Muskmelon
Muskmelon : ఈ ఏడాది మార్చి మొదటి వారం నుండే ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ రెండో వారంలో ఉండాల్సిన 40 డిగ్రీల ఎండలు ఇప్పుడు మార్చిలోనే కనిపిస్తున్నాయి. దీనితో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎండాకాలంలో ఎక్కువగా చల్లటి పదార్దాల వైపు మొగ్గు చూపుతాము. అయితే సమ్మర్ వస్తు వస్తూనే కొన్ని పండ్లను తన వెంట తీసుకొస్తుంది. అలాంటి వాటిలో ఖర్బూజ ఒకటి. సాధారణంగా సమ్మర్‌లో రోడుపై ఎక్కడ చూసినా ఖర్బూజ పండ్లు, జ్యూస్ సెంటర్లు కనిపిస్తుంటాయి. మరి వేసవిలో విరివిగా లభించే ఖర్బూజతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఓసారి తెలుసుకుందామా..
కంటి చూపు మెరుగు పర్చటంలో కర్బుజ కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ ఎ కంటి సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.ఈ పండులో ఉండే బీటాకెరోటిన్ క్యాన్సర్ కణాలను తొలగించి, ప్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. తెల్ల రక్త కణాల వృధ్దిలో కూడా ఈ పండు ఉపయోగపడుతుంది. వేసవిలో చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో ఒకటైన వడదెబ్బ నుంచి ఖర్బూజ రక్షిస్తుంది. ముఖ్యంగా ఎండలో బయటకి వెళ్లే వారు ఖర్బూజ జ్యూస్ తాగడం మంచిది.
Muskmelon
ఇక ఖర్బూజలో విటమిన్ కె, ఇ పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల ప్రత్యుత్పత్తి వ్యవస్థ బాగా పనిచేస్తుంది. సంతాన లేమితో బాధపడేవారు ఈ పండును తరుచుగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక రక్త ప్రసరణ మెరుగు పరచడంలో కూడా ఈ పండు కీలక పాత్ర పోషిస్తుంది. పైల్స్ వంటి సమస్యలతో బాధపడేవారికి మేలు చేస్తుంది.
ఈ పండులో ఉండే పొటిషం వల్ల గుండెకు అవసరమయ్యే న్యూట్రియన్స్ అందుతాయి. గుండె పోటు సమస్యను దూరం చేయడంలో ఖర్బూజ ఉపయోగపడుతుంది. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారు ఖర్బూజను క్రమం తప్పకుండా తీసుకుంటే రాళ్లు కరిగిపోతాయి. ఇక ఈ పండులో ఉండే పీచు వల్ల జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. ఈ సమ్మర్ సీజన్ లో పుచ్చకాయ తర్వాత ఎక్కువగా అమ్ముడుపోయే పండు కర్బుజ. తెలిసిందిగా కర్బుజ వలన కలిగే ఉపయోగాలు ఏమిటో.. ఇక ఆలస్యం చేయకుండా రోజువారీ దినచర్యలో ఖచ్చితంగా కర్బుజను భాగం చేసుకోండి
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
This website uses cookies.