Honey : శీతాకాలంలో నిత్యం ఉదయాన్నే ఒక స్పూన్ తేనెను తీసుకుంటే… ఈ సమస్యలన్నీ పరార్…!!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Published on: November 28, 2024, 8:30 am
  •  Honey : శీతాకాలంలో నిత్యం ఉదయాన్నే ఒక స్పూన్ తేనెను తీసుకుంటే... ఈ సమస్యలన్నీ పరార్...!!

Honey : శీతాకాలంలో నిత్యం ఉదయన్నే పరిగడుపున ఒక టీ స్పూన్ తేనెను తీసుకుంటే ఏమవుతుందో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అయితే ఈ తేనెలో యాంటీ ఇన్ప్లమెంటరీ లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో పరిగడుపున ప్రతిరోజు ఒక టీ స్పూన్ తేనెను తీసుకోవడం వలన దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు. అలాగే తేనెను తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది. అంతేకాక ఎన్నో వ్యాధులను కూడా తగ్గిస్తుంది. ఇది జలుబు మరియు దగ్గును తగ్గించడం కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ తేనెలో ప్రీబయోటిక్ లక్షణాలు కూడా ఉంటాయి. అయితే ప్రతి వ్యక్తి ఒక టీ స్పూన్ తేనెను తీసుకోవడం వలన శీతాకాలంలో జీర్ణ సమస్యల నుండి కూడా ఉపశమనం కలుగుతుంది.

Honey : శీతాకాలంలో నిత్యం ఉదయాన్నే ఒక స్పూన్ తేనెను తీసుకుంటే... ఈ సమస్యలన్నీ పరార్...!!

Honey : శీతాకాలంలో నిత్యం ఉదయాన్నే ఒక స్పూన్ తేనెను తీసుకుంటే… ఈ సమస్యలన్నీ పరార్…!!

అలాగే తేనెలో యాంటీ ఆక్సిడెంట్సు మరియు ఆంటీ బ్యాక్టీరియాల్ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అలాంటి పరిస్థితులలో చలికాలంలో తేనెను తీసుకోవడం వలన రోగనిరోదక శక్తి ఎంతో బలంగా తయారవుతుంది. మీరు ఒక చెంచా తెనె లో పసుపు మరియు కొద్దిగా అల్లం రసం కలుపుకొని తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే మీరు గనక చలికాలంలో తేనెను తీసుకున్నట్లయితే మీ గుండె చాలా కాలం పాటు ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది అని అంటున్నారు. ఎందుకు అంటే దానిలో యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటాయి. అయితే మీకు అధిక కొలెస్ట్రాల్ సమస్య గనక ఉన్నట్లయితే, నిపుణుని సంప్రదించిన తర్వాత మాత్రమే మీ ఆహారంలో తేనెను తీసుకోవాలి అని అంటున్నారు. అంతేకాక పేలవమైన జీర్ణశక్తి ఉన్నవారికి తేనె అనేది దివ్య ఔషధం కంటే తక్కువ ఏమి కాదు. అలాగే అది కొద్ది రోజుల్లోనే తేడా కూడా మీకు కనిపిస్తుంది.

కొద్దిగా గోరువెచ్చని నీటిలో తేనె మరియు కాస్త పసుపు వేసుకొని తాగితే అలర్జీ మరియు జలుబు లాంటి ఎన్నో రకాల సమస్యలు అనేవి నయం అవుతాయి. అలాగే ఈ తేనెలో యాంటీ ఇన్ఫ్లోమెంటరీ గుణాలు కూడా ఉంటాయి. ఇవి అలర్జీ లక్షణాలను నియంత్రిస్తాయి. ఈ తేనెను గనక మీరు మీ డైట్ లో యాడ్ చేసుకున్నట్లయితే గ్యాస్ మరియు అసిడిటీ సమస్య అనేది దూరం అవుతుంది. అంతేకాక మలబద్ధకం కూడా తగ్గిపోతుంది. దీనికోసం వేడి నీటిలో తేనె కలిపి ఉదయాన్నే తాగినట్లయితే జీర్ణ క్రియకు కూడా ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఈ తేనె ఆరోగ్యానికి మంచిది కదా అని ఎక్కువ తీసుకుంటే మంచిది కాదు. మితంగా తీసుకుంటేనే మంచిది. మీకు రోజుకు ఒక స్పూన్ తేనే అనేది సరిపోతుంది…

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Tags :
Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp