Health Tips : ఈ చెట్టుతో ఆరోగ్యానికి ఎన్నో లాభాలు.. ఎక్కడైనా కనిపిస్తే సీక్రెట్‌గా ఇంట్లో తెచ్చి పెట్టుకోండి..
Health Tips : చాలా వరకు మొక్కలు, చెట్లలో మనకు తెలియని ఎన్నో ఔషద గుణాలుంటాయి. అందులో ఒకటి కోకిలాక్ష చెట్టు దీనిని నీటి గొబ్బిచెట్టు అంటారు. దీనిని రసయానిక హెర్బ్గా గా పరిగణిస్తారు. దీనిని ఆయుర్వేదంలో ఇక్షగంధ, ఇక్షురా, కోకిలాషా, కల్లి అంటూ వర్ణిస్తారు. దీని అర్థం ఏంటంటే భారతీయ కోకిల వంటి కళ్లను కలిగి ఉండటం అని అర్థం. దీని లో చాలా వరకు ఔషద గుణాలుంటాయి. ఇది ఎక్కువగా నీటి కుంటల్లో కనిపిస్తుంది. దీనిని గట్టి ముళ్లు ఉంటాయి. ఆకులు సైతం పొడవుగా ఉంటాయి. సన్నగా ఉంటాయి. కలుగు మొక్కగా ఉంటే వీటితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.ఈ చెట్టు ఆకులు కొద్దిగా చేదుగా ఉంటాయి.
ఈ చెట్టు పురుషులకు చాలా మంచి ప్రయోజనాలను చేకూరుస్తుంది. వీ.. కణాలను వృద్ధి చేయడంలో ఇది సహాయపడుతుంది. టెస్టోస్టెరాన్‌ను పెంచడంలోనూ ప్రముఖ పాత్ర వహిస్తుంది. అంగస్తంభన కలిగించడంలో ఉపయోగపడుతుంది. ఇది కామోద్దీపన ప్రోపర్టీస్ వల్ల లైంగిక శక్తి సైతం పెరుగుతుంది. డయాబెటిస్ ఉన్న వారిలో యాంటీ ఆక్సిడెంట్ ప్రోపర్టీస్ వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలకు నష్టం కలగకుండా నివారిస్తుంది. రక్తంలోని షుగర్ లెవల్స్ ను తగ్గించడంలోనూ సహాయపడుతుంది. ఈ చెట్టుకు సంబంధించిన విత్తనాలకు ఆయుర్వేద చికిత్సల్లో ఎక్కువగా వాడతారు.
Health Tips : వీర్యకణాల వృద్ధిలో..
వీటి వాడకం వల్ల పురుషుల్లో వీ.. ఉత్పత్తి పెరిగి, స్త్రీలలో సంతాన సాఫల్య సమస్యలు తగ్గుతాయి. వీటిని ఉపయోగించి తయారు చేసిన నూనెను వాడటం వల్ల బాడీ పెయిన్స్, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. దీని పౌడర్ మూత్ర సమస్యలను నివారిస్తుంది. ఈ చెట్టు ఇంకా అనేక పేర్లతో పిలుస్తారు. ఈ చెట్టుకు సంబంధించిన వేర్లను తలకు కట్టుకుంటే ప్రశాంతంగా నిద్ర పడుతుంది. నిద్రలేమి సమస్య సైతం దూరమవుతుంది. మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుతాయి.