Turmeric And Ginger : వంటింట్లో దొరికే ఈ రెండు మన ఆరోగ్యానికి అమృతం లాంటివి… అవేంటో తెలుసా…!!
ప్రధానాంశాలు:
Turmeric And Ginger : వంటింట్లో దొరికే ఈ రెండు మన ఆరోగ్యానికి అమృతం లాంటివి... అవేంటో తెలుసా...!!
Turmeric And Ginger : పసుపు మరియు అల్లం ఈ రెండిటికి కూడా ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే మనం ఎన్నో సంవత్సరాలుగా ఆయుర్వేదాన్ని కూడా ఫాలో అవుతున్నాం. అంతేకాక అనారోగ్య సమస్యలకు వంటింట్లో ఉండే వస్తువులతోనే చెక్ పెట్టొచ్చు అని అంటున్నారు నిపుణులు. అలాంటి వాటిలలో పసుపు మరియు అల్లం కూడా ఒకటి అని చెప్పొచ్చు. అలాగే మన వంటింట్లో తప్పనిసరిగా వాడే ఈ రెండు ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే పసుపు మరియు అల్లం ను పొడి రూపంలో మార్చుకొని తీసుకుంటే మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
ఈ రెండిటిని కలిపి తీసుకోవడం వలన జీర్ణ సంబంధిత సమస్యలు కూడా దూరం అవుతాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే కడుపు ఉబ్బరం మరియు గ్యాస్, మలబద్ధక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. అయితే ఈ పసుపులో ఉండే కర్కుమిన్ అనేది ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. అలాగే అల్లం లో ఉండే జింజరాల్ లో కూడా యాంటీ ఆక్సిడెంట్లు అనేవి ఉంటాయి. దీనివలన ఈ రెండిటిని కలిపి తీసుకోవటం వలన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. అలాగే పసుపు మరియు అల్లం లో ఉండే విటమిన్ సి మరియు విటమిన్ బి 6, మెగ్నీషియం, పొటాషియం, కాపర్,విటమిన్ ఇ,విటమిన్ కే లాంటి పోషకాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలాగే వెదడు పనితీరును మేరుగుపరచటంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది…
తరచుగా వచ్చే వ్యాధులను తరిమి కొట్టడంలో అల్లం మరియు పసుపు హెల్ప్ చేస్తుంది. వీటిలో ఉండే యాంటీ యాక్సిడెంట్స్ అనేవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే పసుపు మరియు అల్లం పొడి పాలలో కలిపి తీసుకుంటే కీళ్ల నొప్పుల నుండి కూడా ఉపశమనం కలుగుతుంది. అంతేకాక కండరాల నొప్పులు కూడా నయం అవుతాయి. ఈ అల్లం మరియు పసుపు పొడి శరీరంలో చెడు కొలస్ట్రాల్ ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. దీని వలన గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా చాలా వరకు తగ్గుతాయి. అలాగే కొలెస్ట్రాల్ స్థాయి అనేది తగ్గడంతో రక్తపోటు కూడా తగ్గిపోతుంది. ఇకపోతే ఈ పసుపు మరియు అల్లం పొడి మెదడు ఆరోగ్యన్ని కూడా కాపాడుతుంది. ఈ పసుపులో ఉంటే కర్కుమిన్ సమ్మేళనం మెదడును కాపాడుతుంది. అలాగే చిన్నపిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచడంలో కూడా బాగా సహాయపడుతుంది . Health benefits of turmeric and ginger powder mix