Honey, Amla Mixture : పరగడుపున తేనెలో ఉసిరి కాయలను నానబెట్టి తింటే… ఎవరైనా సరే వావ్ అనాల్సిందే.. ప్రయోజనాలు బోలెడు….?
ప్రధానాంశాలు:
Honey, Amla Mixture : పరగడుపున తేనెలో ఉసిరి కాయలను నానబెట్టి తింటే... ఎవరైనా సరే వావ్ అనాల్సిందే.. ప్రయోజనాలు బోలెడు....?
Honey, Amla Mixture: వేద శాస్త్రంలో ఉసిరికాయలకు,తేనెకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆయుర్వేదంలో వీటి వినియోగం అమోఘం. ప్రకృతి పరమైన,ఎంతో ప్రాముఖ్యత కలిగిన సహజ సిద్ధమైన పదార్థాలు. ఇవి ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలను ఇస్తుంది. ఇలాంటి ప్రయోజనాలు కలిగిన రెండిటిని కలిపి తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. ఈరోజు కూడా తేనెలో నానబెట్టిన ఆమ్లా అంటే ఉసిరిని తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఈ తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫలమెంటరీ లక్షణాలు ఉంటాయి. ఈ రెండిటిని కలిపి తీసుకుంటే శరీరానికి ఎన్నో రకాల మేలు జరుగుతుందంటున్నారు నిపుణులు.

Honey, Amla Mixture : పరగడుపున తేనెలో ఉసిరి కాయలను నానబెట్టి తింటే… ఎవరైనా సరే వావ్ అనాల్సిందే.. ప్రయోజనాలు బోలెడు….?
Honey, Amla Mixture తేనెలో నానబెట్టిన ఉసిరి ప్రయోజనాలు
తేనెలో నానబెట్టిన ఉసిరిని తీసుకుంటే జలుబు, ఫ్లూ వంటి అనారోగ్య సమస్యల నుండి రక్షిస్తుంది. కాలంతో పాటు వచ్చే వ్యాధులను అరికడుతుంది. వ్యవస్థను మెరుగుపరుస్తుంది. జీర్ణ క్రియను సులభతరం చేస్తుంది. ఉసిరికాయలో పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతను నివారిస్తుంది. ఉసిరికాయలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు, గుండె జబ్బులను నివారిస్తుంది. తేనే కొలెస్ట్రాల స్థాయిలో తగ్గిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. తేనెతో నానపెట్టిన ఉసిరి కలిపి తీసుకోవడం వల్ల ఆస్తమా బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ సమస్యలు కూడా నివారించబడతాయి. ఉసిరికాయ కాళ్ళ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది కళ్ల దృష్టిని కూడా పెంచుతుంది.
తేనెలో ఉసిరికాయలను నానబెట్టి ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే, మలబద్ధకం సమస్య నివారించబడుతుంది. రోజుకు ఒక ఆమ్లా తినడం వల్ల మీ ముఖం మెరుస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. చర్మంపై ఉన్న ముడతలను తగ్గించి,యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. తేనెలో నానబెట్టిన ఉసిరి, శరీరం నుండి విశాలను తొలగించగలదు. ఇంకా ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుంది. తేనెలో నానబెట్టిన ఆమ్లా, మీ జీవక్రీయను వేదవంతం చేస్తుంది.బరువు తగ్గడానికి సహకరిస్తుంది. అధిక బరువుతో ఇబ్బంది పడే వారికి ఇది దివ్య ఔషధంలా పనిచేస్తుంది. అంతే కాదు, తేనెలో నానబెట్టిన ఆమ్లా మీ జుట్టు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.ఇంకా కళ్ల దృష్టిని పెంచుతుంది.ప్రతిరోజు ఉదయం పరగడుపున తేనెలో నానబెట్టిన ఒక ఆమ్లా తీసుకున్నట్లయితే,మీ ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది. తేనె చదివిరానికి త్వరితశక్తిని అందిస్తుంది. ఉసిరికాయ శరీరానికి శక్తివంతంగా చేస్తుంది. ఈ రెండిటి కలయిక శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది.