి దానిలో కొద్దిగా తేనె మరియు నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేయాలి. అంతే అల్లం జ్యూస్ రెడీ అయినట్లే. అయితే ఇది చలి మరియు దగ్గు,జలుబుకు చక్కని ఔషధం అని చెప్పొచ్చు. అలాగే శరీరంలోని వాపులను కూడా నియంత్రిస్తుంది. అంతేకాక బరువును తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తుంది…

Tags :

    ramu

    Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

    Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి