Flax Seeds : ప్రస్తుత కాలంలో ఎన్నో రకాల వ్యాధులు మనల్ని వెంటాడుతున్నాయి. అయితే ఈ వ్యాధులను తగ్గించడానికి మనం తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. దీని కోసం ఎంతో మంది తమ ఆహారంలో రుచికి మించి ఎంతో ఆరోగ్యకరమైన ఆహారాలను చేర్చుకుంటున్నారు. అటువంటి ఆహారాలలో అవిసె గింజలు కూడా ఒకటి. ఈ అవిసె గింజలు మంచి ఆరోగ్యకరమైన ఆహారం అని చెప్పొచ్చు. అయితే మార్కెట్లో ఎన్నో రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా అవిసె గింజలను మాత్రం అత్యంత ప్రభావవంతమైన వాటిగా చెబుతారు. వీటిలో ఫైబర్, ప్రోటీన్, కాపర్, జింక్ లాంటి ముఖ్యమైన పోషకాలు కూడా ఉన్నాయి. మీరు గనక వీటిని సరైన పద్ధతిలో తీసుకున్నట్లయితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అవిసె గింజలను తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…
1. అవిసె గింజలను అద్భుతమైన శక్తి వనరుగా చెప్పొచ్చు. అయితే మీకు రోజంతా అలసటగా అనిపించినట్లైతే సాయంత్రం వేళలో అవిసె గింజలను కాల్చుకొని తినండి. ఇలా చేయటం వలన కొద్ది క్షణాల్లోనే మీకు శక్తి అనేది లభిస్తుంది. దీనిలో ఉండే ప్రోటీన్ అలసటను దూరం చేస్తుంది.
2. ఈ అవిసె గింజలలో ఉండే ఒమేగా త్రీ మరియు ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు అనేవి సమృద్ధిగా ఉంటాయి. ఇది మెదడుకు పదును పెట్టడంలో కూడా ఎంతో హెల్ప్ చేస్తాయి. ఇవి ఆలోచించే మరియు అర్థం చేసుకునే సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది…
3. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో అవిసె గింజలు హెల్ప్ చేస్తాయి. అయితే ప్రతిరోజు కొన్ని కాల్చిన మరియు పచ్చి అవిసె గింజలు తీసుకోవడం వలన రక్తనాళాల్లో లో పేర్కొన్నటువంటి మూరికి మరియు కొవ్వు ను కూడా తొలగిస్తుంది. దీంతో గుండె ఆరోగ్యం గా ఉంటుంది…
4. అవిసె గింజలు బరువును నియంత్రించడంలో కూడా ప్రభావంతంగా పని చేస్తాయి. దీనిలో ఉన్నటువంటి ఫైబర్ జీవక్రియను మెరుగుపరచటం వలన బరువు తగ్గే ప్రక్రియ ఎంతో వేగవంతం అవుతుంది. అలాగే తరచుగా ఆకలి బాధలను కూడా నియంత్రిస్తుంది..
5. ఈ అవిసె గింజలు అనేవి కడుపును శుభ్రపరచడంలో కూడా హెల్ప్ చేస్తాయి. దీర్ఘకాలిక మలబద్ధకాన్ని కూడా ఈ అవిసె గింజలతో చెక్ పెట్టొచ్చు.
6. ఈ అవిసె గింజలను వాడడం వలన మీ చర్మం మరియు జుట్టు ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. దీనిలో ఉన్నటువంటి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనేవి జట్టు మరియు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి డ్యామేజ్ అయినటువంటి జుట్టును మెరిపించడమే కాకుండా చర్మాన్ని కూడా ఎంతో కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.
7. అవిసె గింజలలో ఉన్నటువంటి మెగ్నీషియం ఒత్తిడిని తగ్గించి మంచి నిద్రకు హెల్ప్ చేస్తుంది. అలాగే నిద్రలేమి సమస్య ను కూడా దూరం చేస్తుంది…
అవిసె గింజలను తినడానికి సరైన మార్గం : ఈ అవిసె గింజలను పచ్చిగా లేక వేయించి తీసుకోవచ్చు. అయితే వేయించిన అవిసె గింజలను తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండటమే కాకుండా తినడానికి కూడా రుచిగా ఉంటాయి. రోజు ఈ అవిసె గింజలను ఉదయం పూట గాని సాయంత్రం పూట గాని స్నాక్స్ లా కూడా తీసుకోవచ్చు…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.