Home » Health » Health Benefits Of Mustard Oil In Telugu
Health

Mustard Oil : చలికాలంలో ఆవనూనె ఇలా వాడితే చాలు… 100 సమస్యలకు చెక్ పెట్టవచ్చు…!

Authored By
Jyothi Marikanti
The Telugu News | Updated on: November 27, 2023 8:31 pm
Advertisement

Mustard Oil : సీజన్ మారినప్పుడు ఎన్నో రకాల సమస్యల బారిన పడవలసి వస్తుంది.. శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి.. చర్మం పొడిబారడం, జుట్టు రాలిపోవడం, చుండ్రు రావడం లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యలకి ఉపశమనం కలిగించడానికి ఈ చలికాలంలో ఈ ఆవ నూనె ను ఇలా వాడితే చాలు. ఈ సమస్యలకి చెక్ పెట్టవచ్చు..
ఆవ నూనెను వంటలకే కాకుండా చర్మ రక్షణకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రధానంగా ఈ చలికాలంలో వచ్చే సమస్యలకి ఆవనూనె చాలా బాగా ఉపయోగపడుతుంది. చలికాలం వచ్చిందంటే చర్మం పొడి వారి పోతూ ఉంటుంది. దాని ఫలితంగా చర్మం కాంతి హీనంగా కనిపిస్తూ ఉంటుంది. దాని వలన ఈ చలికాలంలో చర్మంపై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది.. చర్మ రక్షణకు ఆవనూనె ఎలా వాడాలో ఇప్పుడు మనం చూద్దాం..

Advertisement

ఎగ్జిమా, పొడి చర్మం, సోరియాసి స్ ప్రమాదాన్ని పెంచుతాయి. అయితే ఆవాల నూనెను వాడడం వలన చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. రోజు కొన్ని చుక్కల నూనెతో చర్మానికి మసాజ్ చేసుకోవాలి. ఆవనూనెతో చర్మానికి మసాజ్ చేయడం వలన రక్త ప్రసరణ మెరుగవుతుంది. దీంతో చర్మానికి తగిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆవాల నూనె ముఖంతోపాటు శరీరంలో మిగిలిన భాగాలపై కూడా మసాజ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వలన కండరాల ఒత్తిడిని తగ్గేలా చేస్తుంది.. ఆవ నూనె చర్మంతో పాటు జుట్టును కూడా రక్షిస్తుంది. ఆవనూనె జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. ఈ ఆవాల నూనెతో తలకు మసాజ్ చేయడం వల్ల వెంట్రుకల కుదుళ్ళను మెరుగుపరుస్తుంది. జుట్టు పెరిగేలా చేస్తుంది..

చర్మ నిర్జలీకరణ కారణంగా చర్మం వేగంగా వృద్ధాప్యం చెందుతుంది. కావున చర్మం తేమను రక్షించుకోవడం చాలా అవసరం. నూనె ముడతలు ఫైన్ లైన్లను తొలగించడంలో ప్రభావంతంగా ఉపయోగపడుతుంది. ఆవనూనెలో దూదిని ముంచి ముఖానికి మసాజ్ చేయాలి.. ఇలా చేసినట్లయితే మీ ముఖం కాంతివంతంగా మారుతుంది. ఆవనూన్ లో అనేక ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఆవునులో కొవ్వు, ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఈ ఆయిల్ ను చర్మాన్ని తేమగా ఉంటుంది. మస్టర్డ్ ఆయిల్ ను వాడడం వలన చర్మం మృదువుగా తయారవుతుంది. చర్మం పొడిబారకుండా రక్షిస్తుంది.

Jyothi Marikanti

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి