Ragi Java : రాగిజావ తాగేవారు… తప్పక ఈ విషయాలు తెలుసుకోవాలి… లేదంటే సమస్యలు తప్పవు…?

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Published on: June 16, 2025, 11:00 am
  •  ragi java : రాగిజావ తాగేవారు... తప్పక ఈ విషయాలు తెలుసుకోవాలి... లేదంటే సమస్యలు తప్పవు...?

ragi java: ఈ రోజుల్లో వ్యాధుల సంఖ్య పెరగడంతో ప్రతి ఒక్కరు కూడా తమ ఆహారం విషయంలో శ్రద్ధ పెడుతున్నారు. అందులో రాగులతో చేసిన జావ. ఈ రాగి జావ మంచి ఆహారంగా పరిగణించబడింది. డయాబెటిస్ పేషెంట్లకు ఈ రాగి జావ అద్భుతమైన ఔషధం. జావలో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది.ఇది ఎముకలుకి బలాన్ని ఇస్తుంది. అన్ని ఈ జావా తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తి అందటమే కాకుండా, ప్రతి రోజు తాగితే ఎముకలకు బలం కూడా అందుతుంది. రాగులలో ప్రోటీన్ ఉండడం వల్ల కణాల పునరుద్ధరణకు మరియు శరీర నిర్మాణానికి ఇది దోహదపడుతుంది. అయితే, దీనివల్ల ఇన్ని లాభాలు అయితే ఉన్నాయో.. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు.. అవేంటో తెలుసుకుందాం..

Ragi Java : రాగిజావ తాగేవారు... తప్పక ఈ విషయాలు తెలుసుకోవాలి... లేదంటే సమస్యలు తప్పవు...?

Ragi Java : రాగిజావ తాగేవారు… తప్పక ఈ విషయాలు తెలుసుకోవాలి… లేదంటే సమస్యలు తప్పవు…?

ప్రతిరోజు రాగిజావ తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.ఇది మంచి పోషకాలతో నిండి ఉంటుంది. రాగి జావలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. శరీరానికి కావలసిన శక్తిని తక్షణమే అందించగలదు. దీనిని అన్ని పరగడుపున తీసుకుంటే దీని ప్రభావం శక్తివంతంగా మారి గుణాలు మరింత ప్రభావం అంతగా ఉంటాయి. రాగి జావాలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను శుభ్రం చేస్తుంది. కడుపు సమస్యలు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. రాగి లోపల ఉన్న ఫైబర్ ఎక్కువ కాలం నిండిన భావన కలుగుతుంది. ఇది ఆకలిని నియంత్రించడంలో బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

రాగి లో ఉండే పోషకాలు ముఖ్యంగా కాల్షియం, ఐరన్ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.ఇది ఎముకల బలానికి చాలా అవసరం. తీసుకుంటే ఏది శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. ఎముకలు కూడా బలపడతాయి. రాగిలో ప్రోటీన్ ఉండడం వల్ల కణాల పునరుద్ధరణకు శరీర నిర్మాణానికి ఇది దోహదపడుతుంది. ప్రతిరోజు రాగిజావ తీసుకుంటే .. ప్రయోజనాలతో పాటు కొన్ని అప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే,ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే.. రాగి జావా తాగే టైమ్స్ మొదట ఫిక్స్ చేసుకోవాలి. ఉదయం సమయంలో మాత్రమే రాగిజావని తాగాలి. సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లో రాగిజావని తాగకూడదు. రాత్రి సమయంలో తీసుకోవడం అంత మంచిది కాదు అంటున్నారు వైద్య నిపుణులు. మూత్రపిండాల్లో రాళ్లు లేదా మూత్ర విసర్జన సమస్యలు ఉన్నవారు రాగిజావ కు దూరంగా ఉంటే మంచిది. బరువు పెరగాలనుకునే వారు రాగి జావను ఎక్కువగా తీసుకోకూడదు. కొంచంగా తీసుకోవచ్చు. ఎందుకంటే,రాగి జావా వినియోగంతో బరువు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి.

రాగిజావ అధిక వినియోగం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, డయేరియా వచ్చే అవకాశం ఉంది. కొందరికీ అలర్జీ వంటి సమస్య కూడా రావచ్చు. రాయుడు సమస్యలు ఉన్నవారు రాగులు తీసుకోకపోవడం మంచిది. రాగి లో థైరాయిడ్ గ్రంథి సాధారణ పనితీరుకు ఆటంకం కలిగించే గోయిట్రోజెన్లతో నిండి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp