Health Tips : అనారాగ్యోనికి ఎండు అల్లం, లవంగంతో చెక్ పెట్టండిలా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Tips : అనారాగ్యోనికి ఎండు అల్లం, లవంగంతో చెక్ పెట్టండిలా..!

 Authored By pavan | The Telugu News | Updated on :19 February 2022,4:10 pm

Health Tips : ఎండ అల్లం, లవంగాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయమే విషయం మన అందరికీ తెలిసిందే. అయితే వీటిని ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తుంటారు. ఈ రెండింటిని వేర్వేరుగానే కాకుండా ఎండు అల్లం, లవంగం కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయని ఆరోగ్య నిపుుణుులు సూచిస్తున్నారు. అయితే ఎండు అల్లం మెత్తగా చేసిఅనేక సమస్యలలో ఉపయోగిస్తారు. ఇది కాకుండా ఆహారంలో మసాలాగా కూడా ఉపయోగిస్తుంటారు. పొడి అల్లం, లవంగం యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, బీటా వంటి వాటిని కల్గి ఉంటుంది. అయితే ఎండు అల్లం, లవంగాలు తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కల్గుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఎండు అల్లం, లవంగం కలిపి తీసుకోవడం వల్ల ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్‌ ను తగ్గిస్తుంది. అంతే కాకుండా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలి పెరగకుండా కూడా చేస్తుందట. అయితే ఎండు అల్లం శరీరంలోని కొవ్వును కరిగించి, బరువును తగ్గేలా చేస్తుంది. అంతే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఎండు అల్లం, లవంగం ఎంతగానో పనిచేస్తుందట. క్యాప్లిసిని, కుర్కుమిన్ వంటి యాంటీ ఆక్సిండెంట్ మూలకాలు పొడి అల్లం, లవగంలో విపరీతంగా ఉంటాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందట. అలాగే పంటి నొప్పిని తగ్గించడంలోనూ పని చేస్తుందట. లవంగాలలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పంటి నొప్పికి చాలా మేలు చేస్తాయి.

Health Tips for dry ginger and cloves

Health Tips for dry ginger and cloves

లవంగం, ఎండు అల్లం తీసుకోవడం వల్ల పంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. లవంగాలు, ఎండు అల్లం డికాషన్ తాగడం వల్ల శ్వాసకోశ సమస్యలలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎండు అల్లం, లవంగం, తేనె కలిపి తినడం వల్ల శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. అంతే కాకుండా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు అల్లంలోని జింజరాల్ అత్యుత్తమ ఔషధం అంట. అంతే కాదండోయ్ అల్లంలోని వేడికి బాగా చెమట పట్టడం వల్ల శరీరంలోని ట్యాక్సిన్ లన్నీ పోతాయట. దీని వల్ల శరీరం మీద చేరిన వైరస్, బ్యాక్టీరియాలను నాశనం చేసే డెర్మిసిడిన్‌ అనే ప్రొటీన్‌ ఉత్పత్తినీ ఇది పెంచుతుందట.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది