Flax Seeds : అవిసె గింజలను సరైన మార్గంలో తీసుకుంటే… బోలెడు లాభాలు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Flax Seeds : అవిసె గింజలను సరైన మార్గంలో తీసుకుంటే… బోలెడు లాభాలు…!!

Flax Seeds : ప్రస్తుత కాలంలో ఎన్నో రకాల వ్యాధులు మనల్ని వెంటాడుతున్నాయి. అయితే ఈ వ్యాధులను తగ్గించడానికి మనం తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. దీని కోసం ఎంతో మంది తమ ఆహారంలో రుచికి మించి ఎంతో ఆరోగ్యకరమైన ఆహారాలను చేర్చుకుంటున్నారు. అటువంటి ఆహారాలలో అవిసె గింజలు కూడా ఒకటి. ఈ అవిసె గింజలు మంచి ఆరోగ్యకరమైన ఆహారం అని చెప్పొచ్చు. అయితే మార్కెట్లో ఎన్నో రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా […]

 Authored By ramu | The Telugu News | Updated on :15 September 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Flax Seeds : అవిసె గింజలను సరైన మార్గంలో తీసుకుంటే... బోలెడు లాభాలు...!!

Flax Seeds : ప్రస్తుత కాలంలో ఎన్నో రకాల వ్యాధులు మనల్ని వెంటాడుతున్నాయి. అయితే ఈ వ్యాధులను తగ్గించడానికి మనం తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. దీని కోసం ఎంతో మంది తమ ఆహారంలో రుచికి మించి ఎంతో ఆరోగ్యకరమైన ఆహారాలను చేర్చుకుంటున్నారు. అటువంటి ఆహారాలలో అవిసె గింజలు కూడా ఒకటి. ఈ అవిసె గింజలు మంచి ఆరోగ్యకరమైన ఆహారం అని చెప్పొచ్చు. అయితే మార్కెట్లో ఎన్నో రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా అవిసె గింజలను మాత్రం అత్యంత ప్రభావవంతమైన వాటిగా చెబుతారు. వీటిలో ఫైబర్, ప్రోటీన్, కాపర్, జింక్ లాంటి ముఖ్యమైన పోషకాలు కూడా ఉన్నాయి. మీరు గనక వీటిని సరైన పద్ధతిలో తీసుకున్నట్లయితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అవిసె గింజలను తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

Flax Seeds అవిసె గింజలు తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు

1. అవిసె గింజలను అద్భుతమైన శక్తి వనరుగా చెప్పొచ్చు. అయితే మీకు రోజంతా అలసటగా అనిపించినట్లైతే సాయంత్రం వేళలో అవిసె గింజలను కాల్చుకొని తినండి. ఇలా చేయటం వలన కొద్ది క్షణాల్లోనే మీకు శక్తి అనేది లభిస్తుంది. దీనిలో ఉండే ప్రోటీన్ అలసటను దూరం చేస్తుంది.

2. ఈ అవిసె గింజలలో ఉండే ఒమేగా త్రీ మరియు ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు అనేవి సమృద్ధిగా ఉంటాయి. ఇది మెదడుకు పదును పెట్టడంలో కూడా ఎంతో హెల్ప్ చేస్తాయి. ఇవి ఆలోచించే మరియు అర్థం చేసుకునే సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది…

3. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో అవిసె గింజలు హెల్ప్ చేస్తాయి. అయితే ప్రతిరోజు కొన్ని కాల్చిన మరియు పచ్చి అవిసె గింజలు తీసుకోవడం వలన రక్తనాళాల్లో లో పేర్కొన్నటువంటి మూరికి మరియు కొవ్వు ను కూడా తొలగిస్తుంది. దీంతో గుండె ఆరోగ్యం గా ఉంటుంది…

4. అవిసె గింజలు బరువును నియంత్రించడంలో కూడా ప్రభావంతంగా పని చేస్తాయి. దీనిలో ఉన్నటువంటి ఫైబర్ జీవక్రియను మెరుగుపరచటం వలన బరువు తగ్గే ప్రక్రియ ఎంతో వేగవంతం అవుతుంది. అలాగే తరచుగా ఆకలి బాధలను కూడా నియంత్రిస్తుంది..

5. ఈ అవిసె గింజలు అనేవి కడుపును శుభ్రపరచడంలో కూడా హెల్ప్ చేస్తాయి. దీర్ఘకాలిక మలబద్ధకాన్ని కూడా ఈ అవిసె గింజలతో చెక్ పెట్టొచ్చు.

6. ఈ అవిసె గింజలను వాడడం వలన మీ చర్మం మరియు జుట్టు ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. దీనిలో ఉన్నటువంటి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనేవి జట్టు మరియు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి డ్యామేజ్ అయినటువంటి జుట్టును మెరిపించడమే కాకుండా చర్మాన్ని కూడా ఎంతో కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.

Flax Seeds అవిసె గింజలను సరైన మార్గంలో తీసుకుంటే బోలెడు లాభాలు

Flax Seeds : అవిసె గింజలను సరైన మార్గంలో తీసుకుంటే… బోలెడు లాభాలు…!!

7. అవిసె గింజలలో ఉన్నటువంటి మెగ్నీషియం ఒత్తిడిని తగ్గించి మంచి నిద్రకు హెల్ప్ చేస్తుంది. అలాగే నిద్రలేమి సమస్య ను కూడా దూరం చేస్తుంది…

అవిసె గింజలను తినడానికి సరైన మార్గం : ఈ అవిసె గింజలను పచ్చిగా లేక వేయించి తీసుకోవచ్చు. అయితే వేయించిన అవిసె గింజలను తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండటమే కాకుండా తినడానికి కూడా రుచిగా ఉంటాయి. రోజు ఈ అవిసె గింజలను ఉదయం పూట గాని సాయంత్రం పూట గాని స్నాక్స్ లా కూడా తీసుకోవచ్చు…

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది