Upset Stomach : వర్షాకాలం వచ్చింది అంటే చాలు ప్రజలు తరచుగా కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే. బయట తినే ఆహార పదార్థాల వలన ఎన్నో రకాల సమస్యలు చుట్టుముడతాయి. కానీ ఇంట్లో చేసినటువంటి ఆహారాన్ని తీసుకోవడం వలన శరీరానికి ఎటువంటి ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ముఖ్యంగా బయట ఫుడ్ తీసుకోవడం వలన కడుపులో ఎన్నో రకాల సమస్యలు మొదలవుతాయి. ఈ వర్షాకాలంలో ఎంతో శుభ్రత కూడా పాటించాలి. లేదంటే అనారోగ్య సమస్యలు రావడం ఖాయం. ముఖ్యంగా కడుపునొప్పి మరియు మోసెస్ లాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే ఈ వర్షాకాలంలో సమోసాలు మరియు పానీ పూరి,ఫాస్ట్ ఫుడ్ ఇవి మాత్రమే కాక ఎన్నో రకాల పదార్థాలు ఎంతో రుచిగా ఉంటాయి అని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ కాలంలో వీటికి దూరంగా ఉంటే మంచిది అని అంటున్నారు నిపుణులు. అయితే మీ కడుపులో ఇన్ఫెక్షన్ అనేది రావటానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. కానీ ఆపరిశుభ్రమైన ఆహారం మరియు నీరు లేక చేతుల ద్వారా కూడా మురికి అనేది శరీరంలోకి పోతుంది. దీని కారణం చేత తరచుగా కదలిక, బలహీనత,వాంతులు, జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ వర్షాకాలంలో తొందరగా ఇన్ఫెక్షలకు గురయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అయితే మీకు కడుపు నొప్పిగా ఉన్నప్పుడు మీరు మందులు తీసుకోకుండా ఉండాలి అంటే మీరు ఇంటి చిట్కాలను పాటించడం వలన తొందరగా ఉపశమనం పొందవచ్చు. అయితే ఈ రెమెడీస్ పూర్తిగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వీటి వలన ఎలాంటి ఎఫెక్ట్స్ కూడా ఉండవు…
ఈ వెనిగర్ అనేది కడుపునొప్పికి మరియు ఇంటి నివారణ విషయానికి వస్తే యాపిల్ సైడర్ వెనిగర్ కన్నా మెరుగైనది ఇంకొకటి లేదు అని చెప్పొచ్చు. అయితే ఈ ఆపిల్ వెనిగర్ లో తగిన మోతాదులో పెక్టీన్ అనేది ఉంటుంది. ఇది కడుపునొప్పి మరియు తిమ్మిర్ల నుండి కూడా ఉపసమణాన్ని కలిగిస్తుంది. దీనిలో ఉండే ఆమ్ల గుణాలు కడుపు ఇన్ఫెక్షన్ ను తగ్గించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ వెనిగర్ కలిపి తీసుకోవటం వలన వెంటనే ఉపశమనం కలుగుతుంది..
అల్లం : అల్లం అనేది కడుపు నొప్పికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీనిలో యాంటీ ఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇవి కడుపు నొప్పి నుండి వెంటనే ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఒక చెంచా అల్లం పొడిని ఒక గ్లాసు పాలలో వేసుకొని తీసుకోవటం వలన వెంటనే ఉపశమనాన్ని ఇస్తుంది…
పెరుగు : పెరుగు వాడకం కూడా కడుపు నొప్పికి ఎంతగానో మేలు చేస్తుంది. అయితే ఈ పెరుగులో ఉండే బ్యాక్టీరియా సమతుల్యతను రక్షించటంలో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. దీంతో కడుపు సమస్య అనేది తొందరగా నయం అవుతుంది. అంతేకాక ఇది కడుపుని ఎంతో చల్లగా కూడా ఉంచుతుంది…
పుదీనా : ఈ పుదీనా అనేది ఎంతో ఆరోగ్యకరమైనది అని చెప్పొచ్చు. అయితే ఇది కడుపుకు సంబంధించిన సమస్యలను నియంత్రించడానికి దీన్ని ఎన్నో శతాబ్దాలుగా వాడుతున్నారు. దీనిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు జీవక్రియను మెరుగుపరచడంలో కూడా ఎంతో మేలు చేస్తాయి…
అరటిపండు : మీరు ప్రతిరోజు మోషన్ సిక్ నెస్ తో బాధపడుతున్నట్లయితే, అరటిపండును తీసుకోవటం వలన వెంటనే ఉపశమనం కలుగుతుంది. దీనిలో ఉన్నటువంటి పెక్టీన్ అనేది కడుపుని కట్టిపడేసేలా పనిచేస్తుంది. దీనిలో ఉన్న పొటాషియం కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.
కడుపు నొప్పి కారణంగా : శరీరంలో నీటి కొరత అనేది వస్తుంది. అలాంటి టైంలో మీరు వీలైనంత నీటిని తాగటం మంచిది. అంతేకాక మీరు పండ్ల రసాన్ని మరియు కూరగాయల రసాన్ని కూడా తాగవచ్చు. అలాగే నీటిలో ఉప్పు కలుపుకుంటే ఇంకా మంచిది. అలాగే మీరు నిమ్మకాయ నీరు, ఉప్పు,చక్కెర ద్రావణం లేక కొబ్బరి నీళ్లను కూడా తాగొచ్చు. ఇలాంటి టైం లో క్యారెట్ జ్యూస్ ను తీసుకుంటే ఎంతో మేలు చేస్తుంది…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.