Mustard Oil : చలికాలంలో ఆవనూనె ఇలా వాడితే చాలు… 100 సమస్యలకు చెక్ పెట్టవచ్చు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mustard Oil : చలికాలంలో ఆవనూనె ఇలా వాడితే చాలు… 100 సమస్యలకు చెక్ పెట్టవచ్చు…!

 Authored By jyothi | The Telugu News | Updated on :28 November 2023,10:00 am

ప్రధానాంశాలు:

  •  Mustard Oil : చలికాలంలో ఆవనూనె ఇలా వాడితే చాలు... 100 సమస్యలకు చెక్ పెట్టవచ్చు...!

  •  Health Benefits Of Mustard Oil In Telugu

  •  చర్మం పొడిబారడం, జుట్టు రాలిపోవడం, చుండ్రు రావడం లాంటి సమస్యలు

Mustard Oil : సీజన్ మారినప్పుడు ఎన్నో రకాల సమస్యల బారిన పడవలసి వస్తుంది.. శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి.. చర్మం పొడిబారడం, జుట్టు రాలిపోవడం, చుండ్రు రావడం లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యలకి ఉపశమనం కలిగించడానికి ఈ చలికాలంలో ఈ ఆవ నూనె ను ఇలా వాడితే చాలు. ఈ సమస్యలకి చెక్ పెట్టవచ్చు..
ఆవ నూనెను వంటలకే కాకుండా చర్మ రక్షణకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రధానంగా ఈ చలికాలంలో వచ్చే సమస్యలకి ఆవనూనె చాలా బాగా ఉపయోగపడుతుంది. చలికాలం వచ్చిందంటే చర్మం పొడి వారి పోతూ ఉంటుంది. దాని ఫలితంగా చర్మం కాంతి హీనంగా కనిపిస్తూ ఉంటుంది. దాని వలన ఈ చలికాలంలో చర్మంపై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది.. చర్మ రక్షణకు ఆవనూనె ఎలా వాడాలో ఇప్పుడు మనం చూద్దాం..

ఎగ్జిమా, పొడి చర్మం, సోరియాసి స్ ప్రమాదాన్ని పెంచుతాయి. అయితే ఆవాల నూనెను వాడడం వలన చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. రోజు కొన్ని చుక్కల నూనెతో చర్మానికి మసాజ్ చేసుకోవాలి. ఆవనూనెతో చర్మానికి మసాజ్ చేయడం వలన రక్త ప్రసరణ మెరుగవుతుంది. దీంతో చర్మానికి తగిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆవాల నూనె ముఖంతోపాటు శరీరంలో మిగిలిన భాగాలపై కూడా మసాజ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వలన కండరాల ఒత్తిడిని తగ్గేలా చేస్తుంది.. ఆవ నూనె చర్మంతో పాటు జుట్టును కూడా రక్షిస్తుంది. ఆవనూనె జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. ఈ ఆవాల నూనెతో తలకు మసాజ్ చేయడం వల్ల వెంట్రుకల కుదుళ్ళను మెరుగుపరుస్తుంది. జుట్టు పెరిగేలా చేస్తుంది..

చర్మ నిర్జలీకరణ కారణంగా చర్మం వేగంగా వృద్ధాప్యం చెందుతుంది. కావున చర్మం తేమను రక్షించుకోవడం చాలా అవసరం. నూనె ముడతలు ఫైన్ లైన్లను తొలగించడంలో ప్రభావంతంగా ఉపయోగపడుతుంది. ఆవనూనెలో దూదిని ముంచి ముఖానికి మసాజ్ చేయాలి.. ఇలా చేసినట్లయితే మీ ముఖం కాంతివంతంగా మారుతుంది. ఆవనూన్ లో అనేక ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఆవునులో కొవ్వు, ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఈ ఆయిల్ ను చర్మాన్ని తేమగా ఉంటుంది. మస్టర్డ్ ఆయిల్ ను వాడడం వలన చర్మం మృదువుగా తయారవుతుంది. చర్మం పొడిబారకుండా రక్షిస్తుంది.

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది