Vinayaka Nimajjanam : వినాయకుని నిమజ్జనంలో తప్పులు అస్సలు చేయకండి... తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు...!
Vinayaka Nimajjanam : వినాయక చవితి ఉత్సవాల ముగింపు సమయం రానే వచ్చింది. తొమ్మిది రోజులపాటు పూజలను అందుకున్న గణపయ్య పదవరోజు గంగమ్మ ఒడిలోకి చేరతాడు. చతుర్దశి రోజున ప్రజలందరూ తమ వినాయకుల విగ్రహాలను వైభవంగా సంగీత వాయిద్యాలతో ఘనంగా ఊరేగింపు చేస్తూ నది దగ్గరకు తీసుకువెళ్లి నిమజ్జనం చేస్తారు. గణేషుడు వచ్చే ఏడాది మళ్లీ తమ ఇంటికి రావాలని కోరుకుంటూ నిమర్జనాలు చేస్తారు. గణేశుడి ఉత్సవాలు భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిధిన ప్రారంభమయ్యాయి. కాబట్టి ఈ పండుగను భాద్రపద మాసంలోని శుక్ల పక్షం చతుర్దశి తేదీ వరకు కొనసాగిస్తారు. ఇలా ప్రతి ఇంట్లో లేదా ఊరిలో 10 రోజులపాటు వినాయకుడు పూజా మండపాలలో కొలువుదీరి పూజలను అందుకుంటాడు.
వేద హిందు క్యాలెండర్ ప్రకారం చూసుకున్నట్లయితే అనంత చతుర్దశి తీది సెప్టెంబర్ 16వ తేదీన మధ్యాహ్నం 03:10 నిమిషాలకు ప్రారంభమవుతుంది. తిరిగి మరసటి రోజు సెప్టెంబర్ 17వ తేదీన రాత్రి 11: 44 నిమిషాలకు ముగుస్తుంది. అయితే అనంత చతుర్దశి తీదిన ఉదయం 6: 20 నిమిషాల నుండి 11:44 గంటల వరకు పూజాది కార్యక్రమాలను నిర్వహించాలి.
వేద క్యాలెండర్ ప్రకారంగా గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు ఉదయం 9 : 23 నుంచి సాయంత్రం 9 : 28 వరకు శుభ సమయం ఉంటుంది. అయితే ఈ సమయంలో వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని వేద పండితులు చెబుతున్నారు.
Vinayaka Nimajjanam : వినాయకుని నిమజ్జనంలో తప్పులు అస్సలు చేయకండి… తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు…!
గణేశుడి నిమజ్జనం చేయడానికి ముందుగా చెక్క ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దానిని గంగాజలంతో శుద్ధి చేసి స్వస్తిక్ గుర్తు వెయ్యాలి. ఇలా దానిపై పసుపు వస్త్రాన్ని పరిచి వినాయకుడిని పెట్టండి. ఆ తరువాత గణేశుడుకి కొత్త బట్టలు ధరించి పసుపు కుంకుమ అద్దాలి. ఇక ఆసనం పై అక్షంతలు పూలు పండ్లు మోదకం వంటివి దేవుడికి సమర్పించాలి. నిమజ్జనానికి ముందు పూర్తి నియమ నిబంధనలతో గణేశుడిని పూజించాలి. గణపతిని వచ్చే ఏడాది తిరిగి తన ఇంటికి రమ్మని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి హారతి ఇవ్వండి. ఆ తరువాత గణేశుడిని ఆచార బద్దంగా నిమజ్జనం చేయండి. ఒకవేళ ఈ తొమ్మిది రోజులలో పూజాది కార్యక్రమాలలో ఏమైనా తప్పులు జరిగినట్లయితే క్షమించమని గణపతిని అడగండి
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.