Health Benefits : వేసవిలో ఎక్కువగా దొరికే.. 90 శాతం నీళ్లు ఉండే పండు కర్భూజ. దీని గురించి తెలియని వాళ్లు.. దీన్ని తినని వాళ్లుండరు అంటే అతిశయోక్తి కాదు. ఎండా కాలంలో మన శరీరానికి కావాల్సిన నీటిని అందిస్తూ… తినేటప్పుడు తియ్యదనాన్ని అందించే ఈ కర్భూజలో అనేక పోషకాలు ఉంటాయి. వేసవి కాలంలో మన శరీరం ఎక్కువ నీటిని కోరుకుంటుంది. చాలా మంది ఎక్కువ నీళ్లు తాగేందుకు ఇబ్బంది పడుతుంటారు. అంతే కాకుండా ఏవైనా జ్యూస్ ల కోసం వెతుకుతుంటారు. అయితే అనారోగ్యాన్ని కల్గించే కూల్ డ్రింక్స్ కంటే కర్భూజ మొదలగు పండ్ల జ్యూసులు తీసుకోవడం వల్ల ఎంతో మంచి జరుగుతుందని. డీహైడ్రేషన్ ని తగ్గించి.. శరీరానికి కావాల్సిన పోషకాలను అందజేస్తుంది.
కర్భూజలో ఉండే పొటాషియం.. రక్తపోటును నియంత్రిస్తుంది. ఇందులో ఉండే అధిక ఫైబర్ వల్ల రక్తపోటు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాకుండా వేసవి కాలంలో సాయంత్రం పూట కర్భూజను ముక్కలుగా కోసి స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు. లేదా జ్యూస్ చేసుకొని కూడా తాగొచ్చు. అలాగే కర్భూజలో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇది తినడం వల్ల ప్రేగు కదలికలను నియంత్రిస్తుంది. మీ పొట్టపై శీతలీకరణ ప్రభావాన్ని కూడా చూపుతుంది. అయితే కర్భూజలో ఉండే 90 శాతం నీటి వల్ల నిర్జలీకరణాన్ని నివారిసుతంది. నీటితో నిండిన పండ్లను, కూరగాయలను తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యం కూడా వస్తుంది. సీజనల్ ఫ్రూట్స్ అయిన పుచ్చకాయ, మామిడి, కివీ, బెర్రీలులను ప్రతిరోజూ తినాలని సూచిస్తున్నారు.
అంతే కాదండోయ్ కర్భూజ చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. కర్బూజలో అధిక మొత్తంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని శుభ్ర పరచడంలో సాయపడతాయి. ఇది చర్మానికి అనుకూలమైన కొల్లాజెన్ తో కూడా లోడ్ చేయబడుతుంది. దీన్ని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీ చర్మానికి మేలు జరుగుతుంది. అయితే కర్భూజను ఫేస్ ప్యాక్ ల తయారీల్లో కూడా ఉపయోగిస్తుంటారు. కర్భూజను ప్రతి రోజూ తినడం వల్ల మీ శరీరానికి అనేక రకాల పోషకాలు అందుతాయి. ఈ వేసవి పండులో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. అలాగే ఫైబర్, విటామిన్ ఎ, ఫోలేట్, పొటాషియం. ప్రోటీన్ మరియు విటామిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవన్నీ మీ శరీరంలోకి చేరి రక్త నాళాలను క్లీన్ చేస్తుంది. అంతే కాకుండా అసలు మీకు బీపీయే రాకుండా చేస్తుంది. ఒక వేళ బీపీ ఉన్న వాళ్లు కర్భూజ తింటే… అది చాలా వరకు కంట్రోల్ అవుతుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.