Muskmelon : ఈ సీజన్ లో కర్బుజ తో కలిగే లాభాలు ఎన్నో తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Muskmelon : ఈ సీజన్ లో కర్బుజ తో కలిగే లాభాలు ఎన్నో తెలుసా..?

 Authored By brahma | The Telugu News | Updated on :19 March 2021,7:02 pm

Muskmelon : ఈ ఏడాది మార్చి మొదటి వారం నుండే ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ రెండో వారంలో ఉండాల్సిన 40 డిగ్రీల ఎండలు ఇప్పుడు మార్చిలోనే కనిపిస్తున్నాయి. దీనితో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎండాకాలంలో ఎక్కువగా చల్లటి పదార్దాల వైపు మొగ్గు చూపుతాము. అయితే సమ్మర్‌ వస్తు వస్తూనే కొన్ని పండ్లను తన వెంట తీసుకొస్తుంది. అలాంటి వాటిలో ఖర్బూజ ఒకటి. సాధారణంగా సమ్మర్‌లో రోడుపై ఎక్కడ చూసినా ఖర్బూజ పండ్లు, జ్యూస్‌ సెంటర్లు కనిపిస్తుంటాయి. మరి వేసవిలో విరివిగా లభించే ఖర్బూజతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఓసారి తెలుసుకుందామా..

Muskmelon : కర్బుజ- దాని ఉపయోగాలు

కంటి చూపు మెరుగు పర్చటంలో కర్బుజ కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్‌ ఎ కంటి సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.ఈ పండులో ఉండే బీటాకెరోటిన్‌ క్యాన్సర్‌ కణాలను తొలగించి, ప్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. తెల్ల రక్త కణాల వృధ్దిలో కూడా ఈ పండు ఉపయోగపడుతుంది. వేసవిలో చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో ఒకటైన వడదెబ్బ నుంచి ఖర్బూజ రక్షిస్తుంది. ముఖ్యంగా ఎండలో బయటకి వెళ్లే వారు ఖర్బూజ జ్యూస్‌ తాగడం మంచిది.

Muskmelon

Muskmelon

ఇక ఖర్బూజలో విటమిన్‌ కె, ఇ పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల ప్రత్యుత్పత్తి వ్యవస్థ బాగా పనిచేస్తుంది. సంతాన లేమితో బాధపడేవారు ఈ పండును తరుచుగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక రక్త ప్రసరణ మెరుగు పరచడంలో కూడా ఈ పండు కీలక పాత్ర పోషిస్తుంది. పైల్స్‌ వంటి సమస్యలతో బాధపడేవారికి మేలు చేస్తుంది.

ఈ పండులో ఉండే పొటిషం వల్ల గుండెకు అవసరమయ్యే న్యూట్రియన్స్‌ అందుతాయి. గుండె పోటు సమస్యను దూరం చేయడంలో ఖర్బూజ ఉపయోగపడుతుంది. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారు ఖర్బూజను క్రమం తప్పకుండా తీసుకుంటే రాళ్లు కరిగిపోతాయి. ఇక ఈ పండులో ఉండే పీచు వల్ల జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. ఈ సమ్మర్ సీజన్ లో పుచ్చకాయ తర్వాత ఎక్కువగా అమ్ముడుపోయే పండు కర్బుజ. తెలిసిందిగా కర్బుజ వలన కలిగే ఉపయోగాలు ఏమిటో.. ఇక ఆలస్యం చేయకుండా రోజువారీ దినచర్యలో ఖచ్చితంగా కర్బుజను భాగం చేసుకోండి

brahma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది