Rose Tea : ఒక్క గులాబీ టీ వ‌ల్ల‌ 10 రిఫ్రెష్ ప్రయోజనాలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rose Tea : ఒక్క గులాబీ టీ వ‌ల్ల‌ 10 రిఫ్రెష్ ప్రయోజనాలు..!

Rose Tea : గులాబీ పూల టీ తాగితే ఎన్నో లాభాలు. గులాబీ పువ్వు గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు.. వాటి అందానికి సువాసనకి దాసోహం కాని వారు ఎవరు ఉండరు.. మరొక ప్రయోజనం కూడా ఈ గులాబీ పువ్వులో దాగింది.. ఈ గులాబీ పువ్వులు ఎన్నో ఔషధాలు దాగి ఉన్నాయి. ఈ గులాబీ పువ్వుల రెక్కలతో టీ చేసుకుని తాగడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఈ గులాబీ రెక్కలతో టీ ని ఎలా […]

 Authored By aruna | The Telugu News | Updated on :31 July 2023,7:20 am

Rose Tea : గులాబీ పూల టీ తాగితే ఎన్నో లాభాలు. గులాబీ పువ్వు గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు.. వాటి అందానికి సువాసనకి దాసోహం కాని వారు ఎవరు ఉండరు.. మరొక ప్రయోజనం కూడా ఈ గులాబీ పువ్వులో దాగింది.. ఈ గులాబీ పువ్వులు ఎన్నో ఔషధాలు దాగి ఉన్నాయి. ఈ గులాబీ పువ్వుల రెక్కలతో టీ చేసుకుని తాగడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఈ గులాబీ రెక్కలతో టీ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం… ఒక పాత్రలో కొంత నీటిని తీసుకొని దాన్లో కొన్ని గులాబీ రెక్కలను వెయ్యాలి. తర్వాత కొద్దిసేపు వరకు వాటిని మరిగించాలి.

20 నిమిషాల పాటు స్టవ్ సిం లో పెట్టుకొని మరిగించుకోవాలి. తర్వాత ద్రవాన్ని వడకట్టుకొని దానిలో కొంచెం తేనె కొంచెం నిమ్మరసం వేసి బాగా కలపాలి. దీంతో గులాబీటీ తయారవుతుంది. ఈ టీ తాగడం వలన మొహం పై ఉన్న మొటిమలు మచ్చలు మృతకనాలు తొలగిపోతాయి. చర్మం లో ఉన్న వ్యర్ధాలన్నీ తొలగిపోతాయి. చర్మం మృదువుగా తయారవుతుంది. ఈ గులాబీ టీలో సాహజ సిద్ధమైన యాంటీబయాటిక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తాయి. మహిళలు గులాబీ టీ తాగడం వలన నెలసరి సమస్యలు తొలగిపోతాయి.. అలాగే గొంతు నొప్పి, జలుబు, జ్వరం ఇలాంటి వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

health benefits of rose tea

health benefits of rose tea

జీర్ణశక్తి పెరుగుతుంది. మలబద్ధకం, డయేరియా లాంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఒత్తిడి ఆందోళన దూరమవుతాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఈ గులాబీ టీ రోజు తాగితే అధిక బరువు కూడా తగ్గుతారు. అలాగే మైగ్రేన్ తలనొప్పితో బాధపడేవారు ఈటీవీ నిత్యం రెండుసార్లు తాగడం వలన ఆ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న గులాబీ టీ నీ ఒక్కసారైనా తాగాలి…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది