Garlic Honey : ఖాళీ కడుపుతో ఈ రెండిటిని కలిపి తీసుకుంటే… ప్రయోజనాలు మరింత రెట్టింపు అవుతాయని మీకు తెలుసా…?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Garlic Honey : ఖాళీ కడుపుతో ఈ రెండిటిని కలిపి తీసుకుంటే… ప్రయోజనాలు మరింత రెట్టింపు అవుతాయని మీకు తెలుసా…??

Garlic Honey : సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో తేనే మరియు వెల్లుల్లి కచ్చితంగా వాడుతారు. వీటి యొక్క ప్రయోజనాల గురించి ప్రతి ఒక్కరికి బాగా తెలుసు. అయితే ఈ వెల్లుల్లిని తేనెలో నానబెట్టుకుని తీసుకుంటే రోగనిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది. అలాగే ఇది యాంటీబయోటిక్ గా పనిచేసే సూపర్ ఫుడ్ అని కూడా చెప్పొచ్చు. అలాగే ఇది శరీరాన్ని డిటాక్స్ ఫై చేస్తుంది. అలాగే అన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుండి కూడా శరీరాన్ని రక్షిస్తుంది. ఇది […]

 Authored By ramu | The Telugu News | Updated on :19 November 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Garlic Honey : ఖాళీ కడుపుతో ఈ రెండిటిని కలిపి తీసుకుంటే... ప్రయోజనాలు మరింత రెట్టింపు అవుతాయని మీకు తెలుసా...??

Garlic Honey : సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో తేనే మరియు వెల్లుల్లి కచ్చితంగా వాడుతారు. వీటి యొక్క ప్రయోజనాల గురించి ప్రతి ఒక్కరికి బాగా తెలుసు. అయితే ఈ వెల్లుల్లిని తేనెలో నానబెట్టుకుని తీసుకుంటే రోగనిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది. అలాగే ఇది యాంటీబయోటిక్ గా పనిచేసే సూపర్ ఫుడ్ అని కూడా చెప్పొచ్చు. అలాగే ఇది శరీరాన్ని డిటాక్స్ ఫై చేస్తుంది. అలాగే అన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుండి కూడా శరీరాన్ని రక్షిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని కూడా ఎంతో బలంగా చేస్తుంది. అంతే కాక ఎటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు రాకుండా కూడా చూస్తుంది. అలాగే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించడంలో తేనె మరియు వెల్లుల్లి ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాగే జలుబు మరియు దగ్గు లాంటి సమస్యలకు వెల్లుల్లి ఎంతో చక్కగా పనిచేస్తుంది. ఈ రెండిటిలో శరీరాన్ని వెచ్చగా ఉంచే గుణాలు కూడా ఉన్నాయి. ఈ తేనే మరియు వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమెంటరీ లక్షణాలు కూడా దాగి ఉన్నాయి. ఇవి గొంతు నొప్పిని తగ్గించటంతో పాటు మంటను కూడా నియంత్రిస్తాయి.

ఈ వెల్లుల్లి మరియు తేనే అనేది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇది రక్త ప్రసరణను కూడా ఎంతో మెరుగుపరుస్తుంది. అంతేకాక గుండె ధమనుల్లో పేరుకుపోయినటువంటి కొవ్వును నియంత్రించడంలో సహాయపడే గుణాలు ఈ రెండిటిలో ఉన్నాయి. మీ గుండె ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. అలాగే వెల్లుల్లి మరియు తేనె తీసుకోవడం వలన జీర్ణ వ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మలబద్ధకం మరియు విరోచనాలు, కడుపు ఉబ్బరం, గ్యాస్,అసిడిటీ లాంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఉండదు. దీనిలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్సు మరియు ఫ్రీ రాడికల్స్ కూడా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కూడా రక్షిస్తాయి. దీంతో చర్మం అనేది ఎంతో నిగనిగలాడుతుంది.

Garlic Honey ఖాళీ కడుపుతో ఈ రెండిటిని కలిపి తీసుకుంటే ప్రయోజనాలు మరింత రెట్టింపు అవుతాయని మీకు తెలుసా

Garlic Honey : ఖాళీ కడుపుతో ఈ రెండిటిని కలిపి తీసుకుంటే… ప్రయోజనాలు మరింత రెట్టింపు అవుతాయని మీకు తెలుసా…??

అలాగే మీరు ఎంత యవ్వనంగా మెరుస్తూ ఉంటారు. వీటితోపాటుగా చర్మం పై ఉన్న ముడతలు కూడా తగ్గిపోతాయి. అలాగే మీరు ఎంత యవ్వనంగా కనిపిస్తారు అని అంటున్నారు. దీనికోసం మీరు రాత్రి పూట గాజు సీసాలో తేనే వేసుకుని దానిలో కొద్దిగా పొట్టు తీసిన వెల్లుల్లి వేసి నానబెట్టాలి. ఇప్పుడు మీరు ప్రతి రోజు ఉదయం లేచిన వెంటనే, ఈ సీసా నుండి ఒకటి లేక రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకొని ఖాళీ కడుపుతో నమిలి తీసుకోవాలి. అలాగే మీరు దీనిని అల్పాహారంలో లేక రాత్రి భోజనంలో కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఉదయాన్నే రెండు లేక మూడు వెల్లుల్లి రెబ్బలను నమిలి తీసుకోవడం వలన మీ ఆరోగ్య ఎంతో బాగుంటుంది

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది