Home » Health » Health Benefits Of Rose Tea
Health

Rose Tea : ఒక్క గులాబీ టీ వ‌ల్ల‌ 10 రిఫ్రెష్ ప్రయోజనాలు..!

Authored By
aruna
The Telugu News | Published on: July 31, 2023, 7:20 am
Advertisement

Rose Tea : గులాబీ పూల టీ తాగితే ఎన్నో లాభాలు. గులాబీ పువ్వు గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు.. వాటి అందానికి సువాసనకి దాసోహం కాని వారు ఎవరు ఉండరు.. మరొక ప్రయోజనం కూడా ఈ గులాబీ పువ్వులో దాగింది.. ఈ గులాబీ పువ్వులు ఎన్నో ఔషధాలు దాగి ఉన్నాయి. ఈ గులాబీ పువ్వుల రెక్కలతో టీ చేసుకుని తాగడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఈ గులాబీ రెక్కలతో టీ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం… ఒక పాత్రలో కొంత నీటిని తీసుకొని దాన్లో కొన్ని గులాబీ రెక్కలను వెయ్యాలి. తర్వాత కొద్దిసేపు వరకు వాటిని మరిగించాలి.

Advertisement

20 నిమిషాల పాటు స్టవ్ సిం లో పెట్టుకొని మరిగించుకోవాలి. తర్వాత ద్రవాన్ని వడకట్టుకొని దానిలో కొంచెం తేనె కొంచెం నిమ్మరసం వేసి బాగా కలపాలి. దీంతో గులాబీటీ తయారవుతుంది. ఈ టీ తాగడం వలన మొహం పై ఉన్న మొటిమలు మచ్చలు మృతకనాలు తొలగిపోతాయి. చర్మం లో ఉన్న వ్యర్ధాలన్నీ తొలగిపోతాయి. చర్మం మృదువుగా తయారవుతుంది. ఈ గులాబీ టీలో సాహజ సిద్ధమైన యాంటీబయాటిక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తాయి. మహిళలు గులాబీ టీ తాగడం వలన నెలసరి సమస్యలు తొలగిపోతాయి.. అలాగే గొంతు నొప్పి, జలుబు, జ్వరం ఇలాంటి వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

health benefits of rose tea

Advertisement

జీర్ణశక్తి పెరుగుతుంది. మలబద్ధకం, డయేరియా లాంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఒత్తిడి ఆందోళన దూరమవుతాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఈ గులాబీ టీ రోజు తాగితే అధిక బరువు కూడా తగ్గుతారు. అలాగే మైగ్రేన్ తలనొప్పితో బాధపడేవారు ఈటీవీ నిత్యం రెండుసార్లు తాగడం వలన ఆ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న గులాబీ టీ నీ ఒక్కసారైనా తాగాలి…

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి