Pomegranate Peel Tea : దానిమ్మ తొక్కలతో చేసిన టీ త్రాగారంటే.. ఆ సమస్యలన్నీ మాయం ..!
Pomegranate Peel Tea : అన్ని రకాల పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొన్ని పండ్లతో పాటు వాటి తొక్కలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కొన్ని రకాల పండ్ల తొక్కలు మాత్రమే ఆరోగ్యానికి మేలు చేస్తాయి వాటిలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని నీ పునులు అంటున్నారు. తొక్కలను తినడానికి ఇబ్బంది అయిన వాటిని వేరే మార్గాలలో వాటి ప్రయోజనాలను అందుకోవచ్చని చెబుతున్నారు. దానిమ్మ తొక్కల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. దానిమ్మ తొక్కలతో టీ తయారు చేసుకుని తాగితే చాలా లాభాలు ఉన్నాయి.
దానిమ్మ టీ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా దానిమ్మ తొక్కలను ఎండబెట్టాలి. ఆ తరువాత తొక్కలను బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తరువాత దానిమ్మ తొక్కల పొడిని ఒక డబ్బాలో వేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు నీటిని మరిగించి అందులో ఒక టీ చెంచా దానిమ్మ తొక్కల పొడిని వేసి కొద్దిసేపు మరిగించాలి. అంతే వేడివేడిగా దానిమ్మ తొక్కల టీ రెడీ అయిపోయింది. ఈ టీ ప్రతిరోజు తీసుకుంటే ఆరోగ్యం చక్కగా ఉంటుంది.దానిమ్మ తొక్కల్లో విటమిన్ -సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటితో చేసిన టీని తాగడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాకుండా చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది.
pH బ్యాలెన్స్‌ను సరిగ్గా ఉంచుతుంది. దానిమ్మ తొక్కలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో దానిమ్మ తొక్కలతో చేసిన టీ క్రమం తప్పకుండా తీసుకుంటే, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా గొంతు నొప్పి, దగ్గు, సాధారణ జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.నోటి పూత వంటి వివిధ రకాల దంత సమస్యలను నివారించడంలో సహాయపడే యాంటికేరీస్ లక్షణాలు దానిమ్మ తొక్కలో ఎక్కువగా ఉంటాయి. దీంతో వీటితో చేసిన టీ తాగడం వలన దంతాలు ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉంటాయి.