Black Salt : మీరు ఎప్పుడైనా బ్లాక్ ఉప్పుని తిన్నారా.. దీనితో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Black Salt : మీరు ఎప్పుడైనా బ్లాక్ ఉప్పుని తిన్నారా.. దీనితో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా…?

 Authored By ramu | The Telugu News | Updated on :15 July 2025,9:00 am

ప్రధానాంశాలు:

  •  Black Salt : మీరు ఎప్పుడైనా బ్లాక్ ఉప్పుని తిన్నారా.. దీనితో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా...?

Black Salt : చాలామంది ఎక్కువగా తెల్ల ఒప్పుకునే వినియోగిస్తుంటారు. అయితే,ఈ తెల్ల ఉప్పు కన్నా కూడా ఆయుర్వేదంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉపయోగిస్తున్న నల్ల ఉప్పు గురించి మీకు తెలుసా.. ఈ నల్ల ఉప్పుని హిమాలయ ఉప్పు అని కూడా పిలుస్తారట. మీకు తెలియని ఇంకొక విషయం ఏమిటంటే, పెద్దపెద్ద రెస్టారెంట్లలో, హోటల్స్ లలో ఈ నల్ల ఉప్పుని ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఎందుకంటే, ఇది ఆహారపు రుచిని మరింత పెంచుతుందని,దీనిని మీరు వినియోగిస్తుంటారు. దీని గురించి నిపుణులు ఏమంటున్నారు. నల్ల ఉప్పు వెనుక దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఏమిటో తెలుసుకుందాం…..

Black Salt  ఈ నల్ల ఉప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

నల్ల ఉప్పును తీసుకున్నట్లయితే జీవక్రియ మెరుపు పడుతుంది. ఇది ఆయుర్వేదంలో పురాతన కాలం నుంచి వినియోగిస్తూ వస్తున్నారు. దీనితో కాలేయంలో బైలు ఉత్పత్తి మెరుగుపడుతుంది.జీర్ణకోశంలో యాసిడ్ల స్థాయిలను నియంత్రిస్తుంది. ఇంకా అజీర్తి,గ్యాస్, కడుపుబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. బ్లాక్ సాల్ట్ లో ఉండే ఖనిజాలు మెటబాలిజంను వేగవంతం చేయగలదు.ఈ నల్ల ఉప్పుని,మితంగా సేవిస్తే శరీరంలో పోషకాలు సులభంగా గ్రహిస్తుంది. ఆరోగ్యంగా పుష్టిగా తయారవ్వచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి తెల్ల ఉప్పుకి బదులు, నల్ల ఉప్పు వాడితే మంచిది. ఇందులో ఉండే ఖనిజాలు ఎలక్ట్రోలైట్లు మెడవాలి జనులు వేగవంతం చేసి,బరువు తగ్గడానికి సహకరిస్తుంది.శరీరంలో త్వరగా కలిసిపోయే ఆహార సూచనలను పెంచగలదు. బ్లాక్ సాల్టులో ఉండే గంధకం వల్ల చర్మం పరిశుభ్రంగా తాజాగా తయారవుతుంది. ప్రతిరోజు స్నానం చేసే నీటిలో చిటికెడు నల్ల ఉప్పు వేసుకొని స్నానం చేసినట్లయితే మచ్చలు తొలగిపోతాయి.ఎగ్జిమా తామర వంటి చర్మ సంబంధిత సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి.

ఈ నల్ల ఉప్పు తీసుకున్నట్లయితే శరీరంలో ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. జలుబు,దగ్గులు, ప్లు సమస్యలు తో ఇబ్బంది పడే వారికి, నల్ల ఉప్పు వేడిచేసి పీల్చడం, నల్ల ఉప్పుని వేడి చేసి కాపడం పెట్టుకోవడం వల్ల కూడా చక్కటి ఉపశమనం లభిస్తుంది. ఇంకా పంటి నొప్పి, చివుళ్ళ సమస్యతో బాధపడే వారికి నల్ల ఉప్పు నీటిని, రోజు రెండుసార్లు ఉదయం ఎక్కిలిస్తే సమస్య త్వరగా నయమవుతుంది. నోటి నుంచి వచ్చే దుర్వాసన కూడా తగ్గుతుంది. దంత సమస్యలు కూడా తగ్గుతాయి. నల్ల ఉప్పుని మితంగా తీసుకుంటే శరీరంలో కొవ్వు కూడా తగ్గిపోతుంది. ఫలితంగా గుండెలో నొప్పి,మంట వంటి సమస్యలు దూరం అవుతాయి.రక్తపోటు నుంచి కూడా బయటపడవచ్చు. ఉపకాయం గుండె జబ్బులు వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

మహిళలు పిరియడ్ సమయంలో నల్ల ఉప్పుతో తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకున్నట్లయితే, పీరియడ్ నొప్పి తగ్గుతుంది.పిరియడ్ సమయంలో వచ్చే జీర్ణ సమస్యలు,తలనొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. తలనొప్పి వంటి సమస్యలు కూడా తగ్గిస్తుంది అయితే ఈ బ్లాక్ సాల్టు పింక్ సాల్టు లాంటి వాటిలో కూడా అయోడిన్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సాల్ట్ అదిగా వాడితే మీ శరీరంలో అయోడిన్ లోపం కూడా రావచ్చు కనుక ఈ సాల్ట్ ను వాడాలనుకునేటప్పుడు మీరు వైద్యుల సలహా తీసుకొని ప్రారంభించడం ఉత్తమం. తెల్ల ఉప్పులో అయోడిన్ శాతం ఎక్కువగా ఉంటుంది. అయోడిన్ లోపం ఉన్నవారు మాత్రం తెల్ల ఉప్పుని తీసుకోవాలి.అయోడిన్ లోపం లేనివారు నల్ల ఉప్పుని తీసుకోవచ్చు. కానీ ఎక్కువగా తీసుకోకూడదు తక్కువ మోతాదులో తీసుకోవాలి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది