Vitamin D And B12 : శరీరంలో విటమిన్ బి12 – డి ఎందుకు ముఖ్యం… ఇవి లేకపోతే ఏం జరుగుతుంది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vitamin D And B12 : శరీరంలో విటమిన్ బి12 – డి ఎందుకు ముఖ్యం… ఇవి లేకపోతే ఏం జరుగుతుంది…!

 Authored By ramu | The Telugu News | Updated on :25 April 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Vitamin D And B12 : శరీరంలో విటమిన్ బి12 - డి ఎందుకు ముఖ్యం... ఇవి లేకపోతే ఏం జరుగుతుంది...!

Vitamin D And B12 : శరీరానికి విటమిన్లు అనేవి చాలా ముఖ్యమైనవి. ఇవి లేకపోతే శరీరం అనారోగ్యానికి గురవుతుందని నిపుణులు చెబుతుంటారు. అయితే శరీరంలో ఉండే ప్రతి విటమిన్ కూడా అనేక రకాల ప్రయోజనాలు కలిగి ఉంటుంది. వీటిలో ముఖ్యంగా విటమిన్ బి12 మరియు విటమిన్ డి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన విటమిన్లు అని చెప్పాలి. శరీరంలో ఈ రెండు విటమిన్ల లోపం ఉన్నట్లయితే అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. ఈ విటమిన్ లోపాలతో బాధపడేవారు వెంటనే వాటి స్థాయిని పెంచే దిశగా ఆహారం తీసుకోవాలని చెబుతున్నారు. మరి ఈ విటమిన్స్ శరీరానికి ఎంత ఉపయోగం.. ఈ విటమిన్స్ లోపం ఏర్పడితే ఏం జరుగుతుంది అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Vitamin D And B12 : విటమిన్ బి12…

శరీరంలో విటమిన్ బి12 లోపం ఏర్పడినట్లైతే అది నాడీ వ్యవస్థ మరియు నరాలను బలహీనంగా చేస్తుంది. అలాగే విటమిన్ డి లోపం ఏర్పడినట్లైతేే ఎముకలలో బలం లేకుండా పోతుంది. తద్వారా చిన్న బరువులకు సైతం ఎముకలు విరుగుతాయి. కావున ఇలాంటి అజాగ్రత్త సమస్యలకు దూరంగా ఉండాలి అంటే కచ్చితంగా ఈ రెండు విటమిన్స్ పుష్కలంగా కలిగి ఉన్న ఆహారాలను తీసుకోవాలి. అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు.

Vitamin D And B12 : విటమిన్ బి12 ,విటమిన్ డి పెరిగితే ఏం జరుగుతుంది..?

ఆరోగ్య నిపుణులు అందిస్తున్న సమాచారం ప్రకారం విటమిన్ బి12 మరియు విటమిన్ డి సప్లిమెంట్లను అనేకసార్లు తీసుకున్నప్పటికీ శరీరంలో వాటి స్థాయి అనేది పెరగదు. కావున ఎలాంటి పరిస్థితుల్లో భయపడాల్సిన అవసరం లేదు.ఒకవేళ ఈ రెండు విటమిన్లు లోపం ఉన్నట్లయితే సప్లిమెంట్స్ తీసుకొని తిరిగి ఆ స్థాయిని పెంచుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. అయితే ఈ రెండు విటమిన్ ల లోపంతో బాధపడేవారు సప్లిమెంట్స్ తీసుకోవడానికి ప్రత్యేకమైన సమయం అంటూ ఒకటి ఉంది. ఇక ఈ సప్లిమెంట్స్ ను రోజులో కేవలం ఒకే సమయంలో మాత్రమే తీసుకుంటే శరీరం వాటి నుండి ప్రయోజనాలను పొందగలుగుతుంది. తద్వారా దుష్ప్రభావాలు కూడా తగ్గిపోతాయి.

Vitamin D And B12 శరీరంలో విటమిన్ బి12 డి ఎందుకు ముఖ్యం ఇవి లేకపోతే ఏం జరుగుతుంది

Vitamin D And B12 : శరీరంలో విటమిన్ బి12 – డి ఎందుకు ముఖ్యం… ఇవి లేకపోతే ఏం జరుగుతుంది…!

Vitamin D And B12 : సప్లిమెంట్స్ తీసుకోవడానికి మెరుగైన…

విటమిన్ బి 12 తో పాటువ విటమిన్ బి1, బి2 బి6 కూడా నీటిలో కరిగే విటమిన్లు.అలాగే విటమిన్ సి కూడా నీటిలో కరిగి పని చేస్తుంది. అయితే ఈ విటమిన్లు అన్నీ కూడా కాళీ కడుపుతో బాగా గ్రహించబడతాయి. కావున ఈ విటమిన్ల లోపాలతో బాధపడేవారు అల్పాహారానికి గంట ముందు లేదా గంట తర్వాత వీటిని తీసుకోవడం మంచిది. తద్వారా శరీరం కూడా ముఖ్యమైన విటమిన్లను గరిష్టంగా పొందగలుగుతుంది.

Vitamin D And B12 : విటమిన్ డి ఎప్పుడు తీసుకోవాలంటే…

విటమిన్ డి అనేది కొవ్వులతో కరిగేది కాబట్టి శరీరంలో ఆహారం లేదా కొవ్వు ఉన్నప్పుడే దాని ప్రభావం కనిపిస్తుంది. కావున ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత దీనిని తీసుకోవడం వలన మంచి ప్రయోజనాలు పొందవచ్చు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది