Yoga : ప్రస్తుతం మనం ఉన్న ఈ జనరేషన్ లో ఆరోగ్య కోసం ఎంతోమంది యోగా చేస్తూ ఉంటారు. అయితే ఈ యోగా చేయటం వలన శరీరం అనేది ఎంతో హెల్తీగా మారుతుంది. అలాగే ఈ యోగా చేయటం వలన మనసు మరియు శరీరం రెండు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. అయితే ఎన్నో మెడిసిన్స్ కూడా చేయలేని అద్భుతాలు అన్నీ కూడా ఈ యోగాలు చేయగలుగుతాయి అని అంటున్నారు.ఇలాంటి యోగాలు చేస్తూ హెల్తీ ఫుడ్ తీసుకున్నట్లయితే, శరీరంతో పాటు మనసు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది.అలాంటి ఫుడ్స్ ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం… అవకాడో టోస్ట్ : అయితే ఎంతో మంది బ్రేక్ ఫాస్ట్ లో బ్రెడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. దీనిలో క్యాలరీలు అనేవి అధికంగా ఉంటాయి. ఇది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను కూడా పెంచగలదు. దీనికి బదులు హెల్దీ బ్రేక్ ఫాస్ట్ గా గోధుమ రొట్టెను లేక వీట్ బ్రెడ్ లో అవకాడో గుజ్జుతో కలిపి తీసుకొంటే మంచిది…
మనలో ఎంతోమంది ఉదయాన్నే దోస లేక ఇడ్లీ లేక పొంగల్ మరియు పూరీ లాంటివి తీసుకుంటూ ఉంటారు. వీటిలో అధికంగా కార్బోహైడ్రేడ్స్ ఉంటాయి. అలాగే రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను కూడా పెంచుతుంది. కావున ఇడ్లీ మరియు దోసకి బదులుగా శనగపిండితో చేసిన రోటీని తీసుకోండి. వాటితో పాటుగా కూరగాయలను కూడా తీసుకోవచ్చు. ఇవి అనేవి ప్రోటీన్స్ రీచ్ దోసగా మారతాయి. అలాగే ఎంతో రుచిగా కూడా ఉంటాయి…
మొలకలు : మీరు వర్కౌట్ చేసిన తర్వాత ఉదయాన్నే మొలకలు తీసుకుంటే ఎంతో మంచిది. దీనిలో ప్రోటీన్ అనేది అధికంగా ఉంటుంది. వీటితో పాటుగా ఉల్లిపాయ, దోసకాయ, ఇలాంటి కూరగాయలను సలాడ్ లా తీసుకుంటే మంచిది. దీంతో శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు కూడా లభిస్తాయి…
పన్నీర్ బుర్జీ : పన్నీర్ లో ప్రోటీన్స్ అనేవి అధికంగా ఉంటాయి. దీనిని ఉదయాన్నే తీసుకుంటే ఎంతో మంచిది. పన్నీరుతో అధికంగా కూరగాయలను కలిపి తీసుకోవడం వలన మరిన్ని పోషకాలు లభిస్తాయి. అయితే టమాట, ఉల్లిపాయ, క్యారెట్ పన్నీర్ వేసుకోని పన్నీర్ బుర్జీ లో గుడ్డును కలుపుకొని తినండి. దీని వలన ఎక్కువ సేపు ఆకలి అనేది వేయదు. యోగా చేసిన తర్వాత అధిక క్యాలరీలు తీసుకుంటే, తక్కువ క్యాలరీలను బర్ను చేస్తుంది. శరీరానికి ఎంతో అవసరమైన ప్రోటీన్స్ తో సహా పోషకాలు కూడా లభిస్తాయి…
గోధుమ రొట్టె, ప్రోటీన్ : మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్ అధికంగా ఉన్నాయి. కాబట్టి మార్నింగ్ యోగ చేసిన తర్వాత గోధుమ రొట్టెతో ప్రోటీన్ అధికంగా ఉండే గుడ్డును తీసుకోవడం మంచిది…
ఓట్స్ : ఓట్స్ కూడా బెస్ట్ వర్కౌట్ ఫుడ్ అని చెప్పొచ్చు. యోగా చేసిన తర్వాత వీటిని తీసుకోవచ్చు. మన బిజీ లైఫ్ లో ఎంతో మందికి ఈ ఓట్స్ ను ఈజీగా చేసుకొని తీసుకోవచ్చు. అందుకే యోగా చేసిన తర్వాత దీనిని తీసుకుంటే మంచిది. ఈ ఓట్స్ లో నట్స్ మరియు సీడ్స్, ఫ్రూట్స్ కలిపి తీసుకోవటం వలన ఫైబర్ మరియు విటమిన్స్ అధికంగా లభిస్తాయి.
సలాడ్ : మీరు ఉదయం మరియు సాయంత్రం యోగాసనాలు చేసిన తరువాత ఈ సలాడ్ తీసుకుంటే మంచిది. దీనిలో కూరగాయలు మరియు ప్రోటీన్స్ ఉండేలా చూసుకోండి. అలాగే ఎగ్ స్పినాచ్ సలాడ్, చిక్ పీ సలాడ్, దోసకాయ క్యారెట్ నట్స్, పనీర్ లాంటి సలాడ్స్ కూడా తీసుకోవచ్చు…
వెజిటేబుల్ సూప్ : యోగ చేసిన తర్వాత మనం తీసుకోవలసిన ఫుడ్స్ లో ఈ వెజిటేబుల్ సూప్ కూడా ఒకటి. ఎన్నో రకాల కూరగాయలతో తయారుచేసిన ఈ సూప్ తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. వీటిలో విటమిన్స్, ఫైబర్, కనిజాలు అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా శరీరానికి ఎంతో శక్తిని ఇస్తాయి…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.