Health Benefits : రక్తనాళాలను కడిగేసి బీపీని తగ్గించే అద్భుతమైన పండు ఏంటో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : రక్తనాళాలను కడిగేసి బీపీని తగ్గించే అద్భుతమైన పండు ఏంటో తెలుసా?

Health Benefits : వేసవిలో ఎక్కువగా దొరికే.. 90 శాతం నీళ్లు ఉండే పండు కర్భూజ. దీని గురించి తెలియని వాళ్లు.. దీన్ని తినని వాళ్లుండరు అంటే అతిశయోక్తి కాదు. ఎండా కాలంలో మన శరీరానికి కావాల్సిన నీటిని అందిస్తూ… తినేటప్పుడు తియ్యదనాన్ని అందించే ఈ కర్భూజలో అనేక పోషకాలు ఉంటాయి. వేసవి కాలంలో మన శరీరం ఎక్కువ నీటిని కోరుకుంటుంది. చాలా మంది ఎక్కువ నీళ్లు తాగేందుకు ఇబ్బంది పడుతుంటారు. అంతే కాకుండా ఏవైనా జ్యూస్ […]

 Authored By pavan | The Telugu News | Updated on :9 March 2022,1:00 pm

Health Benefits : వేసవిలో ఎక్కువగా దొరికే.. 90 శాతం నీళ్లు ఉండే పండు కర్భూజ. దీని గురించి తెలియని వాళ్లు.. దీన్ని తినని వాళ్లుండరు అంటే అతిశయోక్తి కాదు. ఎండా కాలంలో మన శరీరానికి కావాల్సిన నీటిని అందిస్తూ… తినేటప్పుడు తియ్యదనాన్ని అందించే ఈ కర్భూజలో అనేక పోషకాలు ఉంటాయి. వేసవి కాలంలో మన శరీరం ఎక్కువ నీటిని కోరుకుంటుంది. చాలా మంది ఎక్కువ నీళ్లు తాగేందుకు ఇబ్బంది పడుతుంటారు. అంతే కాకుండా ఏవైనా జ్యూస్ ల కోసం వెతుకుతుంటారు. అయితే అనారోగ్యాన్ని కల్గించే కూల్ డ్రింక్స్ కంటే కర్భూజ మొదలగు పండ్ల జ్యూసులు తీసుకోవడం వల్ల ఎంతో మంచి జరుగుతుందని. డీహైడ్రేషన్ ని తగ్గించి.. శరీరానికి కావాల్సిన పోషకాలను అందజేస్తుంది.

కర్భూజలో ఉండే పొటాషియం.. రక్తపోటును నియంత్రిస్తుంది. ఇందులో ఉండే అధిక ఫైబర్ వల్ల రక్తపోటు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాకుండా వేసవి కాలంలో సాయంత్రం పూట కర్భూజను ముక్కలుగా కోసి స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు. లేదా జ్యూస్ చేసుకొని కూడా తాగొచ్చు. అలాగే కర్భూజలో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇది తినడం వల్ల ప్రేగు కదలికలను నియంత్రిస్తుంది. మీ పొట్టపై శీతలీకరణ ప్రభావాన్ని కూడా చూపుతుంది. అయితే కర్భూజలో ఉండే 90 శాతం నీటి వల్ల నిర్జలీకరణాన్ని నివారిసుతంది. నీటితో నిండిన పండ్లను, కూరగాయలను తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యం కూడా వస్తుంది. సీజనల్ ఫ్రూట్స్ అయిన పుచ్చకాయ, మామిడి, కివీ, బెర్రీలులను ప్రతిరోజూ తినాలని సూచిస్తున్నారు.

Health Benefits reduce colestrol and blood vessels filter juice

Health Benefits reduce colestrol and blood vessels filter juice

అంతే కాదండోయ్ కర్భూజ చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. కర్బూజలో అధిక మొత్తంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని శుభ్ర పరచడంలో సాయపడతాయి. ఇది చర్మానికి అనుకూలమైన కొల్లాజెన్ తో కూడా లోడ్ చేయబడుతుంది. దీన్ని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీ చర్మానికి మేలు జరుగుతుంది. అయితే కర్భూజను ఫేస్ ప్యాక్ ల తయారీల్లో కూడా ఉపయోగిస్తుంటారు. కర్భూజను ప్రతి రోజూ తినడం వల్ల మీ శరీరానికి అనేక రకాల పోషకాలు అందుతాయి. ఈ వేసవి పండులో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. అలాగే ఫైబర్, విటామిన్ ఎ, ఫోలేట్, పొటాషియం. ప్రోటీన్ మరియు విటామిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవన్నీ మీ శరీరంలోకి చేరి రక్త నాళాలను క్లీన్ చేస్తుంది. అంతే కాకుండా అసలు మీకు బీపీయే రాకుండా చేస్తుంది. ఒక వేళ బీపీ ఉన్న వాళ్లు కర్భూజ తింటే… అది చాలా వరకు కంట్రోల్ అవుతుంది.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది