Health Benefits : బయట ఎండలు మండి పోతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఎండ వేడిమికి బయటకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వేడికి దాహం విపరీతంగా వేస్తోంది. ఈ మండు వేసవి కాలంలో చాలా మంది డీహైడ్రేషన్‌కు గురవుతుంటారు. చాలా మందిని వేధించే సమస్య కూడా ఇదే. ఎండలు తీవ్రంగా కొడుతున్న ఈ పరిస్థితుల్లో నీటిని ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. దాహం వేయకపోయినా.. తరచూ వాటర్ తాగుతూ ఉండాలి. శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉంచుకోవడం సమ్మర్‌లో చాలా చాలా ముఖ్యం. బయట తిరిగే వారు అయితే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.ఆరు బయట తిరిగే వారు తరచూ నీటిని తాగడం కుదరదు. అలాంటి వారికి సత్తు షర్బత్ చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఈ షర్బత్‌ను ఇంట్లో చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు.అలా చేసుకోవడానికి సమయం లేని వారు మార్కెట్ నుండి కొనుగోలు చేసుకుని తాగొచ్చు.
వేసవి కాలంలో రోడ్లపై సత్తు షర్బత్ విక్రయిస్తుంటారు. సత్తు షర్బత్ దాహాన్ని తీరుస్తుంది. అలాగే శరీరానికి కావాల్సిన నీటి శాతాన్ని అందించి హైడ్రేట్‌గా ఉంచుతుంది.సత్తు షర్బత్‌ను తీసుకోవడం వల్ల శరీర బరువు కూడా అదుపులో ఉంటుంది. ఇందులో ఔషధ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. కాల్చిన శెనగల నుంచి సత్తు షర్బత్ తయారు చేస్తుంటారు. దీనిని షర్బత్ తయారు చేయడం ద్వారా వినియోగిస్తారు. సత్తు అనేది వేసవిలో ఔషధం కంటే తక్కువ లేని దేశీ పవర్ ఫుడ్. ముఖ్యంగా వేడిని పోగొట్టడానికి .. శరీరానికి శక్తిని ఇవ్వడానికి సత్తు వినియోగం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు షుగర్ పేషెంట్లకు కూడా సత్తుల వినియోగం చాలా మేలు చేస్తుంది. సత్తు అనేది తక్కువ-గ్లైసెమిక్ ఇండెక్స్ పానీయం.. ఇది డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
వేసవిలో ఉత్తమమైన ఆహారం అయిన సత్తు వల్ల చాలా రకాలైన ప్రయోజనాల ఉన్నాయి. సత్తు తక్కువ-గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారం, డయాబెటిక్ రోగులకు ఉత్తమమైన ఆహారం. చల్లబడ్డ సత్తు సిరప్ తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.సత్తు షర్బత్ తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. కాల్చిన శెనగపిండి నుంచి తయారుచేసిన సత్తులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను చక్కగా నియంత్రిస్తుంది. సత్తును తీసుకోవడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. వేసవిలో దాహం తీర్చుకోవడానికి సత్తు షర్బత్ గొప్ప పానీయం. శరీర ఉష్ణోగ్రతను గణనీయంగా తగ్గిస్తుంది. శెనగలను రోస్ట్ చేసిన తర్వాత మిక్సి పడితే సత్తుగా మారుతుంది. దీనిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ప్రొటీన్లు, ఫైబర్, కాల్షియం, ఐరన్, మాంగనీస్.. మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి.
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
This website uses cookies.