Upset Stomach : వర్షాకాలంలో వచ్చే కడుపు ఇన్ఫెక్షన్లతో ఇబ్బంది పడుతున్నారా… ఈ ఇంటి చిట్కాలు పాటించండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Upset Stomach : వర్షాకాలంలో వచ్చే కడుపు ఇన్ఫెక్షన్లతో ఇబ్బంది పడుతున్నారా… ఈ ఇంటి చిట్కాలు పాటించండి…!

Upset Stomach : వర్షాకాలం వచ్చింది అంటే చాలు ప్రజలు తరచుగా కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే. బయట తినే ఆహార పదార్థాల వలన ఎన్నో రకాల సమస్యలు చుట్టుముడతాయి. కానీ ఇంట్లో చేసినటువంటి ఆహారాన్ని తీసుకోవడం వలన శరీరానికి ఎటువంటి ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ముఖ్యంగా బయట ఫుడ్ తీసుకోవడం వలన కడుపులో ఎన్నో రకాల సమస్యలు మొదలవుతాయి. ఈ వర్షాకాలంలో ఎంతో శుభ్రత కూడా పాటించాలి. లేదంటే అనారోగ్య సమస్యలు రావడం ఖాయం. […]

 Authored By ramu | The Telugu News | Updated on :28 July 2024,6:00 am

ప్రధానాంశాలు:

  •  Upset Stomach : వర్షాకాలంలో వచ్చే కడుపు ఇన్ఫెక్షన్లతో ఇబ్బంది పడుతున్నారా... ఈ ఇంటి చిట్కాలు పాటించండి...!

Upset Stomach : వర్షాకాలం వచ్చింది అంటే చాలు ప్రజలు తరచుగా కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే. బయట తినే ఆహార పదార్థాల వలన ఎన్నో రకాల సమస్యలు చుట్టుముడతాయి. కానీ ఇంట్లో చేసినటువంటి ఆహారాన్ని తీసుకోవడం వలన శరీరానికి ఎటువంటి ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ముఖ్యంగా బయట ఫుడ్ తీసుకోవడం వలన కడుపులో ఎన్నో రకాల సమస్యలు మొదలవుతాయి. ఈ వర్షాకాలంలో ఎంతో శుభ్రత కూడా పాటించాలి. లేదంటే అనారోగ్య సమస్యలు రావడం ఖాయం. ముఖ్యంగా కడుపునొప్పి మరియు మోసెస్ లాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే ఈ వర్షాకాలంలో సమోసాలు మరియు పానీ పూరి,ఫాస్ట్ ఫుడ్ ఇవి మాత్రమే కాక ఎన్నో రకాల పదార్థాలు ఎంతో రుచిగా ఉంటాయి అని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ కాలంలో వీటికి దూరంగా ఉంటే మంచిది అని అంటున్నారు నిపుణులు. అయితే మీ కడుపులో ఇన్ఫెక్షన్ అనేది రావటానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. కానీ ఆపరిశుభ్రమైన ఆహారం మరియు నీరు లేక చేతుల ద్వారా కూడా మురికి అనేది శరీరంలోకి పోతుంది. దీని కారణం చేత తరచుగా కదలిక, బలహీనత,వాంతులు, జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ వర్షాకాలంలో తొందరగా ఇన్ఫెక్షలకు గురయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అయితే మీకు కడుపు నొప్పిగా ఉన్నప్పుడు మీరు మందులు తీసుకోకుండా ఉండాలి అంటే మీరు ఇంటి చిట్కాలను పాటించడం వలన తొందరగా ఉపశమనం పొందవచ్చు. అయితే ఈ రెమెడీస్ పూర్తిగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వీటి వలన ఎలాంటి ఎఫెక్ట్స్ కూడా ఉండవు…

Upset Stomach యాపిల్ సైడర్

ఈ వెనిగర్ అనేది కడుపునొప్పికి మరియు ఇంటి నివారణ విషయానికి వస్తే యాపిల్ సైడర్ వెనిగర్ కన్నా మెరుగైనది ఇంకొకటి లేదు అని చెప్పొచ్చు. అయితే ఈ ఆపిల్ వెనిగర్ లో తగిన మోతాదులో పెక్టీన్ అనేది ఉంటుంది. ఇది కడుపునొప్పి మరియు తిమ్మిర్ల నుండి కూడా ఉపసమణాన్ని కలిగిస్తుంది. దీనిలో ఉండే ఆమ్ల గుణాలు కడుపు ఇన్ఫెక్షన్ ను తగ్గించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ వెనిగర్ కలిపి తీసుకోవటం వలన వెంటనే ఉపశమనం కలుగుతుంది..

అల్లం : అల్లం అనేది కడుపు నొప్పికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీనిలో యాంటీ ఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇవి కడుపు నొప్పి నుండి వెంటనే ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఒక చెంచా అల్లం పొడిని ఒక గ్లాసు పాలలో వేసుకొని తీసుకోవటం వలన వెంటనే ఉపశమనాన్ని ఇస్తుంది…

పెరుగు : పెరుగు వాడకం కూడా కడుపు నొప్పికి ఎంతగానో మేలు చేస్తుంది. అయితే ఈ పెరుగులో ఉండే బ్యాక్టీరియా సమతుల్యతను రక్షించటంలో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. దీంతో కడుపు సమస్య అనేది తొందరగా నయం అవుతుంది. అంతేకాక ఇది కడుపుని ఎంతో చల్లగా కూడా ఉంచుతుంది…

పుదీనా : ఈ పుదీనా అనేది ఎంతో ఆరోగ్యకరమైనది అని చెప్పొచ్చు. అయితే ఇది కడుపుకు సంబంధించిన సమస్యలను నియంత్రించడానికి దీన్ని ఎన్నో శతాబ్దాలుగా వాడుతున్నారు. దీనిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు జీవక్రియను మెరుగుపరచడంలో కూడా ఎంతో మేలు చేస్తాయి…

అరటిపండు : మీరు ప్రతిరోజు మోషన్ సిక్ నెస్ తో బాధపడుతున్నట్లయితే, అరటిపండును తీసుకోవటం వలన వెంటనే ఉపశమనం కలుగుతుంది. దీనిలో ఉన్నటువంటి పెక్టీన్ అనేది కడుపుని కట్టిపడేసేలా పనిచేస్తుంది. దీనిలో ఉన్న పొటాషియం కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.

Upset Stomach వర్షాకాలంలో వచ్చే కడుపు ఇన్ఫెక్షన్లతో ఇబ్బంది పడుతున్నారా ఈ ఇంటి చిట్కాలు పాటించండి

Upset Stomach : వర్షాకాలంలో వచ్చే కడుపు ఇన్ఫెక్షన్లతో ఇబ్బంది పడుతున్నారా… ఈ ఇంటి చిట్కాలు పాటించండి…!

కడుపు నొప్పి కారణంగా : శరీరంలో నీటి కొరత అనేది వస్తుంది. అలాంటి టైంలో మీరు వీలైనంత నీటిని తాగటం మంచిది. అంతేకాక మీరు పండ్ల రసాన్ని మరియు కూరగాయల రసాన్ని కూడా తాగవచ్చు. అలాగే నీటిలో ఉప్పు కలుపుకుంటే ఇంకా మంచిది. అలాగే మీరు నిమ్మకాయ నీరు, ఉప్పు,చక్కెర ద్రావణం లేక కొబ్బరి నీళ్లను కూడా తాగొచ్చు. ఇలాంటి టైం లో క్యారెట్ జ్యూస్ ను తీసుకుంటే ఎంతో మేలు చేస్తుంది…

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది